సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఎనిమిది మంది విద్యార్థినులు ఆందోళన చేపట్టి నెలరోజులు గడవకముందే వర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన మరో ప్రొపెసర్‌పై మహిళా స్కాలర్‌ను బెదిరించడం, లైంగిక వేధిపులకు గురిచేయడంపై కేసు నమోదైంది. నిందితుడైన ప్రొఫెసర్ 2014లో జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ (జేఎన్‌యూటీఏ)కు కన్వీనర్‌గా వ్యవహరించడం గమనార్హం. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సదరు ప్రొఫెసర్ తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, బెదిరించారని మహిళా పీహెచ్‌డీ స్కాలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడిపై ఐపీసీ 354, 506, 509 కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్యాంపస్‌లో వెలుగు చూసిన తాజా లైంగిక వేధింపుల కేసని, బాధితురాలు తమను సంప్రదిస్తే తాము ఆమెకు పూర్తిగా సహకరిస్తామని జేఎన్‌యూ విద్యార్థి సంఘం పేర్కొంది. వర్సిటీలో ఏర్పాటైన లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీని ఆమె ఇంకా సంప్రదించలేదు. లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని, వర్సిటీలో అన్ని పదవుల నుంచి రాజీనామా చేసేలా వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని ఏబీవీపీ నేత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ సంయుక్త కార్యదర్శి సౌరభ్ శర్మ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment