Javad Zarif
-
భారత్‌పై మండిపడ్డ ఇరాన్.. తీవ్ర వ్యాఖ్యలు!
టెహ్రాన్: భారత రాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలపై ఊచకోత జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు... ‘‘భారత్‌లో జరుగుతున్న ముస్లిం నరమేధంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల హృదయాలు ద్రవించిపోతున్నాయి. హిందూ ఉగ్రవాదులను, వారి పార్టీలను భారత ప్రభుత్వం అడ్డుకోవాలి. ముస్లింలపై జరుగుతున్న ఊచకోతను ఆపాలి. ఇస్లాం ప్రపంచం నుంచి వేరుగా ఉండేందుకు చేపడుతున్న చర్యలు ఆపేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలి’’అని ఖమేనీ ట్వీట్ చేశారు. ఇందుకు ఢిల్లీ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి భౌతికకాయం ముందు పిల్లాడు ఏడుస్తున్న ఫొటోను జతచేసి... ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్, అరబిక్ భాషల్లో ట్విటర్లో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.(ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ) ఈ క్రమంలో... ఇరాన్ అధినాయకుడిగా దేశ భద్రత, విదేశాంగ విధానాలపై నిర్ణయం తీసుకునే ఖమేనీ.. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. భారత ముస్లింల గురించి బాధపడుతున్న ఆయన.. సొంత దేశం ఇరాన్లో ముస్లింలపై జరిగిన ఊచకోతను గుర్తుచేసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ కూడా ఢిల్లీ అల్లర్లను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ కొన్ని శతాబ్దాలుగా ఇరాన్ భారత్‌తో స్నేహం కొనసాగిస్తోంది. భారతీయులందరూ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. విచక్షణారహిత అల్లర్లు చెలరేగకుండా చూసుకోవాలి. శాంతియుత చర్చలు, చట్టం ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. భారత ముస్లింలకు వ్యతిరేకంగా చెలరేగిన హింసను ఇరాన్ ఖండిస్తోంది’’ అని జావేద్ ట్వీట్ చేశారు.(విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్) అదే విధంగా ఇండోనేషియా సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్లపై స్పందించాల్సిందిగా తమ దేశంలో భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. భారత్‌లో సుహృద్భావ వాతావరణం నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ... సున్నిత అంశాలపై బాధ్యతా రహితంగా మాట్లాడవద్దని అంతర్జాతీయ నాయకులు, సంస్థలకు సూచించారు. అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ.... పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 53 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక సుదీర్ఘకాలంగా ఇరాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్... అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనూ సంయమనం పాటించిన విషయం విదితమే. ఇరాన్ జనరల్ సులేమానిని అమెరికా హతమార్చిన తర్వాత ఇరాన్ మంత్రి జావేద్ జరీఫ్ భారత్‌లో పర్యటించి పలు అంశాలపై చర్చలు జరిపారు. The hearts of Muslims all over the world are grieving over the massacre of Muslims in India. The govt of India should confront extremist Hindus & their parties & stop the massacre of Muslims in order to prevent India’s isolation from the world of Islam.#IndianMuslimslnDanger — Khamenei.ir (@khamenei_ir) March 5, 2020 -
విమానాన్ని మేమే కూల్చేశాం: ఇరాన్
-
అవును.. మేమే కూల్చేశాం: ఇరాన్
టెహ్రాన్: ఉక్రెయిన్ విమానాన్ని తామే కూల్చివేశామని ఇరాన్ అంగీకరించింది. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. బాధితుల కుటుంబాలు తమను క్షమించాలని అభ్యర్థించింది. ఘటనకు కారణమైన వారిపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు... ‘ఇది విషాదకరమైన రోజు. అమెరికా సాహసోపేత చర్యల వల్ల తలెత్తిన సంక్షోభంలో మానవ తప్పిదం వల్ల ఈ దుర్ఘటన సంభవించిందని.. మా సైన్యం జరిపిన అంతర్గత విచారణలో ప్రాథమికంగా తేలింది. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నాం. బాధితుల కుటుంబాలు, వారి దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ ట్వీట్ చేశారు. కాగా ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానం బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్ పౌరులు, 10 మంది స్వీడిష్ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్ పౌరులు. 