Japan International Cooperation Agency
-
మెట్రో రెండోదశకు జైకా నిధులు!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ప్రాజెక్టు, మూసీ ప్రక్షాళనకు నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గురువారం మెట్రో రైల్ విస్తరణ, మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు, వివిధ విభాగాల్లో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత అంచనాల మేరకు 70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రెండో దశకు అయ్యే రూ.18,900 కోట్ల వ్యయంలో సుమారు రూ.9,000 కోట్ల వరకు జైకా నుంచి, ఇతర సంస్థల నుంచి రుణాల రూపంలో సేకరించే అవకాశముంది. మెట్రో నిర్మాణ ఒప్పందం మేరకు కేంద్రం 35 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మరో 20 శాతం నిధులు భరించాలి. మిగతా మొత్తాన్ని రుణాల రూపంలో సేకరిస్తారు. ప్రస్తుతం జైకా మాత్రమే అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థపైనే ఆశలు పెట్టుకుంది. మెట్రోతో పాటు, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి కూడా జైకా నిధులే కీలకం కానున్నాయి. ‘ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఆశించిన స్థాయిలోనే రుణాలు లభిస్తాయని భావిస్తున్నాం.’అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
కమీషన్లు దండుకుని ఎన్నికల్లో వెదజల్లే వ్యూహం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల జీవనోపాధుల అభివృద్ధి పథకం కాస్తా అధికార పార్టీ నేతలకు జీవనోపాధి కార్యక్రమంగా మారుతోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.2 వేల కోట్ల వ్యయంతో మధ్య, చిన్న తరహా నీటివనరుల అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. అధిక అంచనా వ్యయంతో కూడిన ఈ పనులను అస్మదీయులకు కట్టబెట్టి, భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. ఆ డబ్బును ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యయం చేసేందుకు భారీ స్కెచ్ వేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో రైతుల జీవనోపాధి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల జీవనోపాధుల అభివృద్ధి పథకం (ఏపీఐఎల్‌ఐపీ ) రెండో దశను ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రూ.1,700 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మిగతా రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. రెండో దశ అమలును పర్యవేక్షించడానికి జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సన్నిహితునికి చెందిన నిప్పాన్ కోయి సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద ఏకంగా రూ.61.29 కోట్లను ఆ సంస్థకు కట్టబెట్టారు. తాజాగా నీటివనరుల అభివృద్ధి, ఆధునికీకరణ పనులను కూడా అస్మదీయులకే కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వెసులుబాటును టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలకు ప్రభుత్వ పెద్దలు కల్పించారు. ఇదే అదనుగా టెండర్లలో టీడీపీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట కుడి కాలువ(50 కిమీ)లు కింద 18,362 ఎకరాలు, ఎడమ కాలువ, ఎడమ హైలెవ్ కాలువ (54.60 కిమీ) కింద 18,691 ఎకరాలు వెరసి 37,053 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. రూ.91.12 కోట్లతో టెండర్లు పిలిచారు. నారాయణపురం ఆనకట్ట, ఎడమ కాలువ ఆధునికీకరణ పనుల(ప్యాకేజీ–ఎ)కు రూ.49.41 కోట్లతో, కుడి కాలువ ఆధునికీకరణ పనుల(బీ ప్యాకేజీ)కు రూ.41.71 కోట్లతో లంప్సమ్(ఎల్ఎస్) ఓపెన్ విధానంలో టెండర్లు పిలిచారు. వీటి నిబంధనలను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రజాప్రతినిధి సూచించిన వారికే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.18 కోట్లకుపైగా కమీషన్లు చేతులు మారినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ కింద 10,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనులకు రూ.49.64 కోట్లతో టెండర్లు పిలిచి.. కీలక మంత్రి సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.8 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లాలో పెన్నార్–కుముద్వతి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.16.83 కోట్లతో నిర్వహించిన టెండర్లలోనూ టీడీపీ ఎమ్మెల్యే సూచించిన వారికే పనులు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.3.2 కోట్లకుపైగా కమీషన్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే జిల్లాలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ.18.94 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిబ్రవరి 4న ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా రూ.3.50 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో దండుకునేందుకు కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.25.75 కోట్లతోను.. అరణియార్ రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.30.65 కోట్లతోనూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు ఫిబ్రవరి 4న కట్టబెట్టి.. రూ.11 కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకోవడానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జికి ప్రభుత్వ పెద్దలు అవకాశం కల్పించారు. కమీషన్లు ఇచ్చిన వారికే టెండర్లు! శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్ట, కృష్ణా జిల్లాలో మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ, చిత్తూరు జిల్లాలో అరణియార్, కృష్ణాపురం జలాశయాలు, అనంతపురం జిల్లాలో ఎగువ పెన్నార్, పెన్నార్–కుముద్వతి తదితర చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు నిర్వహిస్తున్న టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. అంచనాల్లో వంచన నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనుల్లో ప్యాకేజీ–ఎ కింద ఎం–15 కాంక్రీట్ పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.4,407.60 వంతున వ్యయం అవుతుందని లెక్కకట్టిన జలవనరుల శాఖ అధికారులు, పాకేజీ–బి పనుల్లో అదే రకమైన పనులకు క్యూబిక్ మీటర్‌కు రూ.5,184.90 చొప్పున ఖర్చు అవుతుందని తేల్చారు. మున్నేరు బ్యారేజీ ఆధునికీకరణ పనుల్లో కాంక్రీట్ పనుల వ్యయం కూడా క్యూబిక్ మీటర్‌కు రూ.5,883.50కు (2018–19 ఎస్ఎస్ఆర్ మేరకు క్యూబిక్ మీటర్‌కు ఖర్చుయ్యేది రూ.3,900లే కావడం గమనార్హం) పెంచేశారు. అరణియార్, కృష్ణాపురం రిజర్వాయర్లు, పెన్నార్–కుముద్వతి ప్రాజెక్టు, ఎగువ పెన్నార్ జలాశయం తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ పనుల్లోనూ ఇదే ఎత్తున తప్పుడు అంచనాలతో వ్యయాన్ని పెంచేయడం గమనార్హం. -
‘మెట్రో’కు జపాన్ రుణం
2019 నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేయాలని లక్ష్యం * అక్టోబర్ 22న రాజధాని ‘అమరావతి’కి శంకుస్థాపన * ప్రధాని మోదీతోపాటు జపాన్, సింగపూర్ల ప్రధానులకు ఆహ్వానం: కేబినెట్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ సంస్థ(జైకా) రుణ సహకారం రూ.3,600 కోట్లతో విజయవాడలో మెట్రో రైలును పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.6,823 కోట్ల అంచనాతో 2019 నాటికి మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యం విధించుకుంది. కేంద్రం, ఏపీ ప్రభుత్వం చెరో రూ.866 కోట్లను దీనికోసం ఖర్చు చేయనున్నాయి. పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్నవిధంగా విజయవాడ, విశాఖల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం అనుమతించినందున ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) సలహాదారు శ్రీధరన్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరోవైపు రాజధాని అమరావతికి అక్టోబర్ 22న శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగింది. దీంట్లో తీసుకున్న నిర్ణయాల్ని సమాచారమంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. ్హవిజయవాడ మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లు, 25 స్టేషన్లు ఉంటాయి. ఏపీ రాజధాని అమరావతికి మెట్రో రైలు లింకుతో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకు 12.76 కి.మీ., 12 స్టేషన్లు మొదటి కారిడార్‌లో ఉంటాయి. దీని అంచనా వ్యయం రూ.2,558 కోట్లు. * రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు, ఎనికేపాడుల మీదుగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 13.27 కి.మీ., 13 స్టేషన్లు ఉంటాయి. అంచనా వ్యయం రూ.రూ.3,148 కోట్లు. ఈ ప్రాజెక్టుకు 13.20 హెక్టార్లభూమి అవసరం. ్హగ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ల పునరుద్ధరణకుగాను వ్యాట్ మినహాయింపునిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన ఈ ఏడాది అక్టోబరు 22న చారిత్రాత్మక అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. మన భద్రతకు మన పోలీసులే కేబినెట్ నిర్ణయం!గవర్నర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాలని సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం, మంత్రుల ఇళ్ల వద్ద భద్రతకు ఇక నుంచి ఏపీకి చెందిన పోలీసులనే వినియోగించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు చాలా మంది పనిచేస్తున్నారని, ఇకనుంచి వారి సేవలను ఉపయోగించాలని తీర్మానించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘ఓటుకు కోట్ల’ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ కేసులో ఇరకాటంలో పడిన చంద్రబాబు ప్రధానంగా గవర్నర్ పాత్ర, తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న భద్రత, తెలంగాణ ఏసీబీ, దానికున్న అధికారాలు, రాజకీయంగా ఎదురైన ఇబ్బందులు, విభజన చట్టంలోని సెక్షన్ 8 వంటి అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టినట్టు సమాచారం. గవర్నర్ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేశామని, కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని కాకుండా గవర్నర్ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డితో పాటు నోటీసులు అందుకున్న సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి తెలంగాణకు చెందిన వారని, ఒకవేళ ఏసీబీ మనకు ఒక్క నోటీసు ఇచ్చినా అందుకు ప్రతిగా పది నోటీసులు ఇవ్వాలని సీఎం చెప్పినట్టు తెలిసింది. హైదరబాద్‌లో ఏపీ ఉపయోగించుకుంటున్న భవనాలకు ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నోటీసులు ఇచ్చిన అంశం చర్చకు వచ్చింది. ఒక రాష్ర్ట సీఎంగా ఉన్న తాను ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే ఇంత వరకూ మంజూరు చేయలేదని చెప్పినట్టు తెలిసింది. కాగా సీఎం చంద్రబాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కర్ణాటక తరహా మద్యం విధానానికి గ్రీన్‌సిగ్నల్ * కొత్త విధానానికి బాబు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఓటుకు నోట్లు వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మద్యం విధానం తేవడానికి వెనకడుగువేసింది. దీంతో సీఎం చంద్రబాబు , కర్ణాటక తరహా మద్యం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన మద్యం విధానం మార్గదర్శకాలకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన 4,380 మద్యం దుకాణాల్లో 10 శాతం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని, మిగతా వాటిని వేలంపాట, లాటరీ ద్వారా ప్రైవేట్ వారికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ సర్కారు చౌక మద్యం తీసుకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా టెట్రా ప్యాకెట్లలో చౌక మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ. 30 నుంచి రూ. 40 అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న లెసైన్స్ ఫీజులను పెంచి, ప్రాంతాల ఆధారంగా వాటిని హేతుబద్ధీకరించనున్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ మద్యం ఉత్పత్తిని కూడా రాష్ట్రంలోనే చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణ వాళ్లు తరిమేస్తే తీసుకోలేం! * విద్యుత్ ఉద్యోగులపై స్పష్టం చేసిన సీఎం * రెంటికీ చెడ్డ ట్రాన్స్‌కో ఉద్యోగుల పరిస్థితి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు ఏ మాత్రం సానుభూతి ప్రదర్శించలేదని తెలిసింది. సమస్య తీవ్రతను విద్యుత్ ఉన్నతాధికారులు బుధవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే ఏదైనా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ఏపీ ఇంధన కార్యదర్శి అజయ్ జైన్లు సీఎంతో అన్నట్టు తెలిసింది. ‘వాళ్లను తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం? పవర్ సెక్టార్లో ఛాన్స్ ఇస్తే మిగతా శాఖల మాటేంటి? అక్కడా తరిమేస్తే వాళ్లనూ తీసుకుందామా? ఇలా అందరినీ తీసుకుంటే జీతాలు ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ల తిప్పలు వాళ్లను పడమని చెప్పండి. కోర్టు ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయరో టీఎస్ సర్కారును ప్రశ్నించమనండి. ఆందోళనలు చేయమనండి. ...’ అని అధికారులకు చంద్రబాబు గీతోపదేశం చేసినట్టు తెలిసింది. ఈ మాటను నేరుగా చెప్పలేక, విషయాన్ని ఏపీ జెన్కో వెబ్సైట్లో ఉంచారు. కాగా పరిస్థితిని వివరించేందుకు ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీని బుధవారం కలిసే ప్రయత్నంచేశారు. ఆయన మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని సిబ్బంది చెప్పడంతో వారు వెనుదిరిగారు. జెన్కో సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. -
మళ్లీ ప్రపంచబ్యాంకు బాటలో బాబు
రూ.20,000 కోట్ల అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం * ప్రపంచ బ్యాంకు, విదేశీ సంస్థల నుంచి రుణాలు * ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం * వివిధ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రూపొందించాలని ఆదేశం * రంగాలవారీగా ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ప్రపంచబ్యాంకు బాట పడుతున్నారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జెఐసీఏ), డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (డీఎఫ్ఐడీ), యునెటైడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యుఎస్‌ఎఐడీ), కెఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు, కెనడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (సీఐడీఏ)ల నుంచి రుణాలు తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అందులోగల అవకాశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, రవాణా, రహదారులు - భవనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు - పెట్టుబడులు, ఇంధన, విద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, వ్యవసాయం, అటవీ పర్యావరణ శాఖలు విదేశీ అప్పుల కోసం అవసరమైన ప్రాజెక్టులను తయారు చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధితో పాటు సంస్కరణలు చేపట్టేలా వీటిని రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాగానే ఈ ప్రాజెక్టుల నివేదికలను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా విదేశీ సంస్థల నుంచి తీసుకునే అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం మేర గ్రాంటుగా భరిస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. రూపొందించే ప్రాజెక్టులు, తీసుకొనే రుణం.. * వ్యవసాయ, ఇతర రంగాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేర్వేరు చేయడంతో పాటు సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తికి రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్లు * కొత్త రాజధాని నిర్మాణంతో పాటు రోడ్ నెట్వర్క్, నీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణకు కూడా రూ. 3 వేల కోట్లు * జపాన్, చైనా, కొరియన్ టౌన్‌షిప్‌లలాగ ఒక థీమ్ (ఇతివృత్తం) ఆధారంగా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు * జల రవాణా మార్గాల అభివృద్ధికి పర్యాటక కేంద్రాలను రూపొందించి, బకింగ్‌హాం కెనాల్‌ను కాకినాడ, విజయవాడ ఇతర పట్టణాలకు అనుసంధానం చేయడానికి సుమారు రూ. 3 వేల కోట్లు * నాలెడ్జ్ హబ్‌ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు * నగరాలు, పట్టణాల్లో ఉమ్మడిగా మౌలిక వసతుల కల్పనకు రూ. 3 వేల కోట్లు * గుజరాత్‌లోని జీఐఎఫ్‌టీ తరహాలో ఆర్థిక, సాంకేతిక (టెక్నికల్) నగరాల నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు.