టెహ్రాన్: మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ చర్యలను ఇరాన్ ప్రోత్సహిస్తోందన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరిఫ్ తోసిపుచ్చారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన జరిఫ్.. కెర్రీ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇరాన్పై కెర్రీ చేసిన వ్యాఖ్యలను ప్రపంచంలో ఎవరూ పరిగణలోకి తీసుకోరని జరిఫ్ పేర్కొన్నారు.
ఉగ్రవాద సమస్య ప్రస్తుతం మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నది నిజమేనని అయితే దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఇరాక్ ప్రాంతంలో అమెరికా ఆక్రమణలకు పాల్పడటమే అని జరిఫ్ విమర్శించారు. కొన్ని దేశాలు తమ స్వల్పకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం మూలంగానే ఇస్లామిక్ ఉగ్రవాద ప్రాభల్యం పెరుగుతోందని జరిఫ్ అన్నారు.
గురువారం బహ్రెయిన్లో పర్యటించిన కెర్రీ మాట్లాడుతూ.. మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ పరిస్థితులకు ఇరాన్ కారణమని, ఆ దేశం తన పద్దతిని మార్చుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.
'అమెరికా ఆరోపణలు నిరాధారం'
Published Sun, Apr 10 2016 6:43 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement