Jethmalani
-
హైకోర్టులో జైట్లీ, జెఠ్మలానీ వాగ్యుద్ధం
కేజ్రీవాల్‌పై వేసిన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా... న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సాక్షిగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, సీనియర్ అడ్వొకేట్ రామ్ జెఠ్మలానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయ కులు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్ సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయ్ లకు వ్యతిరేకంగా జైట్లీ ఢిల్లీ హైకోర్టులో రూ. 10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో జరిగిన ఆర్థిక అవకతవకలకు 2000 నుంచి 2013 వరకు దాని అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీయే బాధ్యుడని ఆప్ నాయకులు ఆరోప ణలు చేసిన నేపథ్యంలో జైట్లీ ఈ దావా వేశా రు. ఈ కేసు విచారణ సందర్భంగా బుధ వా రం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జెఠ్మ లానీ, జైట్లీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. నిందలకూ ఓ హద్దుంటుంది: జైట్లీ ఈ సందర్భంగా జైట్లీని నిజాయితీ లేని వ్యక్తి అంటూ రామ్‌జెఠ్మలానీ పరుష పదజాలాన్ని వినియోగించారు. దీంతో జాయింట్ రిజిస్ట్రార్ దీపాలీ శర్మ సాక్షిగా జైట్లీ సహనం కోల్పోయారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆ పదం ఉపయోగించారా అని జెఠ్మలానీని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అదే నిజమైతే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇంతకు మించిన పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంద న్నారు. వ్యక్తిగతంగా నిందించడానికీ ఓ హద్దుంటుందని.. నియంత్రణ కోల్పోవడం సరైంది కాదన్నారు. జైట్లీ తరఫు సీనియర్ అడ్వొకేట్లు రాజీవ్ నాయర్, సందీప్ సేథి కూడా జెఠ్మలానీ తీరును ఖండించారు. ఆయ న అవమానకరమైన ప్రశ్నలను వేశారని, అసంబద్ధమైన విషయాలను అడగకుండా తనను తాను నియంత్రించుకోవాలన్నారు. ఇది జైట్లీ, కేజ్రీకి మధ్య కేసు అని, జైట్లీ, జెఠ్మలానీ మధ్య జరుగుతున్న కేసు కాదని వ్యంగ్యంగా అన్నారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆ పదం ఉపయోగించానని రామ్ జెఠ్మలానీ చెప్పగా.. కేజ్రీవాల్ తరఫు మరో న్యాయవాది అనుపమ్ శ్రీవాస్తవ్ ఆ పదం ఉపయోగించాలన్న సూచనేదీ లేదన్నారు. -
భార్యకు మొండిచేయి చూపిన లాలూ
పట్నా: బిహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, లాలూ ప్రసాద్ తనయ మిసా భారతి, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ నామినేషన్లు దాఖలు వేశారు. లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి సీటు ఇచ్చారు. సతీమణిని పెద్దల సభకు పంపుతారని వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం సస్పెన్స్ కొనసాగింది చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. అవినీతి కేసుల్లో తన తరపున వాదించిన జెంఠ్మలానీకి మరొ స్థానం కేటాయించారు. ఆదివారం ఆయన ఆర్జేడీలో చేరారు. తాను లాలూ ప్రసాద్ కు స్నేహితుడిని, రక్షకుడిని అని జెంఠ్మలానీ ప్రకటించుకున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఐదు స్థానాలు జులైలో ఖాళీ అవుతాయి. -
దావూద్ లొంగిపోతానన్నాడు..
కొన్ని షరతులు పెట్టాడు.. పవార్ పట్టించుకోలేదు: జెఠ్మలానీ ముంబై: చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం.. 1990ల్లో భారత అధికారులకు లొంగిపోతానని ముందుకు వచ్చాడని.. కానీ నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఆరోపించారు. ‘‘దావూద్.. తాను వెనక్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే.. తనపై థర్డ్ డిగ్రీ (హింసాత్మక విచారణ) ప్రయోగించబోమని, తనను గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్)లో ఉంచుతామని ప్రభుత్వం నుంచి హామీ కావాలన్నాడు. తను తప్పు చేసినట్లయితే శిక్ష ఎదుర్కోవటానికి సిద్ధమనీ చెప్పాడు’’ అని జెఠ్మలానీ శనివారం ఏఎన్ఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తాము లండన్‌లో కలిసినపుడు దావూద్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ‘‘అతడు ఈ విషయం చెప్పినపుడు.. నేను దీనిని రాతపూర్వకంగా శరద్‌పవార్‌కు పంపించాను. ఈ ప్రతిపాదన గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా నా కుమారుడికి చెప్పాను’’ అని తెలిపారు. ఈ విషయంలో ముందుకు వెళ్లరాదని నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ‘‘అది శరద్‌పవారా? లేక కాంగ్రెస్సా? అనేది మాకు తెలీదు. కానీ.. ఈ నిర్ణయాన్ని శరద్‌పవార్ ఒక్కరే తీసుకోగలిగి ఉండకపోవచ్చు. కేంద్రం అభిప్రాయం ఇందులో ఉండి ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. షరతులు ఆమోదనీయం కాదని తిరస్కరించాం: పవార్ రాంజెఠ్మలానీ వెల్లడించిన అంశంపై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌పవార్ స్పందిస్తూ.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని, తనను సంప్రదించటం నిజమేనని.. అయితే అందుకు పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని.. దాంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించటం జరిగిందని చెప్పారు. ‘‘దావూద్‌ను జైలులో పెట్టరాదని, అతడిని ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని షరతు పెట్టారు. అది ఆమోదనీయం కాదు. అతడు చట్టం ముందు నిలవాల్సి ఉంటుందని మేం చెప్పాం’’ అని పవార్ శనివారం ముంబైలో విలేకరులకు వివరించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం కీలక నిందితుడన్న విషయం తెలిసిందే.