పొలీస్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి
పోలీసు వాహనం ఢీకొని ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల శవాలతో వారి బంధువులు మంగళవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం పేరంపల్లి వద్ద మంగళవారం సాయంత్రం పోలీసు వాహనం ఓ బైక్‌ను ఢీకొంది.
ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సుధాకర్‌రెడ్డి (38), బయ్యారెడ్డి (70) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరనాగమ్మకు తీవ్ర గాయాలు కాగా ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు రాయచోటిలో ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు న్యాయం చేయాలని మృతదేహాలతో ధర్నా చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.