Jet Airways deal
-
జెట్ ఎయిర్వేస్- ఇండో కౌంట్.. గెలాప్
రుణాలు, నష్టాల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ టేకోవర్‌కు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలన్ ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో జెట్ ఎయిర్వేస్ కౌంటర్ కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరందుకున్న టెక్స్టైల్స్ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేరుకి డిమాండ్ కొనసాగుతోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్‌కు రుణదాతల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ ఇటీవల నిరవధికంగా బలపడుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51.20 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వరుసగా 12వ సెషన్లోనూ ఈ షేరు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి వారం రోజుల్లోనే ఈ షేరు 27 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్న జెట్ ఎయిర్వేస్ షేరు గత 20 రోజుల్లో 108 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్స్ రంగ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో రోజు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 7.8 ఎగసి రూ. 163.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు వారాల్లోనే ఈ షేరు 48 శాతం జంప్‌చేసింది. ఈ ఏడాది క్యూ2లో ఇండో కౌంట్ నికర లాభం 7 రెట్లు ఎగసి రూ. 81 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 714 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు 3.5 శాతం బలపడి 17.5 శాతాన్ని తాకాయి. కాగా.. గత నెల రోజుల్లో ఇండో కౌంట్ షేరు 70 శాతం పురోగమించింది. ఆరు నెలల కాలాన్ని తీసుకుంటే ఏకంగా 469 శాతం ర్యాలీ చేయడం విశేషం! -
జెట్- దివాన్- కాస్మో ఫిల్మ్స్.. దూకుడు
విభిన్న సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో జెట్ ఎయిర్వేస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్), కాస్మో ఫిల్మ్స్ కౌంటర్లు జోరు చూపుతున్నాయి. మార్కెట్లను మించి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ ప్రతిపాదిత రిజల్యూషన్ ప్రణాళికకు రుణదాతల కన్సార్షియం ఆమోదముద్ర వేయడంతో ప్రయివేట్ రంగ సంస్థ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 42.20 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి గత 8 రోజుల్లో ఈ షేరు 47 శాతం ర్యాలీ చేసింది. రూ. 1,000 కోట్ల తొలి దశ పెట్టుబడి ద్వారా జెట్ ఎయిర్వేస్ను పూర్తిస్థాయి కార్యకలాపాలతో పునరుద్ధరించాలని కల్రాక్ క్యాపిటల్ ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే రుణదాతలు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, భాగస్వాములతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్ ఎన్బీఎఫ్సీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొనుగోలుకి నాలుగు కంపెనీలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. బిడ్స్ దాఖలు చేసిన సంస్థలలో పిరమల్, అదానీ గ్రూప్‌లున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ కోసం నాలుగు కంపెనీలు రిజల్యూషన్ ప్రణాళికలు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అదానీ, పిరమల్ గ్రూప్‌లతోపాటు యూఎస్ కంపెనీ ఓక్ట్రీ క్యాపిటల్, ఎస్సీ లోవీ సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 13.85 వద్ద ఫ్రీజయ్యింది. కాస్మో ఫిల్మ్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు ప్యాకేజింగ్ కంపెనీ కాస్మో ఫిల్మ్స్ తాజాగా పేర్కొంది. బైబ్యాక్ అంశంపై ఈ నెల 26న సమావేశంకానున్న బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత కాస్మో ఫిల్మ్స్ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 468కు చేరింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. -
జెట్ ఎయిర్వేస్ అప్- జీఎం బ్రూవరీస్ వీక్
వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రధానంగా ఐటీ రంగం మార్కెట్లకు జోష్‌నిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 417 పాయింట్లు జంప్‌చేసి 40,296 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొనుగోలు రేసులో కల్రాక్- జలన్ కన్సార్షియం ముందంజలో ఉన్నట్లు వెలువడిన వార్తలు జెట్ ఎయిర్వేస్ కౌంటర్‌కు బూస్ట్‌నిచ్చాయి. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో లిక్కర్ తయారీ కంపెనీ జీఎం బ్రూవరీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి జెట్ ఎయిర్వేస్ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎం బ్రూవరీస్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. జెట్ ఎయిర్వేస్ విమానయాన సేవల కంపెనీ జెట్ ఎయిర్వేస్ విక్రయానికి ఎస్బీఐ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం నిర్వహించిన బిడ్డింగ్‌లో కల్రాక్- జలన్ కన్సార్షియం ముందంజలో నిలుస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్.. బ్యాంకులకు రూ. 8,000 కోట్లకుపైగా బకాయి పడింది. మొత్తం రూ. 40,000 కోట్లవరకూ రుణాలున్నట్లు అంచనా. దీంతో జెట్ ఎయిర్వేస్ విక్రయానికి ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బ్యాంకింగ్ కన్సార్షియం బిడ్డింగ్‌ను చేపట్టింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకి కల్రాక్- జలన్ కన్సార్షియం దాఖలు చేసిన బిడ్‌కు బ్యాంకులు అత్యధికంగా ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలతో జెట్ ఎయిర్వేస్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 30.10 వద్ద ఫ్రీజయ్యింది. జీఎం బ్రూవరీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీఎం బ్రూవరీస్ నికర లాభం 43 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 40 శాతం తగ్గి రూ. 73 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 37 శాతం నీరసించి రూ. 15 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో జీఎం బ్రూవరీస్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం పతనమై రూ. 381కు చేరింది. ప్రస్తుతం 4.4 శాతం నష్టంతో రూ. 386 వద్ద ట్రేడవుతోంది. -
‘జెట్’ విక్రయంలో కదలిక!
