తిరుమల జేఈవో క్యాంపు ఆఫీస్ అవినీతిమయం
నెల్లూరు : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తిరుమలలో అవినీతిపై ఆధారాలు బయటపెడతామని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం పెంచలకోన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో దర్శన ఏర్పాట్లు సరిగా లేవన్నారు. తిరుమల జేఈవో క్యాంపు కార్యాలయం అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు.