Jawaharlal Nehru Technological University Hyderabad
-
తెలంగాణ ఎంసెట్: కంప్యూటర్ సైన్స్‌పైనే అందరి గురి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌పై విద్యార్థులు ఈసారి పెద్దఎత్తున ఆశలు పెంచుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో పోటీ పడుతున్నారు. ఆప్షన్ల గడువు బుధవారంతో ముగుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 34 వేల మంది.. దాదాపు 15 లక్షలకుపైగా ఆప్షన్స్ ఇచ్చినట్టు ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. గతంలో 25 వేల మందే రెండో కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు. తొలిదశలో 61,169 సీట్లు కేటాయించగా.. 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. వీరిలో 3 వేల మంది వచ్చిన సీటును గడువులోగా వదులుకున్నారు. వీళ్లంతా నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లు పొందిన వారు లేదా జాతీయ కాలేజీల్లో కచి్చతంగా సీటొస్తుందని భావించే వారు. చదవండి: తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి? ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కే ప్రాధాన్యత ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో హైకోర్టు ఆదేశంతో ఇంజనీరింగ్ సీట్లు పెరిగాయి. ఇవి కన్వీనర్ కోటా కింద 4,404 వరకూ ఉన్నాయి. ఇందులో సింహభాగం కంప్యూటర్ సైన్స్ కోర్సులే ఉన్నాయి. వీటిపైనే విద్యార్థులు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. పెరిగిన సీట్లలో ఎక్కడో అక్కడ కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని ఆశిస్తున్నారు. రెండో కౌన్సెలింగ్‌లో పోటీ పెరగడానికి ఇదే ప్రధాన కారణమని ఉన్నత విద్యా మండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ వచి్చన ఆప్షన్స్‌లో 89 శాతం కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మొదటి దశలో సీటొచ్చిన అభ్యర్థులు పెరిగిన సీట్లను అంచనా వేసుకుని రెండో దశలో కంప్యూటర్ కోర్సుల కోసం పోటీ పడ్డారు. ఇందులోనూ మొదటి ప్రాధాన్యత ఆరి్టఫీషిÙయల్ ఇంటిలిజెన్స్‌కే ఇవ్వడం విశేషం. ఎట్టకేలకు జేఎన్టీయూహెచ్ అనుమతి పెరిగిన సీట్లపై తొలుత పేచీ పెట్టిన జేఎన్టీయూహెచ్ ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. విశ్వవిద్యాలయం గుర్తింపు ఉంటే తప్ప కౌన్సెలింగ్‌కు వెళ్లే అవకాశం లేదని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఒకదశలో ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా పెరిగే సీట్లను భర్తీ చేయాలనుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వర్సిటీ కూడా మొత్తం సీట్లకు ఆమోదం తెలపకతప్పలేదు. అయితే, పెరిగిన సీట్లకు అనుకూలంగా వసతులు, ఫ్యాకల్టీని మెరుగుపరచాలని వర్సిటీ ప్రైవేటు కాలేజీలకు షరతు విధించింది. పెరిగిన సీట్లు ఇవీ... బ్రాంచ్ సీట్లు సీఎస్ఈ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 1,533 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటాసైన్స్ 840 సీఎస్సీ (డేటాసైన్స్) 672 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ 546 సీఎస్ఈ (సైబర్ సెక్యూరిటీ) 231 సీఎస్ఈ 168 కంప్యూటర్ సైన్స్ డిజైన్ 168 ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ 126 సీఎస్ఈ (ఐవోటీ) 42 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 21 ఈఈఈ 21 సివిల్ ఇంజనీరింగ్ 21 మైనింగ్ ఇంజనీరింగ్ 15 -
బయోమెట్రిక్ హాజరు లేకుంటే అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ–హైదరాబాద్ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అప్డేషన్ సిస్టం (ఏబీఏఎస్)ను పక్కాగా అమలు చేయాలని జేఎన్టీయూహెచ్ స్పష్టం చేసింది. నూతన సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని, నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏబీఏఎస్ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. బోధన సిబ్బంది, పోస్ట్రుగాడ్యుయేషన్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం తప్పకుండా వేలిముద్రలతో కూడిన హాజరు ఇవ్వాలని తేల్చిచెప్పింది.ఏబీఏఎస్ హాజరు అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాజమాన్యాలపై నెలకు రూ.20వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపును రద్దు చేసేందుకు సైతం వెనుకాడబోమని జేఎన్టీయూహెచ్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
ఆ విద్యార్థులకు ఫీజు నో..!
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) అనుబంధ గుర్తింపు(అఫిలియేషన్) రద్దు చేసిన 163 కాలేజీల్లోని 807 కోర్సుల్లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ విషయానికి సంబంధించి కోర్టులో వచ్చే నిర్ణయం, దానిపై జేఎన్టీయూహెచ్ తుది ఉత్తర్వులు వెలువరించిన తర్వాతే దీనిపై పునఃపరిశీలించనుంది. గత నెల 16న జేఎన్టీయూహెచ్ 163 కాలేజీల్లోని 807 కోర్సులకు అనుబంధ గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ఈ 163 కాలేజీల్లో 2,3,4 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు అనుబంధ గుర్తింపు ఉన్నందున వారు స్కాలర్షిప్ పొందేందుకు ఈ-పాస్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని ఆయా కాలేజీల విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో అథెంటికేషన్‌ను(రెన్యువల్) పొందేం దుకు అనుమతిచ్చింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో స్థానికులుగా గుర్తించిన విద్యార్థులే ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హులని మరోసారి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఈ-పాస్ వెబ్సైట్లో అవసరమైన మార్పులు చేసి, ఆధార్ వ్యవస్థ ద్వారా ఆన్లైన్లో విద్యార్థుల అథెంటికేషన్ చేయాలని సెంటర్ ఫర్ గుడ్ గవరె ్నన్స్కు ప్రభుత్వం సూచించింది. అన్ని కాలేజీలు ఆన్లైన్లో ఆధార్ లింక్ ఉన్న పరికరాల ద్వారా విద్యార్థులను అథెంటికేట్ చేయాలని, బార్కోడ్ ఉన్న స్కాలర్షిప్ దరఖాస్తులను సిద్ధంచేసి, వాటిపై విద్యార్థులు, యాజమాన్యం గుర్తించిన ప్రతినిధి సంతకాలు చేసి సంక్షేమ అధికారులకు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్వాపరాలు ఇవీ.. కొన్ని కాలేజీలు, కొన్ని కోర్సులు మొత్తం కలుపుకుని 163 కాలేజీల్లోని 807 కోర్సులకు 2014-15లో అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూహేచ్ రద్దు చేసింది. దీనిపై ఆయా కాలేజీలు సుప్రీంకోర్టుకు వెళ్లగా షరతులతో అనుమతినివ్వమని కోర్టు పేర్కొంది. ఈ కాలేజీలను మళ్లీ తనిఖీ చేసి నిబంధనలను బట్టి గుర్తింపు ఇవ్వాలని, నిబంధనలకు లోబడే ప్రవేశాలు కల్పించాలని సూచించింది. అయితే జేఎన్‌టీయూహేచ్ ఆధ్వర్యంలో మళ్లీ తనిఖీలు చేయగా ఆయా కాలేజీలు నిబంధనల ప్రకారం నడవడం లేదని తేలింది. దీంతో ఈ కాలేజీల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తూ జేఎన్టీయూహెచ్ నిర్ణయం తీసుకుంది.