JioMeet
-
జియోటీవీలో అమర్ నాథ్ 'హారతి' ప్రత్యక్ష ప్రసారం
కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది దైవ ప్రియలు తమ ఇష్ట దైవలను సందర్శించ లేకపోతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమర్ నాథ్ వంటి పుణ్య క్షేత్రాలను దర్శించాలంటే ఇప్పుడు కష్టం అవుతుంది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఒక శుభవార్త తెలిపింది. మనదేశంలో పవిత్రం మందిరం అయిన అమర్ నాథ్ పుణ్య క్షేత్రన్ని భౌతిక దర్శించలేని భక్తుల సహాయ పడటానికి జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. మనదేశంలో అత్యంత క్లిష్టమైన భూభాగంలో ఉన్న అమర్ నాథ్ దగ్గర ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికి ప్రత్యక్ష ప్రసారానికి సపోర్ట్ చేసే నెట్ వర్క్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ జియో పేర్కొంది. గత వారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భక్తులకు వ్యక్తిగత అనుభవాన్ని అందించడానికి అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు వివిధ ఆన్ లైన్(http://www.shriamarnathjishrine.com/) సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. "కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది శ్రీ అమర్ నాథ్ జీ పవిత్ర మందిరాన్ని సందర్శించలేని లక్షలాది మంది భక్తులకు, పుణ్యక్షేత్రం బోర్డు వర్చువల్ మోడ్ కింద దర్శనం, హవాన్, ప్రసాద్ సౌకర్యాన్ని అందిస్తుంది. భక్తులు తమ పూజ, హవాన్, ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. పవిత్ర గుహ వద్ద ఉన్న పూజారులు భక్తుడి పేరిట దానిని అందిస్తారు. ప్రసాదం తర్వాత భక్తుల ఇంటికి డెలివరీ చేయనున్నట్లు" బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు కొత్తగా ఆన్ లైన్ సేవలను ప్రారంభించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివుడి భక్తులు పవిత్ర గుహ వద్ద ఆన్ లైన్ లో వర్చువల్ గా 'పూజ', 'హవాన్' నిర్వహించవచ్చు. తాజాగా రిలయన్స్ జియో జియోటీవీలో అమర్ నాథ్ గుహ వద్ద మంచు లింగానికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూర్చడం కోసం జియోకు చెందిన JioTV, JioMeet, JioSaavn, JioChat వంటి యాప్స్ ద్వారా ఈ సేవలను ప్రవేశపెట్టింది. జియోటీవీలోని ప్రత్యేక ఛానెల్ లో అమర్ నాథ్ హారతి ప్రత్యక్ష ప్రసారం, జియోమీట్ ద్వారా వర్చువల్ పూజ, హవాన్ అందిస్తుంది. భక్తులు పుణ్యక్షేత్రంలో పూజారితో వర్చువల్ రూపంలో పూజా గదిలో పాల్గొనడం, వారి పేరు, 'గోత్ర'లో హవాన్/పూజను నిర్వహించుకోవచ్చు. ఇక జియో సావన్ లో అమర్ నాథ్ పుణ్య క్షేత్రానికి చెందిన పాటలు ప్లే కావడం, జియో చాట్ ద్వారా ప్రత్యక్ష దర్శనంతో పాటు హారతి సమయం, విరాళాలు పంపవచ్చు. -
జూమ్ వర్సెస్ జియోమీట్
సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ జియోమీట్‌పై వాడివేడి చర్చ సాగుతోంది. జియోమీట్‌పై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు జూమ్ సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. జూమ్ యాప్‌ను పోలినవిధంగా జియోమీట్ యాప్ ఉండటంతో తాను కంగుతిన్నానని జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే విస్మయం వ్యక్తం చేశారు. జియోమీట్‌పై కేసు వేయడంపై రాజే నేరుగా స్పందించకపోయినా దీనిపై తమ న్యాయ విభాగం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జియోమీట్ యాప్ వస్తుందని తమకు ముందుగా తెలుసునని..దీన్ని తాము స్వాగతించామని, పోటీని ఎదుర్కోవడం జూమ్‌కు కొత్త కాదని అన్నారు. తమ ఉత్పత్తులు, సాంకేతికతే తమ బలమని..