JioFi Device
-
సరికొత్త ఆఫర్ : ‘జియోఫై’ పై భారీ తగ్గింపు
ముంబై : రిలయన్స్ జియో రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. నిన్న కాక మొన్ననే జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్, తాజాగా జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్ విక్రయాలను పెంచడానికి సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతో జియోఫై రూటర్ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్ రూటర్ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం కొత్త జియోఫై యూనిట్ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ డివైజ్ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. జూలై 3 నుంచి అంటే నేటి నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది. అయితే ఎప్పుడు వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉండనుందో కంపెనీ వెల్లడించలేదు. జియోఫై క్యాష్‌బ్యాక్ ఆఫర్ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్ సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్ చేయించుకోవాలి. ఇలా 12 నెలల పాటు రీఛార్జ్ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్జియో అందించనుంది. జియో తన పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్ కాల్స్‌ను, అపరిమిత ఎస్ఎంఎస్లను, జియో యాప్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు. కొత్త జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన రోజుల్లోనే మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. మాన్సూన్ ఆఫర్ కింద 4,900 రూపాయల విలువైన ప్రయోజనాలను జియో తన ఒప్పో కస్టమర్లకు అందిస్తోంది. జూన్‌లో కూడా జియో తన ఎంపిక చేసిన ప్యాక్‌లకు రోజుకు 1.5 జీబీ అదనపు డేటాను యూజర్లకు ఆఫర్చేస్తోంది. -
జియో స్టార్టర్ కిట్ వచ్చేసింది
న్యూఢిల్లీ: ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీని తన కనుగుణంగా మలుచుకుంటోంది. ‘జియో వైఫై జియో జీఎస్టీ’ స్టార్టర్ కిట్ పేరుతో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో గురువారం జ్యోతి జ్యోతిస్ట్ స్టార్టర్ కిట్‌ను గురువారం లాంచ్ చేసింది. ఇందులో బిల్లింగ్ అప్లికేషన్, జీఎస్టీ సాఫ్ట్వేర్ ఉచితం. దీంతోపాటు జియో వైఫై డివైస్ లో ఏడాది పాటు అపరిమిత కాల్స్, 24 జీబీ డేటా అందించనుంది. ఈ కిట్‌తో పాటు వినియోగదారులకు 10,884 రూపాయల ఇతర ఆఫర్లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో వెబ్ సైట్ ప్రకారం, రూ. 1,999 ఖర్చు చేసే ఒక పరికరాన్ని, వినియోగదారులు 10,884 రూపాయల వరకు ఆఫర్లను పొందగలుగుతారు. అంతేకాదు జియో జీఎస్టీ కిట్‌ను ఈఎంఐ పద్ధతిలో కూడా కొనుక్కోవచ్చట. జీఎస్టీ స్టార్టర్ కిట్‌లో పన్నుచెల్లింపుదారులను అనుమతించడానికి వీలుగా 'జీయో- జీఎస్టీ సొల్యూషన్' ను అందిస్తోంది. జియో యాప్ బేస్డ్ జీఎస్టీ సొల్యూషన్ ప్లాట్ ఫాం ద్వారా రిటైలర్లు తమ రికార్డులను నిర్వహించడానికి, జిఎస్టికి తిరిగి రాబట్టడానికి జీఎస్టీ చట్టం నిబంధనలకు అనుగుణంగా సహాయపడుతుంది. ఇది ఏబిల్లింగ్ సాఫ్ట్వేర్కైనా ఇది అనుగుణంగా ఉంటుంది. అంటే బిల్లింగ్సాఫ్ట్వేర్, కంప్యూటర్ తో పనిలేకుండానే జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ సేవలను ఏడాదిపాటు పొందవచ్చు. రూ. 4999 విలువైన జియో బిల్లింగ్ అప్లికేషన్ ఉచితం. దీని సహాయంతో మొబైల్ లో రిటర్న్ ఫైలింగ్, ఇన్ వాయిస్‌లను తీసుకోవచ్చు. దీంతో వివిధ ఉత్పత్తులు, సర్వీసుల పన్నురేటును తెలుసుకోవచ్చు. అలాగే జీఎస్టీ ఫైలింగ్ సందర్భంగా టాక్స్ ఎక్స్‌పర్ట్‌లు సలహాలు కూడా ఉచితం. జియో స్టార్టర్ కిట్ పొందడానికి Jio.comలోకి వెళ్లి స్టార్టర్ కిట్ ఆర్డర్ చేయాలి. డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. దీంతో జియో సిమ్ లో జియోజీఎస్టీ.కామ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ జీఎస్టీన్ ఎంచుకొన్న అనంతరం మొబైల్ ఎంఎస్ఐఎస్డీఎన్ను (మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్స్క్రయిబర్ డైరెక్టరీ నంబర్) జత చేయాలి. దీంతో స్టార్టర్ కిట్ యాక్టివేట్ అవుతుంది. -
జియో లేటెస్ట్ ఆఫర్: 100 శాతం క్యాష్ బ్యాక్
సంచలనమైన ఆఫర్లతో మారుమోగించిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది. తమ పోర్టబుల్ బ్రాడ్ బ్యాండు డివైజ్ ''జియోఫై'' కొనుగోలు చేసిన వారికి 100 శాతం వరకు క్యాష్ బ్యాంక్ ను అందించనున్నట్టు పేర్కొంది. అయితే ఇది పాత డోంగిల్, రౌటర్, 4జీ కార్డుతో ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ఈ క్యాష్ బ్యాక్ ను ఇవ్వనుంది. దీని ధర 1,999 రూపాయలు. జియోఫై డివైజ్ ద్వారా పలువురు యూజర్లు, వివిధ మొబైల్ డివైజ్ లను(2జీ, 3జీ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టాబెట్స్ ను) జియో 4జీ ఇంటర్నెట్ సర్వీసులతో కనెక్ట్ చేసుకోవచ్చని కంపెనీ తన వెబ్ సైట్ లో తెలిపింది. అంతేకాక వైఫై హాట్స్ స్పాట్ ను క్రియేట్ చేసుకోవచ్చని పేర్కొంది. 100 క్యాష్ బ్యాక్ ఆఫర్ పై నియమ నిబంధనలు కంపెనీ వెబ్ సైట్ లో పొందుపరిచింది. వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. యూజర్లు జియోఫైను డోంగిల్ ఎక్స్చేంజ్ లో రూ.1,999కు ఆన్ లైన్ లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తోంది. ఎక్స్చేంజ్ లో అదనంగా రూ.2,010 మేర విలువైన డేటా ప్రయోజనాలు యూజర్లు పొందుతారు. అంటే నెలకు 210 రూపాయల విలువైన 5జీబీ డేటాను 10 నెలల పాటు పొందుతారు. ఇది 100 శాతం డివైజ్ మొత్తానికి సమానం. ఒకవేళ పాత డోంగిల్ తో ఎక్స్చేంజ్ చేసుకోలేని వారు కేవలం రూ.1,005 మేర మాత్రమే ప్రయోజనాలు పొందనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. అంటే నెలకు 210 విలువైన 5జీబీ డేటాను ఐదు నెలల పాటు మాత్రమే పొందుతారు. జియో ఫై డివైజ్ లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లలోనూ, డీఎక్స్ మినీ స్టోర్లలోనూ, జియోవెబ్ సైట్-జియో.కామ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ డివైజ్ కొనుగోలు చేయడానికి ఈఎంఐ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులకు రూ.95.03 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమవుతున్నాయి.