jathi hitham
-
బెడిసికొడుతున్న మన దౌత్యం
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. చైనా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ఆ దేశం పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. భవిష్యత్తు పరిణామాలను ముందే అంచనా వేసి వ్యవహరించడంలో చైనా ముందంజలో ఉండగా, వరుస తప్పిదాలతో మోదీ ప్రభుత్వం వెనుకబడిపోయింది. మోదీ విదేశీ విధానంలో కొనసాగుతున్న అయిదు తప్పులు భారత్‌కు సరైన దౌత్య ఫలితాలను అందకుండా చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉండేదీ, ప్రబలమైనదీ ఏమిటి? భయమా లేక ప్రేమా? ఈ ప్రశ్నకు మీరు మనస్తత్వ నిపుణుడిని సమాధానం అడగాల్సి ఉంది. మరోవైపున రాజకీయ కాలమిస్టు ఏం చేయగలడు కఠిన వాస్తవాలను సేకరించడం తప్ప, కల్పన నుంచి, ప్రచారార్భాటం నుంచి వాటిని వేరుచేయడం తప్ప. వాటి ఆధారంగా ముఖ్యమైన వాదనను ప్రేరేపించడం తప్ప. ఈ వారం ప్రారంభంలో, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం ద్వారా భారత్‌ను తీవ్రంగా చికాకుపెట్టింది. ఐరాస ప్రయత్నాన్ని చైనా నాలుగోసారి అడ్డుకోవడమే కాదు. చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. కమ్యూనిస్టు పార్టీ యాజమాన్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యాత మరీ మోటుగా భారత్ గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశంతో ఉన్న చిత్రాలను చూపిస్తూ నరేంద్రమోదీ ప్రస్తుత పరిస్థితిని తన రాజకీయ ప్రచారానికి వాడుకుం టున్నారని ఆరోపిస్తూ చివరగా ఘోరంగా అవమానిస్తూ ఆ వ్యాఖ్యాత తన వ్యాఖ్యానాన్ని ముగించారు. అదేమిటంటే.. చైనా భారత్ మిత్రురాలే తప్ప దాని జాతీయవాదానికి బందీ కాదు. చైనా ప్రభుత్వం దాని అధికార పార్టీ వాణి ద్వారా తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటింపజేస్తూ, తన దృష్టిలో భారత్‌కి, ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న స్థానమేంటో చూపించిందనడంలో సందేహమే లేదు. ఈ వ్యాఖ్యానం ద్వారా చైనా తన ఊహాన్ భేటీ స్ఫూర్తిని పునర్నిర్వచించింది. మీ దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మీ భూభాగంలో నా సైనిక దళాలు బైఠాయించనట్లయితే, మన మధ్య ఒప్పందాన్ని నేను గౌరవిస్తాను. ఇతరత్రా సందర్భాల్లో మాత్రం పాత నిబంధనలు వర్తిస్తాయి అన్నదే దీనర్థం. చైనా దురహంకార వైఖరిలో కొట్టొచ్చినట్లుగా రెండు స్పందనలు కనబడుతున్నాయి. అవేమిటంటే వాటి స్వరం, వక్కాణింపులే. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ‘ఒక దేశం’ పట్ల తన అసంతృప్తిని అలా వ్యక్తపరిచింది. కానీ అమెరికాకు అలాంటి తటాపటాయింపులు ఏమీ లేవు. భారత్ పిరికి ప్రకటన కంటే ఎంతో నిష్కర్షగా, తీవ్రంగా అమెరికన్లు చైనాను పేరెత్తి మరీ విమర్శించారు. భారత్ తన కండపుష్టిని ఇప్పటికీ కోల్పోలేదు. కానీ, ఇప్పుడు అది మరింత జాగ్రత్తగా తన మాటలను, చేతలను ఎంపిక చేసుకుంటోంది. 2019 మార్చి నెలలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందు భారత్ తన పట్ల శత్రుపూరితంగా వ్యవహరిస్తున్న చైనా పట్ల అధైర్యంతో వ్యవహరిస్తోంది. అదే సమయంలో ట్రంప్ పాలనలోని స్నేహపూర్వకమైన అమెరికాతో మాత్రం పూర్తి స్వదేశీ వాణిజ్య యుద్ధాన్ని భారత్ ప్రారంభి స్తోంది. మనం చైనా అంటే భయపడుతున్నాం. అదే సమయంలో మన తరఫున మాట్లాడుతున్న దేశంతో పోట్లాడుతున్నాం. మోదీ విదేశీ విధాన సూత్రంలో కొనసాగుతున్న అయిదు తప్పులను మనం ఇక్కడ చూద్దాం. 1. మన వ్యూహాత్మక కూటములను మనం పెద్ద హృదయంతో అభినందించడంలో మన వైఫల్యం: వ్యూహాత్మకంగా ట్రంప్ పాలనలోని అమెరికా మనకు ఎంతో బలిష్టమైన పొత్తుదారు, మిత్రురాలు కూడా. కానీ ట్రంప్‌తో మొదలుకుని అమెరికా పాలనా విభాగంలోని ఉన్నత స్థానాల్లో భారత్ గురించి ఒక అలక్ష్యంలాంటిది ఏర్పడిపోయింది. ట్రంప్‌ను దూకుడు పిల్లాడిగా తోసిపుచ్చడానికి భారత్ తొందరపడుతోంది కానీ అలా ప్రకటించేంత సత్తా మనకుందా? హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్‌పై భారత సుంకాల విషయంలో ట్రంప్ దూకుడు చూసి మీరు నవ్వుకోవచ్చు కానీ స్వదేశంలో వాణిజ్యం విషయంలో భారత్ అమలుచేస్తున్న స్వీయ రక్షణ వైఖరిని ట్రంప్ కూడా తప్పుబడుతున్నారు. దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వైద్య పరికరాల ధరలను బాగా తగ్గించివేయడం నైతికంగా, రాజకీయపరంగా మంచి నిర్ణయమే. కానీ ఆకస్మికంగా ధరల నియంత్రణ, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ మీరు ఇలాంటి చర్యలను అమలు చేయగలరా? భారతీయ ఇ–కామర్స్‌లో, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల్లో చైనా పెట్టుబడులను స్వాగతిస్తూనే తమ అమెజాన్, వాల్‌మార్ట్‌లపై యుద్ధం ప్రకటిస్తున్న భారత్.. అమెరికన్లకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. పుల్వామా ఘటన తర్వాత అమెరికా భారత్ పక్షాన నిలిచిన తీరు విశ్వసనీయమైనదే కాగా మరోవైపున మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు, వ్యక్తిగత బంధం విషయంలో అవరోధాలున్నాయి. 2017 నవంబర్ నుంచి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం లేదు.2018 నవంబర్‌లో బ్యూనోస్ ఎయిర్స్లో జీ–20 దేశాల సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య భేటీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు అనుకూలమైన అంశాలను పరిష్కరించకపోతే ట్రంప్ కనీసం ఫోటోలకు, గంభీరమైన ఫోజులకు సమయం వెచ్చించడానికి కూడా ట్రంప్ ఇష్టపడే రకం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యపరంగా అమెరికాకు కాస్త అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల భారత్ కొంపేమీ మునిగిపోదు కదా! అయినా ట్రంప్ ఏమంత పెద్దకోరికలు కోరారనీ. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికన్ సైన్యాలు పడుతున్న పాట్లు పడమని మనల్ని ట్రంప్ కోరడం లేదు. అలాగే రష్యన్ తయారీ ఎస్–400 క్షిపణి వ్యవస్థలను భారత్ కోరవద్దని ట్రంప్ ఒత్తిడి చేయడం లేదు. పైగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవును మూసివేయవలసిందిగా కూడా తను కోరడం లేదు. కొన్ని రకాల సుంకాలపై, వాణిజ్యంపై కాస్త మినహాయింపులను తాను కోరుకుంటున్నారు. తెలివైన నాయకులు ప్రత్యేకించి మిత్రులతో జరపాల్సి వచ్చిన ఘర్షణలను తెలివిగా ఎంచుకుని పరిష్కరించుకుంటారు. ట్రంప్‌తో స్వదేశీ వాణిజ్య యుద్ధరంగాన్ని ప్రారంభించడం ద్వారా మోదీ పెద్దతప్పు చేశారు. 2. అహంకారపూరితమైన అగ్రరాజ్యాలతో ఏకపక్ష బుజ్జగింపు విధానం పనిచేస్తుందన్న తప్పు లెక్క: ఈ అంశాన్ని ఇలా చూద్దాం. అమెరికాతో 60 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులును ఆస్వాదిస్తూనే భారత్ మరోవైపున అమెరికాతో వాణిజ్య సంబంధాలను ప్రతిష్టంభనలోకి నెట్టివేసింది. కానీ చైనాతో మనకు 60 బిలియన్ డాలర్ల లోటు వ్యాపారం ఉంటున్నప్పటికీ ఆ దేశానికి పూర్తిగా అనుమతులు ఇచ్చేస్తున్నాం. చైనా సరకులకు, పెట్టుబడులకు విస్తృతంగా మన మార్కెట్లను తెరవడం వెనుక, భారత్ పట్ల చైనా వ్యూహాత్మక విధానాన్ని మెత్తపర్చే ఆలోచన ఉందేమో. కానీ మనమనుకున్నట్లు ఏమీ జరగలేదు. రెండేళ్ల క్రితం చైనీయులు డోక్లామ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు పంపిస్తున్న సందేశం కూడా మోటుగానే ఉంటోంది. మీరు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో మేము డోక్లామ్ లేక చుమార్ ఘటనలను పునరావృతం కానివ్వకూడదనుంటే థాంక్యూ అనే నోట్‌ను మాకు పంపిం చండి. అమెరికా నుంచి అన్నీ వదులుకోవాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే, చైనానుంచి అన్నీ తీసుకో అనే విధానాన్ని చేపడుతోంది. ఒక దేశాన్ని తక్కువగా చూడటం మరోదేశం ముందు భయంతో సాగిలబడటం అనే విధానమే ఇది. 3. వ్యక్తిగతీకరించిన విదేశీ విధానం పట్ల వ్యామోహం: మోదీకి ప్రజాకర్షణ మిన్న. కానీ వృత్తినైపుణ్యంతో కూడిన దౌత్యానికి సన్నద్ధమవడానికి, దాన్ని కొనసాగించడానికి ప్రజాకర్షణ మాత్రమే సరిపోదు. దీనికి అంతర్గత చర్చ, సంప్రదింపుల ద్వారా విధానాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర నేతల వ్యక్తిగత శైలి, వైఖరులు కూడా వ్యత్యాసంతో ఉంటాయి. మోదీ మంత్రిమండలి కంటే మరింత ప్రతిభావంతంగా పనిచేసే వ్యవస్థను జిన్‌పింగ్ నిర్మించుకున్నారు. మోదీ చైనా అధ్యక్షుడితో తొలిసారి నెరిపిన ప్రేమతో కూడిన భేటీ ప్రయోజనాలు కలిగించలేదని ఇప్పుడు తేలిపోయింది. తర్వాత గ్జియాన్, ఊహాన్ ఇతర చోట్ల కూడా ఇదే కొనసాగింది. మన రిపబ్లిక్ డేకి ట్రంప్‌ను ఆహ్వానించడంలో, నవాజ్ షరీఫ్‌తో విఫల కౌగిలింతలో వేసిన తప్పటడుగులు మనం సరైన హోంవర్క్ చేయలేదని తేల్చేసింది. 4. తప్పు అంచనాలతో మూల్యం: రాజకీయాలు, దౌత్యం, యుద్ధం, క్రీడలు, జూదం అన్నింట్లో సరైన అంచనా చాలా విలువైనది. ఇక్కడే మోదీ తప్పు చేశారు. ఎన్నికలకు ముందుగా మోదీ మరొక దాడికి దిగబోతున్నట్లుగా చైనాకు తెలుసు. పాకిస్తాన్‌పై దాడి చేసి వెనువెంటనే విజయం సాధించామని మోర విరుచుకున్నట్లుగా చైనాతో మోదీ వ్యవహరించలేరని చైనా నేతలకు తెలుసు. సరైన అంచనా వేయడమే చైనీ యులు చేసే మొదటిపని. 5. దేశీయ రాజకీయాలతో విదేశీ విధానాన్ని మిళితం చేయడం: మోదీ స్వదేశంలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం తరచుగా తన విదేశీ విధానాన్ని, సదస్సులను ఉపయోగించుకుంటూ ఉంటారు. సరిగ్గా దీన్నే చైనీయులు మొదటగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎన్నికల సీజన్లో మరొక దాడి జరగొచ్చన్న భారతీయ భయాందోళన చైనాకు తెలుసు. అందుకే ఊహాన్‌లో తమనుంచి భారత్‌కు హామీ ఇచ్చారు కానీ తమ ఆంక్షల ప్రకారమే ఇచ్చారు. చైనా వాణిజ్య ఆధిపత్యం పెరుగుతోంది. అరుణాచల్, పాకిస్తాన్ వ్యవహారాల్లో వారి దృక్పథం మరింత కఠినంగా మారింది. కానీ భారత్ మాత్రం చైనా పేరు కూడా ఎత్తడానికి సాహసించకుండా మసూద్ అజర్ విషయంలో నంగినంగిగా నిరసన తెలుపతోంది దీనివల్లే భారత్ ఎక్కడుండాలో అక్కడే చైనా ఉంచగలుగుతుంది. మొత్తంమీద చూస్తే ఇది మోదీ అయిదేళ్ల పాలనపై విదేశీ విధాన సమతుల్యతా పత్రం కాదు. ఇది మోదీ తీవ్ర తప్పిదాలు, వాటి పర్యవసానాల చిట్టా మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సంస్కరణలు జనంలోంచి రావాలి
కేరళలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన తొలి వివాదం నుంచి ఆరెస్సెస్/బీజేపీ లబ్ధిపొందే అవకాశం సుప్రీంకోర్టు తీర్పు వల్ల లభించింది. దీన్ని కాషాయపక్షం జనంలో తన పునాదులు విస్తరించుకోవడానికి విజయవంతంగా వాడుకోగలదా? లేక ప్రతిదీ సంశయాత్మక దృష్టితో చూసే మలయాళీలు హిందుత్వవాదుల ప్రచారాన్ని తిప్పికొడతారా? వివక్ష పాటించే మత సంప్రదాయాలను రద్దు చేయాల్సిన అవసరముంది. దురాచారాలను రూపుమాపాల్సింది సామాజిక, రాజకీయ సంస్కర్తలేగానీ న్యాయస్థానాలు కాదు. కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పోవాల్సిందే. కానీ వాటిని ప్రజలు వదులుకోవాలంటే సంస్కరణలు జనం లోపలి నుంచే రావాలి. కేరళ హిందుత్వ నాయకులు తెలివి తక్కువ వారై ఉండాలి. లేదా దుర్మార్గమైన హాస్య చతురత కలిగి ఉండాలి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి పది నుంచి 50 ఏళ్ల వయసున్న స్త్రీలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వారు నిరసన తెలుపు తున్నారంటే వారి ప్రవర్తనకు నేను ముందు చెప్పినవే కారణాలు. వాస్త వానికి తమకు పరోక్షంగా మేలుచేసిన సుప్రీంకోర్టు జడ్జీలకు ఈ నేతలు పుష్పగుచ్ఛాలు, ఆశీర్వాదాలు పంపాల్సింది. రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీ తీర్పు సదుద్దేశంతో ఇచ్చినా, హిందుత్వవాదులకు గొప్ప అవ కాశం కల్పించింది. కేరళలో ఎదగడానికి అవసరమైన పునాది నిర్మించు కోవడంలో రెండు తరాల ఆరెస్సెస్–జనసంఘ్–బీజేపీ నేతలు విఫలమ య్యారు. ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల హిందుత్వ నేతలు చివరి అడ్డంకి దాటి బలోపేతం కావడానికి ఆస్కారమిచ్చింది. తమిళనాడులో రెండు ప్రధాన పక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదైనా బీజేపీతో కలిసి సంకీ ర్ణంలో చేరగలవు. కేరళలో మాత్రం ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండూ బీజేపీని సమానంగా వ్యతిరేకిస్తాయి. కేరళలో చోటు సంపాదించడానికి ఆరెస్సెస్ కార్యకర్తలు వామ పక్షాలతో ఘర్షణ పడుతున్న క్రమంలో హత్యలు జరు గుతున్నాయి. రాజధాని తిరువనంతపురంలో తప్ప రాష్ట్రంలో ఇంకెక్కడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. 2014లో తిరువ నంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ కంటే కేవలం 15 వేల ఓట్లు తక్కువ వచ్చాయి. కేరళలో హిందువుల విశ్వాసాలకు సంబంధించిన తొలి వివాదం నుంచి ఆరెస్సెస్/బీజేపీ లబ్ధి పొందే అవకాశం సుప్రీంకోర్టు తీర్పువల్ల లభించింది. దీన్ని కాషాయపక్షం జనంలో తన పునాదులు విస్తరించుకోవడానికి విజయవంతంగా వాడుకోగలదా? లేక ప్రతిదీ సంశయాత్మక దృష్టితో చూసే మలయాళీలు హిందుత్వవాదుల ప్రచా రాన్ని తిప్పికొడతారా? ఇక్కడ తమ పరిధి పెంచుకోవడానికి హిందుత్వ శక్తులకు మంచి అవకాశం దొరికిందనేది మనకు కళ్లకు కనిపించే వాస్తవం. కోర్టు తీర్పుపై నిరసన తెలపడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలను భారీ సంఖ్యలో సమీకరించాయి. ఈ స్త్రీలలో ఎక్కు వమంది సంస్కృత పదాలు, ఉచ్చారణతో కూడిన హిందీ మాట్లాడ డానికి కారణం వారంతా ఆరెస్సెస్ వ్యవస్థలో శిక్షణపొందడమే. నేడు పెద్ద సంఖ్యలో వారు శబరిమల చేరుకోవడంలో తప్పేమీ లేదు. హిందూ మితవాదశక్తులు కేరళలో బలపడే అవకాశం ఇచ్చిన ఉదారవాద న్యాయ మూర్తులకు కృతజ్ఞతలు చెప్పకతప్పదు. ‘సుప్రీం’ జోక్యంతో ఊహించని పరిణామాలు! మతం సహా అన్ని విషయాలను చట్టం, రాజ్యాంగ సూత్రాలను బట్టి తీర్పు చెప్పే సుప్రీం కోర్టు జోక్యం ఫలితంగా ఊహించని పరిణామాలు ఎలా ఎదురౌతాయో శబరిమల వివాదం చక్కటి ఉదాహరణ. సుప్రీం కోర్టు విచారణ తీరు చూస్తే– అది ఏ మతం అయినా హేతుబద్ధమనే నమ్మకంతో సాగుతుందనిపిస్తోంది. దేవుడి అవతారాలపై విశ్వాసం హేతుబద్ధమేనా? లేక ఒకే దేవుడు లేదా దేవత వందలాది అవతారాలు కూడా హేతువుకు నిలుస్తాయా? ఏ దేవుడు లేదా దేవతకు సంబంధిం చిన అనేక అవతారాలను సమర్థిస్తూ శోధించి పరిశోధనా పత్రాలు సమర్పించగలరా? లేక కన్యకు బిడ్డ పుట్టాడని నిరూపించగలరా? శివుడు, విష్ణు అవతారమైన మోహినీ సంపర్కంతో అయ్యప్ప స్వామి పుట్టాడని తేల్చిచెప్పేవారున్నారా? ఏసు పునరుత్థానం సంగతి? మహ్మద్ ప్రవక్తకు అల్లా చెప్పిన విషయాలే పవిత్ర గ్రంథం ఖురాన్‌లోనివని చెప్ప డానికి సాక్ష్యం ఏదని ఏదైనా కోర్టు అడుగుతుందా? ఇంకా అనేక ఆది వాసీ విశ్వాసాలు, జంతువులను పూజించడం, సూర్య, చంద్రారాధన, జంతు బలుల సంప్రదాయాలు, ఆచారాలకు హేతుబద్ధమైన ఆధారాలు అడిగితే? ఎవరు చెప్పగలరు? ఓ చెట్టు మీదో, రాయి మీదో ఎవరైనా తెల్ల సున్నం లేదా కాషాయ రంగు వేసినా లేదా పాడుబడిన సమాధిపై కొన్ని ఆస్బెస్టాస్ రేకులతో షెడ్డు వేస్తే పెద్ద సంఖ్యలో జనం ఈ ప్రదే శాలకు వచ్చి ప్రార్థనలు, పూజలు చేయడం మొదలెడతారు. ఇలాంటి విషయాలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానాలు విచారిస్తాయా? రోమన్ క్యాథలిక్ పీఠంలో స్త్రీలకు సమాన హక్కులు, పదవులు ఇవ్వాలని ఆదేశించాలంటూ ఎవరైనా క్రైస్తవ మహిళ సుప్రీంకోర్టును అభ్యర్థిస్తే ఏమవుతుంది? క్రైస్తవ మతబోధకులను యూపీఎస్సీ తరహా సంస్థ ఎంపిక చేయాలని కోర్టు ఆదేశిస్తే? ఆరెస్సెస్‌లోని అన్ని పదవుల్లో స్త్రీలకు కూడా స్థానం కల్పించాలని ఆదేశించాలంటూ ఓ హిందూ మహిళ జడ్జీ లను అడగగలదా? అలాగే, ఆరెస్సెస్‌కు ఓ మహిళ నాయకత్వం (‘సర్ సంఘ్చాలికా’?) వహిస్తే నిజంగా బావుంటుంది. ఇది భవిష్యత్తులో జరగొచ్చేమో కూడా. అయితే, ఇది ఏదైనా కోర్టు ఆదేశాలపై మాత్రం జరగదని మాత్రం మీరు ఖాయంగా నమ్మవచ్చు. భిన్న విశ్వాసాలతో మనమంతా మొత్తంమీద శాంతియుత సహ జీవనం కొనసాగించడానికి కారణం భారతీయులుగా మనం మన పొరు గువారిని ప్రశాంతంగా ఉండనివ్వడమే. మత విశ్వాసాల విషయానికి వస్తే మన ప్రభుత్వం (రాజ్యం) అత్యంత స్వల్పస్థాయిలోనే వాటిలో జోక్యం చేసుకునే సంప్రదాయం మొన్నటి వరకూ కొనసాగింది.. హిందూ కోడ్ బిల్లుపై విపరీతమైన చర్చ జరిగిందిగాని దానిపై వివా దాల కారణంగా అది చట్టం కాలేదు. పార్లమెంటులో చర్చలు, మెజారిటీ ద్వారానే హిందూ పర్సనల్ చట్టాలు, సంప్రదాయాల్లో జవహర్లాల్ నెహ్రూ మార్పులు తీసుకొచ్చారు. ఇలాంటి సంస్కరణలను అత్యుత్తమ సుప్రీంకోర్టు బెంచ్‌లు కూడా గత కొన్ని దశాబ్దాల్లో చేయలేకపోయా యని నేను అత్యంత వినమ్రతతో చెప్పగలను. అదే కోర్టు నేడు ట్రిపుల్ తలాక్ చెల్లదని ప్రకటించింది. ప్రస్తుత పాలకపక్షం రాజకీయాలు భిన్నమైనవి కావడం వల్ల ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, ఈ కారణంగా పోలీసులు వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లలోకి ప్రవేశించి, పురుషులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయడం మనం నిజంగా చూస్తున్నామా? అదే జరిగితే ఇప్పటికే భయంతో వణికిపోతున్న మతవర్గం మరింత భయోత్పాతా నికి గురికాదా? ముమ్మారు తలాక్ అనేసి విడాకులివ్వడం భరించరాని విషయమే. అనేక ముస్లిం దేశాలు ఈ పద్ధతిని రద్దుచేశాయి. భారత ముస్లింలు కూడా ముమ్మారు తలాక్‌కు మంగళం పాడాలి. ఇలాంటి సంస్కరణలు ఆయా సమాజాల లోపలి నుంచే రావాలి. అంతేగాని ‘ఉదారవాద’ తీర్పుతో లభించిన అధికారంతో పోలీసుల ద్వారా కాదు. వ్యక్తిగత స్వేచ్ఛే శబరిమల తీర్పునకు కారణమా? వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం కారణంగానే శబరిమల వివాదంపై ఇచ్చిన తీర్పును సమర్థించుకున్నారని అర్థమౌతోంది. పిల్లలు కనే వయ సులో ఉన్నారనే సాకుతో స్త్రీలను అయ్యప్ప గుడిలోకి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు? ఈ మహిళలు తమ స్త్రీత్వంతో బ్రహ్మచారి అయిన దేవుడి దృష్టికి ‘భంగం’ కలిగిస్తారని మనం ఎలా నమ్మాలి? స్త్రీలను శబరిమల గుడిలోకి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును ప్రశంసిస్తూ మీడి యాలో సంపాదకీయాలు, పొగడ్తల వర్షం కురిసింది. సమానత్వం సాధించడానికి సుప్రీం మంచి తీర్పు ఇచ్చిందన్న సామాజిక కార్యకర్తలు మరో అంశం పరిష్కార దిశగా ప్రయాణం ప్రారంభించారు. అమలు చేయడానికి సాధ్యంకాని కోర్టు ఉత్తర్వులపై ప్రజలు చర్చించారా లేక దానిపై పరిశోధనా పత్రాలున్నాయా? అంటే జవాబు లేదనే వస్తుంది. మతాలతో సంబంధం లేకుండా టూవీలర్లు నడిపే మహిళలంతా హెల్మెట్లు తప్పనిసరిగా పెట్టుకోవాలన్న కోర్టు ఉత్తర్వు సిక్కుల నిరస నలతో తర్వాత రద్దయింది. అయినా, భద్రత గురించి ఆలోచించే సిక్కు మహిళలు హెల్మెట్లు ధరించడం పెరుగుతోంది. వారిని జన సమూహా లేవీ అడ్డుకోవడం లేదు. కొన్ని ముస్లిం తెగల్లో స్త్రీల మర్మాంగాల్లో కొన్ని భాగాలను తొల గించడం(ఎఫ్‌జీఎం)పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపు తోంది. కోర్టు ఈ దురాచారం చెల్లదని తీర్పు ఇవ్వవచ్చు. కానీ ఆ ఉత్త ర్వును అమలు చేయగలరా? ఈ తెగ ముస్లింలు నివసించే మహా రాష్ట్ర, గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వాలు కూడా పైన చెప్పిన నేరం చేసిన వారిని తమ పోలీసులతో ప్రాసిక్యూట్ చేయించగలవా? పోలీసులు అలా చేయలేమంటే ఏం చేస్తాయి? కొన్నిసార్లు జడ్జీల కన్నా రాజకీయ నేతలు తెలివిగా ప్రవర్తిస్తారు. ట్రిఫుల్ తలాక్‌పై ఆగ్రహం ప్రకటించిన నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం సైతం స్త్రీల మర్మాంగాల కోత విషయంపై మౌనం పాటి స్తున్నారు. వారణాసిలోని ఓ ఖబరిస్తాన్లో షియా–సున్నీ వివాదంపై 40 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యంకాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో సుప్రీం కోర్టు దాని అమలుపై స్టే ఇచ్చింది. ఎలాంటి వివాదాస్పద సంప్రదాయం లేదా దురాచారమైనా చెల్లదని ఇచ్చే తీర్పులు న్యాయపరంగా, సామాజిక, రాజకీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇలాంటి కాలం చెల్లిన ఆచారాలు, సంప్రదాయాలు పోవాల్సిందే. కానీ వాటిని ప్రజలు వదు లుకోవాలంటే సంస్కరణలు జనం లోపలి నుంచే రావాలి. కోర్టుల జోక్యం ద్వారా మాత్రమే పైన చెప్పిన సామాజిక రుగ్మతలను తొల గించడం సాధ్యం కాదు. కోర్టుల అనవసర జోక్యం వల్ల ఆశించని పర్యవసానాలు ఎదురౌతాయి. శబరిమల తీర్పుతో కేరళలో బీజేపీ బలపడే అవకాశాలు మెరుగవ్వడం వంటి పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఆ అవిచ్ఛిన్నతే మన విలక్షణత
