baseless
-
అత్యాచార ఆరోపణలను ఖండించిన సజ్జన్ జిందాల్
ముంబై: తనపై నమోదైన అత్యాచార కేసుపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ స్పందించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమని పేర్కన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న సజ్జన్ జిందాల్ కేసు విచారణ కొనసాగుతున్నందున దీనిపై మరింతగా వ్యాఖ్యానించలేనని వివరించారు. సజ్జన్ జిందాల్‌పై 30 ఏళ్ల వైద్యురాలైన మహిళ ఈ ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ముంబైలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు చేసి చాలా నెలలు గడిచినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ మహిళ ఆరోపించారు. 2021లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్‌లో తాను సజ్జన్ జిందాల్‌ను కలిశానని ఆ మహిళ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని సజ్జన్ జిందాల్ తనను నమ్మించాడని, 2022 జనవరి 24న తనపై అత్యాచారం చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. -
ఆమె ఆరోపణలు నిరాధారం..
సాక్షి, కృష్ణా జిల్లా: దళిత పారిశ్రామికవేత్త లక్ష్మీ నరసింహన్ ఆరోపణలపై డీఎస్పీలు సత్యానందం, షేక్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. మంగళవారం డీఎస్పీ సత్యానందం మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహన్ పోలీసులపై చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు. ‘‘నందివాడ మండలం తమిరిస గ్రామంలో లక్ష్మీ నరసింహన్ 147 ఎకరాల రొయ్యల చెరువు సబ్ లీజుకు తీసుకొని సాగు చేస్తోంది. మచిలీపట్నం, గుడివాడ పరిధిలో లక్ష్మీ నరసింహన్ ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఫిర్యాదులు విచారణ దశలో ఉన్నాయి. 2018లో మచిలీపట్నం పరిధిలో పలువురిపై కేసు పెట్టిన లక్ష్మీ నరసింహన్ తాను ముదిలియార్ కులానికి చెందినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: చెమ్మచెక్క ఆడుతున్నావా? మంత్రి అనిల్ ఫైర్) గత అక్టోబర్‌లో నూకల రామకృష్ణ, అతని కుమారుడు బాలాజీ కులం పేరుతో దూషించారని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మహిళా పోలీస్ డీఎస్పీ ఆధ్వర్యంలో చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం. విచారణ జరుగుతుండగానే తన చెరువులో 150 టన్నుల రొయ్యలను దొంగిలించినట్లు మరో ఫిర్యాదు చేసింది. లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండో ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు లేకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదని’’ ఆయన వివరణ ఇచ్చారు. (చదవండి: మాట తప్పడమే బాబు నైజం!) చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది.. మహిళా పోలీస్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహన్, నూకల రామకృష్ణకు చెరువు సబ్ లిజ్ సొమ్ము తో పాటుగా, ఆరు లక్షల కరెంట్ బిల్లులు బకాయిలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. 20 టన్నుల రొయ్యలను, తన బకాయిగా జమ చేసుకొని రామకృష్ణ తీసుకెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. సంబంధం లేని ఇతర ఆర్థిక లావాదేవీల కేసులను నూకల రామకృష్ణ కేసుతో ముడి పెట్టడం వల్ల విచారణ ఆలస్యమవుతుందని పేర్కొన్నారు. పోలీసులపై లక్ష్మీనరసింహన్ చేసిన వాఖ్యలు పూర్తి నిరాధారం. ఆమె చేసిన రెండు ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరుగుతుందని, ఆమె పై వచ్చిన ఫిర్యాదులపై కూడా విచారణ జరుగుతుందని డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. -
విలీన వార్తలను ఖండించిన యాక్సిస్ బ్యాంకు
ముంబై: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను, మరో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్టు వార్తలు మార్కెట్ లో హల్ చల్ చేశాయి. తర్వలోనే కొటక్ బ్యాంక్ చేతికిఽ యాక్సిస్ బ్యాంక్ వెళ్లిపోనుందని, ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకును కోటక్ స్వాధీనం చేసుకోనుందనే నివేదికలు అటు ఇన్వెస్టర్లు, ఇటు మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేపాయి. అయితే ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవనీ కొట్టి పారేశారు. తాము బ్యాంకింగ్ సేవల్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా కొనసాగుతున్నామనీ, విలీనం అయ్యే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఇలాంటి స్పెక్యులేషన్స్ని నమ్మవద్దని కోరారు. కొటక్ మహీంద్రా మెర్జర్ ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కొటక్ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు యాక్సిస్ టేకోవర్‌కు మరిన్ని దిగ్గజ బ్యాంకులు పావులు కదిపే అవకాశమున్నట్లు పుకార్లు చెలరేగాయి. అసలే డిమానిటైజేషన్ ప్రక్రియలో ఉద్యోగుల అక్రమాలతో ఇబ్బందుల్లో పడ్డ యాక్సిస్ బ్యాంక్ ఈ విలీనం వార్తలతో మరింత చిక్కుల్లో పడ్డట్టయింది. దీంతో మార్కెట్లో సంచలనంగా మారింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ షేరు దాదాపు 5.34 శాతం లాభపడగా కొటక్ బ్యాంక్ 0.4 శాతం నష్టపోయినా..చివరలో కోలుకుని 0.24 శాతం లాభాలతో ముగిసింది. -
'అమెరికా ఆరోపణలు నిరాధారం'
టెహ్రాన్: మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ చర్యలను ఇరాన్ ప్రోత్సహిస్తోందన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరిఫ్ తోసిపుచ్చారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన జరిఫ్.. కెర్రీ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇరాన్‌పై కెర్రీ చేసిన వ్యాఖ్యలను ప్రపంచంలో ఎవరూ పరిగణలోకి తీసుకోరని జరిఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్య ప్రస్తుతం మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నది నిజమేనని అయితే దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఇరాక్ ప్రాంతంలో అమెరికా ఆక్రమణలకు పాల్పడటమే అని జరిఫ్ విమర్శించారు. కొన్ని దేశాలు తమ స్వల్పకాలిక ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం మూలంగానే ఇస్లామిక్ ఉగ్రవాద ప్రాభల్యం పెరుగుతోందని జరిఫ్ అన్నారు. గురువారం బహ్రెయిన్‌లో పర్యటించిన కెర్రీ మాట్లాడుతూ.. మధ్య ప్రాచ్య ప్రాంతంలో అస్థిరత్వ పరిస్థితులకు ఇరాన్ కారణమని, ఆ దేశం తన పద్దతిని మార్చుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.