కస్టమర్లకు మెరుగైన సేవలందించడంపైనే తాము దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రత్యర్ధులు వారి వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటారని రాజే పేర్కొన్నారు. జూమ్ బృందం ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. జూమ్ డేటా సెంటర్ల గురించి సాంకేతిక సమాచారంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తాము ఎవరితోనూ డేటాను పంచుకోవడం లేదని, తమ ప్లాట్‌ఫాంపై సాంకేతిక అంశాలను, ఎలా ఆపరేట్ చేయాలనే వివరాలను పంచుకుంటామని పేర్కొన్నారు. గల్వాన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన నేపథ్యంలో భారత్ గతవారం 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. చైనా యాప్‌లను నిషేధించిన అనంతరం పెద్ద ఎత్తున స్వదేశీ యాప్‌లను భారతీయులు డౌన్లోడ్ చేసుకున్నారు. జియోమీట్‌ను లాంఛ్ చేసిన వారం రోజుల్లోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మరోవైపు చైనా వ్యతిరేక సెంటిమెంట్ నెలకొన్న క్రమంలో జూమ్ చైనా యాప్ అనే ప్రచారం సాగుతుండటంపై కంపెనీ వివరణ ఇచ్చింది. తమది చైనా కంపెనీ కాదని, అమెరికన్ కంపెనీ అని నాస్డాక్లో ట్రేడవుతోందని జూమ్ పేర్కొంది. కాలిఫోర్నియాలోని శాంజోస్‌లో కంపెనీ ప్రధాన కార్యాలయం పనిచేస్తోందని జూమ్ ట్వీట్ చేసింది. భారత్‌లో తమకు రెండు డేటా సెంటర్లు ఉన్నాయని, తాము డేటాను ఏ ప్రభుత్వంతోనూ పంచుకోవడం లేదని జూమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ సమీర్ రాజే సైతం వివరణ ఇచ్చారు. చదవండి : జియో మీట్ : 10 లక్షలు దాటిన డౌన్లోడ్స్ -
జియో మరో సంచలనం, ప్రత్యర్థులకు షాక్
సాక్షి, ముంబై : టెలికాం రంగం సునామి రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్డౌన్ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకునేందుకు కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్ ని లాంచ్ చేసింది. రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. తద్వారా ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలలోకి ప్రవేశించింది. అంతేకాదు రంగంలో దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్, హౌస్‌పార్టీ లాంటి యాప్ లకు గట్టి షాక్ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల సందర్బంగా జియోమీట్‌ను ప్రారంభించనున్నట్లు గురువారం తెలిపింది. జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని,ఇది ఏ పరికరంలోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే జియో మీట్ పరిమితం కాదు. జియో ఇహెల్త్, ఇఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని అనుసంధించారు. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి, ప్రిస్క్రిప్షన్లను పొందడానికి, మందులను ఆర్డర్లు ఇవ్వడానికి ఉపయోపడుతుంది. దీంతోపాటు డిజిటల్ వెయిటింగ్ రూమ్‌లను ప్రారంభించడానికి వైద్యులకు అనుమతిస్తుంది. ఇంకా వర్చువల్ తరగతి గదులు, రికార్డ్ సెషన్లు, హోంవర్క్‌లు, పరీక్షలను నిర్వహించడం లాంటి వాటికోసం ఇ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. తమ జియో మీట్ బహుళ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేస్తుందనీ, నావిగేట్ చేయడం కూడా చాలా సులభం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని పవార్ చెప్పారు. (లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) ఫ్రీప్లాన్‌లో ఐదుగురు వినియోగదారులు, బిజినెస్ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్ పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది. జియో వెబ్సైట్ సమాచారం ప్రకారం గ్రూప్ కాలింగ్ ద్వారా ఒకేసారి 100 మంది పాల్గొనే అవకాశం ఉండనుంది. జూమ్ ప్రస్తుతం 40 నిమిషాల వ్యవధిలో 100 మంది పాల్గొనే అవకాశాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి జియోమీట్ వెబ్‌సైట్‌లోని అన్ని వివరాలను తొలగించింది. మీ ఆసక్తికి ధన్యవాదాలన్న సందేశం కనిపిస్తోంది. (కరోనా : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ, వేతనాల కోత) కాగా కరోనా కల్లోలంతో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చాయి. వీడియో సమావేశాల ద్వారా పనులు చక్కబెట్టుకుంటున్నాయి. అలాగే విద్యాసంస్థలు కూడా వీడియో-కాన్ఫరెన్సింగ్, ఆన్ లైన్ పాఠాల వైపు మళ్లాయి. దీనితో గూగుల్, మైక్రోసాఫ్ట్ , జూమ్ వంటి సంస్థల వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ కు ఆదరణ భారీగా పెరిగింది. అయితే జూమ్ యాప్ సెక్యూరిటీ పై సందేహాలను వ్యక్తి చేసిన కేంద్రం ఈ యాప్ ను సాధ్యమైనంతవరకు వినియోగించ వద్దని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. (భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర)