jnu delhi
-
జేఎన్‌యూ విద్యార్థిగా ‘కంచ ఐలయ్య’
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మనిషి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి వెళుతుండగా పోలీసులు ఆపి ‘లోపల గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పేరెంట్స్, సంరక్షకులు లోపలికి పోరాదు’ అని చెప్పారు. ‘కానీ నేను జేఎన్‌యూ విద్యార్థిని’ అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చారు. ఆయనకు 47 ఏళ్లు. కేరళకు చెందిన ఆయన పేరు మొహినుద్దీన్. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా 1989 నుంచి జేఎన్‌యూలో చదువుతున్నారు. అనే పోస్ట్ ఫేస్బుక్లో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. జేఎన్‌యూలో హాస్టల్ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుండగా, ఫీజుల పెంపును బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు సమర్థిస్తున్న విషయం తెల్సిందే. హాస్టల్ ఫీజులు అతి తక్కువగా ఉండడం వల్లనే 47 ఏళ్లు వచ్చిన వారు కూడా ఇప్పటికీ విద్యార్థులుగా హాస్టల్లో ఉంటున్నారన్న ఉద్దేశంతో జేఎన్‌యూ విద్యార్థుల పేరిట ‘శాస్త్రీ కౌశాల్కిషోర్డ్’ పేరిట ఓ అమ్మాయి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, వాసుదేవ్ జీ రామ్నాని, సుశీల్ మిశ్రా, హరిదాస్ మీనన్ తదితరులు రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను ఎంతవరకు నమ్మారో తెలియదు. కేరళకు చెందిన మొహినుద్దీన్ అంటూ పెట్టిన ఫొటోను చూసిన వారు మాత్రం ఎవరూ నమ్మడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా వాసి ‘కంచ ఐలయ్య’ ఫొటో అది. తెలుగు వారందరికి అతను సుపరికితులే. ‘కంచ ఐలయ్య గొర్రెలకాపరి’ అని గర్వంగా చెప్పుకునే ఆయన ప్రముఖ దళితుల హక్కుల కార్యకర్త. రాజకీయ తత్వవేత్త, రచయిత. ‘వైశ్యాస్: సోషల్ స్మగ్లర్స్’ అంటూ ఆయన రాసిన పుస్తకం వివాదాస్పదమైంది. ఉస్మానియా యూనివర్శిటీలో ‘బుద్దిజం’లో పీహెచ్డీ చేసిన ఆయన హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (ఎంఏఎన్‌యూయూ)లో ‘సెంటర్ ఫర్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ’ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం జెఎన్యూలో పీహెచ్డీ చేస్తున్న స్కాలర్లలో కూడా 47 ఏళ్ల మొహినుద్దీన్యే కాకుండా అసలు 40 ఏళ్లు దాటిన వారే లేరని వామపక్ష విద్యార్థి సంఘాలు తెలిపాయి. చదవండి: ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కోమల్ జేఎన్‌యూ హింస: ముసుగు ధరించింది ఆమె! ఎందుకు అరెస్టు చేయలేదు? ‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’ -
మరో జేఎన్‌యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఎనిమిది మంది విద్యార్థినులు ఆందోళన చేపట్టి నెలరోజులు గడవకముందే వర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన మరో ప్రొపెసర్పై మహిళా స్కాలర్‌ను బెదిరించడం, లైంగిక వేధిపులకు గురిచేయడంపై కేసు నమోదైంది. నిందితుడైన ప్రొఫెసర్ 2014లో జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ (జేఎన్‌యూటీఏ)కు కన్వీనర్‌గా వ్యవహరించడం గమనార్హం. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సదరు ప్రొఫెసర్ తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, బెదిరించారని మహిళా పీహెచ్డీ స్కాలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ 354, 506, 509 కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్యాంపస్‌లో వెలుగు చూసిన తాజా లైంగిక వేధింపుల కేసని, బాధితురాలు తమను సంప్రదిస్తే తాము ఆమెకు పూర్తిగా సహకరిస్తామని జేఎన్‌యూ విద్యార్థి సంఘం పేర్కొంది. వర్సిటీలో ఏర్పాటైన లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీని ఆమె ఇంకా సంప్రదించలేదు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని, వర్సిటీలో అన్ని పదవుల నుంచి రాజీనామా చేసేలా వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ సంయుక్త కార్యదర్శి సౌరభ్ శర్మ డిమాండ్ చేశారు. -
యూనివర్సిటీలో గొడవ.. విద్యార్థి అదృశ్యం
-
యూనివర్సిటీలో గొడవ.. విద్యార్థి అదృశ్యం
దేశ రాజధానిలోని ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఒక విద్యార్థి అదృశ్యమయ్యాడు. హాస్టల్లో జరిగిన గొడవ తర్వాతే అతడు కనిపించకపోవడంతో.. అతడి తల్లిదండ్రులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీలో చదువుతున్న నజీబ్ అహ్మద్.. కేవలం 15 రోజుల క్రితమే యూనివర్సిటీలో చేరాడు. ఇక్కడకు వచ్చి తమ కొడుకు కనిపించకుండా పోయాడని.. అతడు ఎక్కడున్నాడని నజీబ్ తల్లి ఆవేదనగా ప్రశ్నించారు. అతడికి ఏమైందో కూడా తెలియడం లేదని.. తన కొడుకును తిరిగివ్వాలని అడిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బదయూ ప్రాంతానికి చెందిన ఆమె.. అర్ధరాత్రి ఫోన్ కాల్ రావడంతో కంగారు పడుతూ వచ్చారు. నజీబ్‌కు ఏబీవీపీ కార్యకర్తలతో గొడవ అయ్యిందని, మెస్ కమిటీ ఎన్నికల కోసం రాత్రిపూట ప్రచారం జరుగుతుండగా ఈ గొడవ జరిగిందని వామపక్ష కార్యకర్తలు ఆరోపించారు. ఏబీవీపీ అభ్యర్థిని నజీబ్ చెంపమీద కొట్టాడని.. దాంతో మరింతమంది కార్యకర్తలు అక్కడకు వచ్చి అతడిని కొట్టారని అంటున్నారు. అయితే ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. వామపక్ష కార్యకర్తలు గొడవలో జోక్యం చేసుకుని.. నజీబ్‌ను బాత్రూంలో దాచేశారని, తర్వాత అతడిని వార్డెన్ సమక్షంలో బయటకు తీసుకెల్లారని.. ఆ తర్వాత ఏమైందో మాత్రం తెలియడం లేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. తర్వాతి రోజు ఉదయం నుంచి నజీబ్ కనిపించకుండా పోయాడు. సోమవారం నాడు అతడు కిడ్నాప్ అయినట్లు కేసు దాఖలైంది. అతడి కోసం క్యాంపస్ మొత్తం గాలింపు మొదలైంది.