63 మంది కెనడియన్లు) మరణించారు.(176 మంది మృతి; కెనడాకు ఇరాన్ విఙ్ఞప్తి!) ఈ నేపథ్యంలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమాని మృతికి ప్రతీకారంగా ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు ప్రయోగించిన క్రమంలో ఈ దుర్ఘుటన జరిగిందని పాశ్చాత్య దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో విచారణకు ఆదేశించినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలుత విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ప్రమాదం జరిగిందని ఇరాన్ తెలిపింది. ఈ క్రమంలో విమానంపై క్షిపణి దాడి జరిగినట్లు ఉన్న ఈ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. క్షిపణి దాడి తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో దాడికి బాధ్యత వహిస్తూ ఇరాన్ ప్రకటన చేయడం గమనార్హం.(వైరల్ : విమానాన్ని కూల్చిన ఇరాన్ మిస్సైల్..!) క్షిపణి వల్లే కూలింది..! దద్దరిల్లుతున్న ఇరాక్.. మరో రాకెట్ దాడి ఆ దేశాల మీదుగా వెళ్లేటప్పుడు జాగ్రత్త!! 80 మంది చచ్చారు.. ఇంకా 100 లక్ష్యాలు! A sad day. Preliminary conclusions of internal investigation by Armed Forces: Human error at time of crisis caused by US adventurism led to disaster Our profound regrets, apologies and condolences to our people, to the families of all victims, and to other affected nations. 💔 — Javad Zarif (@JZarif) January 11, 2020 -
ఇరాన్‌కు అమెరికా షాక్!
వాషింగ్టన్ : అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించడంతో.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నుంచి పరస్పరం హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్‌కు వీసా నిరాకరించింది. గురువారం న్యూయార్క్‌లో జరగనున్న ఐకరాజ్య సమితి భద్రత మండలి సమావేశానికి జరీఫ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశాల్లో సులేమానీ హత్యకు సంబంధించి ఆయన అమెరికా వైఖరిపై విమర్శలు చేసే అవకాశం ఉండటంతోనే.. ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 1947 యూఎన్ ‘హెడ్ క్వాటర్స్ ఒప్పందం’ ప్రకారం యూఎన్‌కు హాజరయ్యే విదేశాలకు చెందిన దౌత్యవేత్తలకు అమెరికా తమ దేశంలోకి అనుమతించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం భద్రత, తీవ్రదాదం, విదేశాంగ విధానం కారణాలను చూపి అమెరికా జరీఫ్‌కు వీసా నిరాకరించింది. అలాగే దీనిపై స్పందించడానికి అమెరికా విదేశాంగ శాఖ ఇష్టపడలేదు. మరోవైపు ఇరాన్ తరఫు ప్రతినిధులు మాత్రం.. జరీఫ్ వీసాకు సంబంధించి అమెరికా నుంచి గానీ, యూఎన్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వెల్లడించారు. అమెరికా జరీఫ్‌కు వీసా నిరాకరించిందనే వార్తలపై స్పందించడానికి యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ నిరాకరించారు. గతేడాది ఏప్రిల్, జూలైలలో కూడా జరీఫ్ యూఎన్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో జరీఫ్తోపాటు ఇతర అధికారులపై రవాణా పరమైన ఆంక్షలు విధించింది. వారిని న్యూయార్క్‌లోని కొద్ది ప్రాంతానికే పరిమితమయ్యేలా చేసింది. -
'అమెరికా ఆరోపణలు నిరాధారం'
టెహ్రాన్: మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ చర్యలను ఇరాన్ ప్రోత్సహిస్తోందన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరిఫ్ తోసిపుచ్చారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన జరిఫ్.. కెర్రీ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇరాన్‌పై కెర్రీ చేసిన వ్యాఖ్యలను ప్రపంచంలో ఎవరూ పరిగణలోకి తీసుకోరని జరిఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్య ప్రస్తుతం మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నది నిజమేనని అయితే దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఇరాక్ ప్రాంతంలో అమెరికా ఆక్రమణలకు పాల్పడటమే అని జరిఫ్ విమర్శించారు. కొన్ని దేశాలు తమ స్వల్పకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం మూలంగానే ఇస్లామిక్ ఉగ్రవాద ప్రాభల్యం పెరుగుతోందని జరిఫ్ అన్నారు. గురువారం బహ్రెయిన్‌లో పర్యటించిన కెర్రీ మాట్లాడుతూ.. మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ పరిస్థితులకు ఇరాన్ కారణమని, ఆ దేశం తన పద్దతిని మార్చుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.