‘అమ్మకోసం భర్తను కాదనుకున్నారు’
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు రాజకీయ ఆశయం లేదని ప్రస్తుత మహాబలిపురం గోల్డెన్ బే రిసార్టులో ఉన్న ఎమ్మెల్యే జయంతి పద్మనాభన్ చెప్పారు. ‘నేను(శశికళ) అమ్మతో ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు 29 ఏళ్లున్నప్పటి నుంచే నా భర్తను, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి అమ్మ( వద్దకు వచ్చేశాను. నాకు ఇప్పుడు 62 ఏళ్లు. నాకు ఎలాంటి రాజకీయ ఆశయం లేదు. దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా చూడటం అనేది అమ్మకల. అది చెదిరిపోకుండా చూసుకునేందుకు నా జీవితాంతం పోరాడుతాను’ అని శశికళ తమతో చెప్పినట్లు వివరించారు.
ప్రజలు అధికారాన్ని ఇచ్చారని, ఆ అధికారాన్ని వారికోసం ఉపయోగించి వారికే సేవ చేయాలని తమకు తెలిపారన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉండాలని హితబోద చేసినట్లు ఆమె వివరించారు. ‘నేను ఒక న్యాయవాదిని. నన్నెవరూ బలవంతంగా బందించలేరు’ అని ఆమె రిసార్టులో ఉండటంపై బదులిచ్చారు. గవర్నర్ పిలుపుకోసం శశికళ ఎదురుచూస్తున్నారని, ఆయన నుంచి పిలుపురాగానే తామంతా ఆమెకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులు కూడా రిసార్టుకు వచ్చి వెళుతున్నారని, తామంతా చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!
నేడు శశికళ భారీ స్కెచ్?
శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్!
చెన్నైలో హై టెన్షన్
పన్నీర్ మైండ్ గేమ్ షురూ..
దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి