తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాలి: జేసీ
జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మహబూబ్‌నగర్ కల్చరల్:
బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టాలని జిల్లా జారుుంట్ కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. బుధవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందన్నా రు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రతిగ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించి నట్లు తెలిపారు. ప్రపంచదేశాలు సైతం తెలంగాణ సంస్కృతిని ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో ప్రారంభమైన ఈ వేడుకలు 26న మండలస్థాయిలో, 28న డివిజన్ స్థాయిలో, అక్టోబర్ 1న జిల్లాస్థాయిలో నిర్విహ ంచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మహిళా టీచర్స్ ఫెడరేషన్‌కు చెందిన ఉపాధ్యారుునులు, స్థానిక తేజ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఎంగిలిబతుకమ్మను సిద్దం చేసి పాటలు పాడుతూ బొడ్డెమ్మలు వేశారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు చంద్రశేఖర్‌రెడ్డి, హరిత, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, పలు శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.