ముంబై: జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్ గ్రూపు బుధవారం ఎస్బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్ గ్రూపు సీఈవో రాహుల్ గన్‌పులే తెలిపారు. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్బీఐ క్యాప్స్ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జెట్ కోసం తాము ఈ నెల 8న బిడ్ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్ బిడ్ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్బీఐ క్యాప్స్ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్ ఎయిర్వేస్కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్ ఎయిర్వేస్లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్బీఐ క్యాప్స్ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్ బిడ్ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది. హిందుజాలను ఒప్పించే యత్నం? జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్ ఎయిర్వేస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందుజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రదించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్ హిందుజాతో ఎతిహాద్ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి ఆటోమోటివ్, ఆయిల్, స్పెషాలిటీ కెమికల్స్, మీడియా, ఐటీ, విద్యుత్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది. మరింత నష్టపోయిన షేరు కంపెనీ నిర్వహణ విషయంలో అస్పష్టత నేపథ్యంలో వరుసగా మూడో రోజూ జెట్ ఎయిర్వేస్ షేరు నష్టపోయింది. కంపెనీ సీఈవో వినయ్‌దూబే, డిప్యూటీ సీఈవో అమిత్ అగర్వాల్ రాజీనామాలు చేయడం షేరుపై ప్రభావం చూపించాయి. బీఎస్ఈలో బుధవారం షేరు ధర 4 శాతానికి పైగా నష్టపోయి 123.70 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నూతన 52 వారాల కనిష్ట స్థాయి రూ.120.25 నమోదు చేసింది. -
అవకతవకలు రుజువైతే జెట్-ఎతిహాద్ డీల్ రద్దు!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు కోసం ఎతిహాద్ ఎయిర్వేస్ కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు ఉన్నట్లు రుజువైతే.. ఈ డీల్‌ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జెట్-ఎతిహాద్ ఒప్పందం సహజవనరులను దుర్వినియోగం చేయడం(ఎయిర్‌స్పేస్ ఇతరత్రా) కిందికి వస్తుందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా పౌరవిమానయాన రంగంపై కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా మాటలకు సంబంధించి ట్యాప్ చేసిన టెలిఫోన్ సంభాషణల రాతప్రతులను ప్రభుత్వం బయటపెట్టేలా ఆదేశాలించాలన్న పిటిషనర్ వాదనపైనా సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం, ఆదాయపు పన్ను శాఖలకు నోటీసులు జారీచేసింది. కాగా, తన పిటిషన్‌పై కేంద్రం తన స్పందనను తెలియజేయకపోవడంపై స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమకు నాలుగు వారాల వ్యవధి కావాలని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ సుప్రీంను కోరారు. అయితే, ఎయిర్ ఏషియా డీల్పైనా ఇలాంటి పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు దీన్ని విచారణకు స్వీకరించలేదని, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన విషయాన్ని పరాశరణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జెట్-ఎతిహాద్ డీల్‌పై పిటిషన్‌కు కూడా విచారణార్హత లేదని ఆయన వాదించారు. అయితే, ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ కేసులో ఇప్పటికే తాము నోటీసులు జారీచేసినట్లు సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఏవైనా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే కచ్చితంగా ఈ ఒప్పందాన్ని పక్కనబెడతామని పిటిషనర్‌కు బెంచ్ హామీఇచ్చింది. జెట్ ఎయిర్వేస్లో 24 శాతం వాటాను చేజిక్కించుకోవడానికి ఎతిహాద్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఈ డీల్ విలువ రూ.2,069 కోట్లు.