జియో లేటెస్ట్ ఆఫర్: 100 శాతం క్యాష్‌ బ్యాక్ Get 100% Cashback On JioFi Device In Jio's Latest Offer. Details Here | Sakshi
Sakshi News home page

జియో లేటెస్ట్ ఆఫర్: 100 శాతం క్యాష్‌ బ్యాక్

Published Mon, Jun 12 2017 7:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

జియో లేటెస్ట్ ఆఫర్: 100 శాతం క్యాష్‌ బ్యాక్

సంచలనమైన ఆఫర్లతో మారుమోగించిన రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్ తీసుకొచ్చింది. తమ పోర్టబుల్ బ్రాడ్ బ్యాండు డివైజ్ ''జియోఫై'' కొనుగోలు చేసిన వారికి 100 శాతం వరకు క్యాష్ బ్యాంక్ ను అందించనున్నట్టు పేర్కొంది. అయితే ఇది పాత డోంగిల్, రౌటర్, 4జీ కార్డుతో ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ఈ క్యాష్ బ్యాక్ ను ఇవ్వనుంది.  దీని ధర 1,999 రూపాయలు. జియోఫై డివైజ్ ద్వారా పలువురు యూజర్లు, వివిధ మొబైల్ డివైజ్ లను(2జీ, 3జీ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టాబెట్స్ ను) జియో 4జీ ఇంటర్నెట్ సర్వీసులతో కనెక్ట్ చేసుకోవచ్చని కంపెనీ తన వెబ్ సైట్ లో తెలిపింది. అంతేకాక వైఫై హాట్స్ స్పాట్ ను క్రియేట్ చేసుకోవచ్చని పేర్కొంది. 100 క్యాష్‌ బ్యాక్ ఆఫర్ పై నియమ నిబంధనలు కంపెనీ వెబ్ సైట్ లో పొందుపరిచింది. 
 
వెబ్ సైట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. యూజర్లు జియోఫైను డోంగిల్ ఎక్స్చేంజ్ లో రూ.1,999కు ఆన్ లైన్ లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 100 శాతం క్యాష్ బ్యాక్  ఆఫర్ వర్తిస్తోంది.  ఎక్స్చేంజ్ లో అదనంగా రూ.2,010  మేర విలువైన డేటా ప్రయోజనాలు యూజర్లు పొందుతారు. అంటే నెలకు 210 రూపాయల విలువైన 5జీబీ డేటాను 10 నెలల పాటు పొందుతారు. ఇది 100 శాతం డివైజ్ మొత్తానికి సమానం. ఒకవేళ పాత డోంగిల్ తో ఎక్స్చేంజ్ చేసుకోలేని వారు కేవలం రూ.1,005 మేర మాత్రమే ప్రయోజనాలు పొందనున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. అంటే నెలకు 210 విలువైన 5జీబీ డేటాను ఐదు నెలల పాటు మాత్రమే పొందుతారు. జియో ఫై డివైజ్ లు రిలయన్స్  డిజిటల్ స్టోర్లలోనూ, డీఎక్స్ మినీ స్టోర్లలోనూ, జియోవెబ్ సైట్-జియో.కామ్ లో అందుబాటులో ఉన్నాయి.  ఈ డివైజ్ కొనుగోలు చేయడానికి ఈఎంఐ ఆప్షన్లను కంపెనీ అందిస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులకు రూ.95.03 నుంచి ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభమవుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
 
Advertisement