ఎన్‌ఎస్‌సీఎన్‌తో శాంతి ప్రక్రియకు 1995లో పీవీ నరసింహారావు శ్రీకారం చుట్టగా, ఇప్పుడు మోదీ దాన్ని పరిపూర్తి చేశారు. దీనిని ఈ దృష్టి కోణం నుంచి చూడండి. ఈ ప్రక్రియకు ఇరవై ఏళ్లు పట్టింది. ఆరుగురు ప్రధానుల ప్రభుత్వాలు మారాయి. అయినా భారత పరిపాలనా వ్యవస్థతో చర్చలు జరపడం విధానపరమైన కొనసాగింపుగానే ఉంటుం దని సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వాలు రావచ్చు, పోవచ్చు. కానీ రాజ్య వ్యవస్థ కొనసాగింపు మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుండాల్సిందే. కుశాగ్రబుద్ధులైన నాయకులకు తమకున్న సమయం పరిమితమని, అధికా రం పరివర్తనాత్మకమైనదని తెలిసి ఉంటుంది. అలాంటివారిలోకెల్లా ఎక్కువ తెలివిమంతులకు మరో గుణం కూడా ఉంటుంది. తమ పదవీ కాలంలోగా పూర్తి చేయలేమని తెలిసి కూడా కొన్ని పనులను ప్రారంభించడానికి వారు భయపడరు. మెరుపు వేగపు కాలంలోనూ.... అసహనంతో కూడిన నేటి మెరుపు వేగపు కాలంలో ఇదో సంక్లిష్ట సూత్రీకరణే అవుతుంది. పెద్ద ప్రజాస్వామ్య దేశాల నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ప్రజలతోనూ, తోటి దేశాధినేతలతోనూ సంభాషిస్తున్న కాల మిది. ఆ సంభాషణ, ఫ్రాన్స్‌లోని రీయూనియన్ దీవిలో దొరికిన విధ్వంస శకలం, 515 రోజులుగా కనిపించకుండా పోయిన ఎమ్హెచ్ 370 విమానా నిదేననే ధ్రువీకరిస్తూ మలేసియా ప్రధాని రాసి పంపిన 400 పదాల సందే శమే కావచ్చు. లేదా నాసా అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములతో ఒబామా ట్వీటర్లో ప్రేమపూర్వకంగా పరిహాసాలాడి అమెరికా ప్రజలను ఉల్లాస పరచడమే కావచ్చు. లేదంటే నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 6.30 నిమిషాలకు ఒక ముఖ్య నిర్ణయాన్ని ప్రకటిస్తాననే ఉత్కంఠభరితమైన 100 అక్షరాల వ్యాఖ్యతో మొత్తంగా భారతావనిని వేచి చూసేట్టు చేయడమే కావచ్చు. ఏదేమైనాగానీ ఈ మెరుపు వేగపు యుగంలో కూడా పరిపాలన ఓపికగా నిర్వహించాల్సిన వ్యవహారమే. మీరొకవేళ దీన్ని మరింత భావుకతా రహితంగా, సాదాసీదాగా చెప్పా లంటే మార్పు జరిగే వేగం అనొచ్చు. లేదంటే బీబీసీ యాంకర్ నిక్ గోవింగ్ అన్నట్టు ‘రియల్ టైమ్’ (జరుగుతున్న దాని సమాచారాన్ని అది జరుగుతుండగానే చేరవేస్తుండటం) నిరంకుశత్వమనే మరింత బలీ యమైన వ్యక్తీకరణను అరువు తెచ్చుకోవచ్చు. ఏదేమైనా అసాధారణంగా పరిణతి చెందిన రాజకీయాలకు, కుశాగ్రబుద్ధులైన నాయకులకు సంస్థాగతమైన నిరంతరాయతను కొనసాగించడానికి ఇప్పుడా రియల్ టైమ్ సమాచార సంబంధాలు అవసరం అవుతున్నాయి. లేదా తమ కాలంలో ఫలప్రదం కావడాన్ని చూడలేని ప్రాజె క్టులను ప్రారంభించగలిగే ఆత్మ విశ్వాసాన్ని కలిగించడానికి లేదా మరెవరైనా ప్రారంభించి, పూర్తి చేయకుండా ఆ బాధ్యతను తమ వారసులకు వదిలి పోతే... వారు తమ ప్రత్యర్థులే అయినా వాటిని పూర్తి చేయడానికి తోడ్పడు తున్నాయి. మోదీ ‘‘ముఖ్య ప్రకటన’’ తుయింగాలెంగ్ మ్యువా, ఇసాక్ చిసి స్వుల నేతృత్వంలోని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్ఎస్సీఎన్)తో ఒప్పందం స్వరూప స్వభావాల చట్రానికి సంబంధించి మిగిలి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సంబంధించినది. కాబట్టి ఈ నిరంత రాయతను గురించి చర్చించడానికి ఈ వారం సరిగ్గా సరైనది. చైనా శిక్షణ పొందిన ఈశాన్య ఆదివాసి తిరుగుబాటుదారుల గ్రూపులలో చెప్పు కోదగిన స్థాయిదైన ఎన్ఎస్సీ ఎన్తో శాంతి ప్రక్రియ 1995లో మొదలైంది. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ నరసింహారావు దానికి శ్రీకారం చుట్టారు. గౌడ-గుజ్రాల్ హయాంలో కూడా అది కొనసాగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి దానికి నూతనోత్తేజాన్ని కలుగజేయగా, మన్మోహన్సింగ్ దశాబ్దికిపైగా ఆ ప్రక్రియ ను దృఢంగా కొనసాగించారు. ఇప్పుడు మోదీ దాన్ని పరిపూర్తి చేశారు. దానిని ఈ దృష్టి కోణం నుంచి చూడండి. ఈ ప్రక్రియకు ఇరవై ఏళ్లు పట్టింది. ఈ కాలంలో ఆరుగురు ప్రధానుల ప్రభుత్వాలు మారాయి. అయినా భారత పరిపాలనా వ్యవస్థతో చర్చలు జరపడం విధానపరమైన కొనసాగింపుగానే ఉంటుందని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో ప్రభుత్వాలు రావచ్చు, పోవచ్చు. కానీ రాజ్య వ్యవస్థ కొనసాగింపు మాత్రం అవిచ్ఛిన్నంగా కొనసాగు తుండాల్సిందే. అనవసర నిష్టూరం వివిధ అంశాలపై మోదీ ప్రభుత్వం... తమ సొంత ఆలోచనల, తాము చొరవ తో చేపట్టిన కార్యక్రమాల ఖ్యాతి తమదేనని కాజేస్తోందంటూ కాంగ్రెస్ హేళన చేస్తోంది. అలా కాంగ్రెస్ హేళన చేస్తున్న వాటిలో నేటి నాగా ఒప్పందం తోపాటూ, బంగ్లాదేశ్‌తో కుదిరిన భౌగోళిక సరిహద్దు ఒప్పందం, అణు ఒప్పందం అమల్లోకి వచ్చే విధంగా అణు పరిహార బాధ్యత నిబంధనలను సడలించడం, నిజాయితీతో ఆధార్ అమలును చేపట్టడం, ఆధార్ సహాయం తో లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీని ఎల్పీజీ సబ్సిడీతో ప్రారంభిం చడం, ఆటోమేటిక్‌గా దేశంలోకి రిటైల్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేయడం, ఇన్సూరె న్స్ రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐ తదితరమైనవి ఉన్నాయి. ఇవన్నీ వాస్తవంగా యూపీఏ హయాంలో పుట్టుకొచ్చిన ఆలోచనలే, నిజమే. కానీ ఆ వాస్తవానికి కొన్ని పరిమితులూ వర్తిస్తాయి. మొదటిది, యూపీ ఏ నిండా పదేళ్లూ అధికారంలో ఉంది. కొత్త ఆలోచనలను చలామణిలోకి తేవడానికి తగ్గ మద్దతు, సమయమూ కూడా దానికి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే, వాటిని ఆచరణలోకి తెచ్చే సమయం కూడా దానికి ఉంది. కానీ జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) ఒత్తిళ్లు దాని దృష్టిని మరల్చాయి. ఉదాహరణకు ఆధార్, ప్రత్యక్ష లబ్ధి బదలాయింపు, రిటైలు ఎఫ్‌డీఐ తదితర అంశాలను ఎన్సీఏ అనుమానాస్పందంగా చూసింది. దీనికి తోడు, కుంభ కోణాల రుతువు ప్రారంభమై, 2011లో అన్నా హజారే ప్రత్యక్షం కావడంతో యూపీఏ తన రాజకీయ పెట్టుబడిని కోల్పోతూ వచ్చిన వేగానికి వారు దారి తప్పి పోయారు. మోదీ తమ ఆలోచనలను దొంగిలించారని ఆరోపించడానికి బదులుగా, వాటిని ఆయన మరింత శక్తివంతంగా ముందుకు తీసుకుపోతు న్నందుకు వారు సంతోషించాలి. తక్కువగా పరిణతి చెందిన ప్రజాస్వామ్యం లో మునుపటి ప్రభుత్వానికి వారసులుగా వచ్చిన వారిలో తమకు ముందటి వారు ప్రారంభించిన ప్రతి దాన్నీ చెత్తబుట్టలో పారేయాలనే ఉబలాటం ఉంటుంది. ఈ విషయంలో తద్విరుద్ధంగా జరుగుతోంది. అయితే ఇది కొత్తది గానీ లేదా అసాధారణమైనది గానీ కాదు. జాతీయ స్థాయి నేతలు చాలా మందే ఇలాంటి ఫలిత ప్రాధాన్యవాదాన్ని ప్రదర్శించేవారు. సరిగ్గా ఇప్పుడు అధికారంలో ఉన్నవారి లాగే, వారిలో కొందరు ఆ ఖ్యాతి కోసం అత్యు త్సాహంతో పాకులాడీ ఉంటారు. మంచి యోచన ఎవరిదైనా మంచిదేగా? యూపీఏకున్న మేధోపరమైన ఆధిక్యతను తమ ప్రయోజనానికి వాడుకోవ డమనే మోదీ యోచన మంచిదే. అయితే ఆయన అంతకే పరిమితంగాక, విప్లవాత్మక ఆలోచనలకు ప్రజామద్దతును సమీకరించడమనే మరో శక్తిని కూడా ముందుకు తెచ్చారు. నగదు రూప ఎల్పీజీ సబ్సిడీని పేదలకు అనుకూలమైన సంస్కరణగా ఆయన చలామణి చేశారు. పేద ప్రజలకు ఇచ్చే ఎల్పీజీ సబ్సిడీ... దొంగిలించడానికి సైతం అతి తక్కువ విలువైనదనే అభిప్రాయం ఏర్పడేలా ‘‘గివ్ ఇట్ అప్’’ (సబ్సిడీ వదులుకునే) కార్య క్రమాన్ని తానే స్వయంగా ప్రచారం చేశారు. ఒబామాతో ఉమ్మడి పత్రికా సమావేశంలో నిలచి ఆయన... భారత-అమెరికా మైత్రికి అణు ఒప్పందం అత్యంత కీలకమై నదని చెప్పారు. బంగ్లాదేశ్‌తో భౌగోళిక సరిహద్దు ఒప్పం దం విషయంలో ఆయన తన వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టారు. ఇక ఇప్పుడాయన నాగా ఒప్పందాన్ని ప్రధాని అధికారిక నివాసంలోని పెద్ద ఘటనగా మార్చారు. మోదీ తమ ఆలోచనలపై స్వారీ చేస్తున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తోంది. కానీ ఆలోచించి చూడండి, మరే చిన్నపాటి దేశంలోనో ఆయితే ఆయన వాటిని చెత్తబుట్టకు చేర్చేవారే. యూపీఏనే గనుక మరింత ఆత్మవిశ్వాసంగల ప్రభుత్వమో లేదా మరింత మెరుగైన రాజకీయ నిర్వాహ కులో అయి ఉంటే ఇలా వంటకాల జాబితానంతటినీ అర్ధంతరంగా వంటగది బల్లపై వదిలేసేవారే కారు. ఈ విమర్శల గోలను పక్కనబెడితే, అతి ముఖ్య సంఘటనలతో నిండిన ఈ వారంలో మన చర్చనీయాంశం ‘అంతా మంచే’ అనే వాదనే. దేశాల తలరాతలను మలచడంలో మార్పు ఎంత ముఖ్యమైనదో, సంస్థా గతమైన కొనసాగింపు కూడా అంతే ముఖ్యమైనది. మన రాజకీయ వ్యవస్థ ఎంతగా రెండుగా చీలిపోయి ఉన్నప్పటికీ, పార్లమెంటు పనిచేయ కుండా పోయినా, రాజకీయ వాతావరణంలో విద్వేషం వ్యాపించి ఉన్నా మనమింకా మంచి ఆలోచనలను కేవలం అవి మరెవరివో అనే కారణం తో మూలన పారేయడం లేదు. ఈ వారంలో జరిగిన ఘటనలు దానినే రుజువుచేస్తున్నాయి. దేశానికి మన నేతల కానుక మన నాయకులు దేశానికి విధానపరమైన కొనసాగింపు అనే కానుకను ప్రసాదించారు. కొన్ని సందర్భాల్లో వారు సంకుచితమైనవే అయినా కీల కమైన తమ ప్రయోజనాలను త్యాగం చేశారు. అలా స్వార్థ రాజకీయ ప్రయోజనాలను పరిత్యజించినందుకు గానూ వెనక్కు మళ్లారనే ఆరోపణ లను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అంశంపై మీరు ఓ గ్రంథమే రాయొచ్చు. పీవీ నరసింహారావు అణు పరీక్షలను జరపడానికి అవస రమైన సన్నాహాలన్నిటినీ చడీ చప్పుడు కాకుండా ఎలా పూర్తి చేశారనేది నాకు ఇష్టమైన ఉదాహరణ. అణు పరీక్షలను కూడా నిర్వహించి ఉంటే అది ఆయనకు 1996 ఎన్నికల్లో లబ్ధిని చేకూర్చేదే. కానీ అంతటి సాహ సోపేతమైన చర్యను చేపట్టి కూడా నెట్టుకురాగల రాజకీయ పెట్టుబడి తనకు గానీ, తగిన ఆర్థిక, రాజకీయ శక్తిసామర్థ్యాలు దేశానికి గానీ ఆనాడు లేవని ఆయనే అంగీకరించారు. తదుపరి వెలువడిన పలు కథనా లు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అత్యంత గౌరవీయులైన అణు శాస్త్రవేత్త అనిల్ కాకోద్కర్ ఇటీవల నాకో ఇంటర్వ్యూలో వెల్లడి చేసిన విషయాలు కూడా వాటిలో ఒకటి. వాజ్‌పేయి అధికారం చేపట్టినప్పుడు పీపీ నరసింహారావే స్వయంగా ఆయనతో మొత్తం ‘‘సామగ్రి’’నంతా సమకూర్చి ఉంచానని చెప్పిన విషయం కూడా సుప్రసిద్ధమైన వాస్తవమే. 1988 నాటికి వాజ్‌పేయి దేశానికి అవసరమైన ఆర్థిక, దౌత్యపరమైన శక్తి సమకూరిందనే నిర్ధారణకు వచ్చారు. ఆ పనిని పూర్తి చేశారు. ప్రస్తుతం మోదీ అమలులోకి తెస్తున్న చాలా ఆలోచనల్లాగే, వాజ్‌పేయి కూడా పూర్వ ప్రభుత్వం తలపెట్టిన అణు పరీక్షలను పరిపూర్తి చేశారు. అలా మోదీ అమలు చేస్తున్న వాటిలో నాగా ఒప్పందం కూడా ఒకటి. కాబట్టే ఇది ఇంతగా మనం సంతోషపడాల్సిన అద్భుతమైన వారమైంది. తాజా కలం: సోవియట్ నిర్వహించిన అంతరిక్ష కార్యక్రమంలో (1984) పాల్గొన్న ఏకైక భారతీయుడు స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ మాత్రమే. అతనితో టెలిఫోన్ సంభాషణలో ఇందిరాగాంధీ... అంతరిక్ష నౌకలో పరిభ్రమిస్తూ చూస్తుంటే భారతదేశం ఎలా కనిపిస్తోందని ప్రశ్నించారు. అందుకు సిద్ధంగా ఉన్నట్టుగా శర్మ ‘సారే జహాసే అచ్ఛా’ (ప్రపంచంలోకెల్లా ఉత్తమమైనది) అంటూ భారతీయులంతా ఎరిగిన కవి ఇక్బాల్ చరణాన్ని బదులుగా చెప్పారు. అలా ఇందిర ఆ క్షణాన్ని అజరా మరమైందిగా మార్చారు. కాలం మారింది. తదనుగుణంగానే సమాచార సాదానాలు కూడా మారాయి. కాబట్టే రెండు ట్వీటర్ హ్యాండిల్స్‌ను ఉపయోగించే అమెరికా అధ్యక్షుడు ఒబామా నాసా అంతరిక్ష కేంద్రం తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అక్కడి వ్యోమగాములతో పరిహాసోక్తులు సాగించారు. ‘‘హేయ్ స్టేషన్ సీడీఆర్కెల్లీ, మీరు పంపిన ఫొటోలను చూస్తున్నాను. ఎప్పుడైనా నువ్వు కిటికీలోంచి బయటకు చూసి మతిపోగొట్టుకున్నావా?’’ అని అడిగారు. కెల్లీ అనే ఆ వ్యోమగామి ‘‘అధ్యక్షా! నేను దేని గురించీ మతిపోగొట్టుకోను... ట్వీటర్లో మీరు సంధించే ప్రశ్న గురించి తప్ప’’ అంటూ మన రాకే ష్ శర్మ కంటే ఒకింత ఎక్కువ లాంఛనంగా అతడు సమాధానం చెప్పాడు. అయితేనేం, లక్షలాది మంది ప్రశంసలను అందుకున్నాడు. రియల్ టైమ్ సాంకేతికత, నిరంకుశత్వం అనేవి బుద్ధికుశలురైన, ఆధునిక నాయకుల చేతుల్లో ఎంతటి బలమైన సమాచార సాధనాలు కాగలు గుతాయో ఇది తెలుపుతుంది. అయితే ఇరాన్‌తో ఒప్పందంపై ప్రజాభి ప్రాయాన్ని, కాంగ్రెస్ మద్దతును కూడగట్టడానికి కూడా ఒబామా తన ట్వీటర్ హ్యాండిల్స్‌ను నిరంతరాయంగా కూడా వాడుతున్నారనుకోండి. (శేఖర్ గుప్తా.. twitter@shekargupta)