j.geetha reddy
-
తేలని టికెట్ల ‘పంచాయితీ’
జహీరాబాద్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం ఒక్క రోజే గడువు మిగిలి ఉంది. అయినప్పటికీ టికెట్ల కేటాయింపులో మాజీ మంత్రులు జె. గీతారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్ మధ్య ఇంతవరకు రాజీ కుదరలేదు. దీంతో ఇరువురి మధ్య టికెట్ల పంచాయితీ తేలని పరిస్థితి నెలకొంది. రాజీ కోసం అధిష్టానం నుంచి ఎలాంటి రాయబారం కూడా రానట్టు సమాచారం. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మూడు రోజులుగా మొక్కుబడిగానే సాగింది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని అనేక గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ సభ్యుల అభ్యర్థిత్వాలు ఖరారు కానట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ వరకు అభ్యర్థులను ఖరారుచేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లను ఆశిస్తున్న వారంతా నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారిచే నామినేషన్లు వేయించే పనిని ఆయా మండలాల పార్టీ నాయకులు చూసుకుంటున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని, తన వర్గానికి గీతారెడ్డి టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపారని ఫరీదుద్దీన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీసం ఎంపీటీసీ టికెట్ల కేటాయింపు విషయంలోనైనా తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఫరీదుద్దీన్ అధిష్టాన వర్గాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు రెండు రోజుల గడువు విధించారు. ఇప్పటికీ అధిష్టానవర్గం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఆయన మద్దతుదారులు మాత్రం గీతారెడ్డి అవలంబిస్తున్న తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం నుంచి దశాబ్ద కాలం పాటు ప్రాతినిధ్యం వహించిన ఫరీదుద్దీన్‌ను విస్మరించడం రాజకీయ అజ్ఞానమే అవుతుందని వారు విమర్శిస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీకి పటిష్టమైన పునాదులు వేసేది పోయి పార్టీకి నష్టపర్చే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదని వారు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలా స్పందింస్తుదోనని ఫరీదుద్దీన్ మద్ధతుదారులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఇరువురి మధ్య అధిష్టానవర్గం రాజీ ఫార్ములాను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే
జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకే దక్కుతుదని మాజీ మంత్రి జె.గీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి షెట్కార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఏ మాత్రం వెనుకకు తగ్గలేదన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్ధతు తెలిపే విషయంలో బీజేపీ రాజకీయంగా ఎత్తుగడలు వేసినా అవి పారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి అధికారం అప్పగించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేక పోతోందన్నారు. ఇతర పార్టీల నేతలు మాత్రం ఏమి చేయకున్నా అంతా తామే చేశామన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఒక్క కాంగ్రెస్ పార్టీయే అందించగలుగుతుందన్నారు. యువత సైతం రాహూల్‌గాంధీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, అల్లుడు సుధీర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కిషన్‌రావు పవార్, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, హన్మంత్‌రావు పాటిల్, ఆర్.అరవింద్‌రెడ్డి, కె.నర్సింహులు, ఎండీ ఖాజా, చంద్రశేఖర్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డు పడింది. ర్యాలీ మధ్యలో ఉండగా భారీ వర్షం కురిసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. గంటపాటు వర్షం కురియడంతో ర్యాలీని అర్థంతరంగా నిలిపి వేశారు. వర్షం తగ్గిన అనంతరం సభను షెట్కార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేశారు. దత్తగిరి కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ బ్లాక్‌రోడ్డు వరకు చేరుకోగానే వర్షం మొదలైంది. వర్షం ఎంతకూ తగ్గక పోవడంతో అర్థంతరంగా రద్దు చేసి సభ నిర్వహించారు. ఆడి పాడిన గీతారెడ్డి విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి గీతారెడ్డి ఆడి పాడారు. ర్యాలీలో మహిళలు బతుకమ్మను బోనాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. తలపై బోనం ఎత్తుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ర్యాలీలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. గీతారెడ్డి అల్లుడు సుధీర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగించారు. . సోమవారం రాత్రి షెట్కార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఏ మాత్రం వెనుకకు తగ్గలేదన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్ధతు తెలిపే విషయంలో బీజేపీ రాజకీయంగా ఎత్తుగడలు వేసినా అవి పారలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి అధికారం అప్పగించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ సంబరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోలేక పోతోందన్నారు. ఇతర పార్టీల నేతలు మాత్రం ఏమి చేయకున్నా అంతా తామే చేశామన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ఒక్క కాంగ్రెస్ పార్టీయే అందించగలుగుతుందన్నారు. యువత సైతం రాహూల్‌గాంధీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరిగి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తేవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి భర్త రాంచంద్రారెడ్డి, కుమార్తె మేఘనారెడ్డి, అల్లుడు సుధీర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కిషన్‌రావు పవార్, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్, హన్మంత్‌రావు పాటిల్, ఆర్.అరవింద్‌రెడ్డి, కె.నర్సింహులు, ఎండీ ఖాజా, చంద్రశేఖర్, ముబీన్ తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి వర్షం అడ్డు పడింది. ర్యాలీ మధ్యలో ఉండగా భారీ వర్షం కురిసింది. దీంతో నాయకులు, కార్యకర్తలు చెల్లా చెదురయ్యారు. గంటపాటు వర్షం కురియడంతో ర్యాలీని అర్థంతరంగా నిలిపి వేశారు. వర్షం తగ్గిన అనంతరం సభను షెట్కార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేశారు. దత్తగిరి కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ బ్లాక్‌రోడ్డు వరకు చేరుకోగానే వర్షం మొదలైంది. వర్షం ఎంతకూ తగ్గక పోవడంతో అర్థంతరంగా రద్దు చేసి సభ నిర్వహించారు. ఆడి పాడిన గీతారెడ్డి విజయోత్సవ ర్యాలీలో మాజీ మంత్రి గీతారెడ్డి ఆడి పాడారు. ర్యాలీలో మహిళలు బతుకమ్మను బోనాలతో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడుతూ ఆడారు. తలపై బోనం ఎత్తుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ర్యాలీలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. గీతారెడ్డి అల్లుడు సుధీర్‌రెడ్డిని పార్టీ కార్యకర్తలు గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగించారు. -
కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై నేతల మండిపాటు
జహీరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డికి ఢిల్లీలో జరిగిన అవమానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జహీరాబాద్ బంద్ సంపూర్ణంగా జరిగింది. గురువారం కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ బంద్ నిర్వహించారు. పార్టీ నాయకులు 9వ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. భవానీ మందిర్ క్రాస్‌రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై టెంట్ వేసుకుని బైఠాయించారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తుండడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి వాహనాల రాక పోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం ఆందోళనకారులంతా బస్టాండ్‌లోకి వెళ్లి బస్సులను అడ్డుకున్నారు. తెరిచి ఉంచిన దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ, మంత్రి గీతారెడ్డి పట్ల ఢిల్లీ పోలీసులు దురుసుగా వ్యవహరించడం తగదన్నారు. మహిళ అనే విషయాన్ని మర్చి ఆమెను తోసి వేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మంత్రి గీతారెడ్డికి జరిగిన దాడికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న తరుణంలో సీఎం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డెక్కని బస్సులు..మూతపడిన విద్యాసంస్థలు జాజు టెక్స్టైల్ దుకాణం తెరిచి ఉండడంతో ఆగ్రహించిన పార్టీ శ్రేణులు యజమానిపై చేయిచేసుకుని బలవంతంగా మూసి వేయించారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భవానీమందిర్ క్రాస్‌రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న ఆందోళన కారులు స్థానిక డిపో బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఐదు బస్సుల అద్దాలు పగిలి పోయాయి. ఒక డీసీఎం వ్యాన్ అద్దాలు సైతం దెబ్బతిన్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్టీసీ బస్సులను స్థానిక డిపో అధికారులు నిలిపి వేశారు. బంద్ సంపూర్ణంగా జరగడంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం నుంచే తెరుచుకోలేదు. సినిమా థియేటర్లు మూత పడ్డాయి. మంత్రి గీతారెడ్డికి మద్దతుగా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. రంజోల్, సత్వార్, హుగ్గెల్లి గ్రామాల్లో సైతం విద్యా సంస్థలను మూసివేయించి బంద్ నిర్వహించారు. వాహనాల రాక పోకలను అడ్డుకున్నారు. బంద్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ వైస్ చైర్మన్ ఎం.డి.ఖాజా, మహిళా కాంగ్రెస్ తాలూకా అధ్యక్షురాలు షిలా రమేష్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావు పాటిల్, మాజీ జడ్పీటీసీ పండరినాథ్, కాంగ్రెస్ నాయకులు ఎం.బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, సతీష్, జహంగీర్, తాహెరాబేగం తదితరులు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి చెప్పులతో సత్కారం బంద్ సందర్భంగా 9వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్ర పటానికి మహిళా నేతలు, కార్యకర్తలు చెప్పులతో సత్కారం చేశారు. ఆయన ఫోటోను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కిరోసిన్ పోసి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.