Joel Davis
-
హైదరాబాద్ జిల్లాలో 1,02,611 కేసులు పరిష్కారం
నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమవతి, డీసీపీ జోయెల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో రాజీ చేసుకోదలచిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, గృహహింస, చెక్‌బౌన్స్, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 1,02,611 పరిష్కారం అయ్యాయి. పార్టీలు, న్యాయవాదులు కలిసి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అనంతరం ప్రేమవతి మాట్లాడుతూ...క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు. ఒకసారి లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగే బదులు ఒకేసారి లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్‌అదాలత్‌లలో ముఖ్య పాత్ర వహిస్తారని, పార్టీలకు సన్నిహితంగా ఉన్న కారణంగా లోక్ అదాలత్‌ల గురించి పార్టీలకు వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, రెండవ అదనపు ట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవ అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కుదిరిన కొంత మందికి అవార్డు కాపీలను అందజేశారు. 1,02,611 కేసులు పరిష్కారం ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 32 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,02,611 కేసులు పరిష్కారం అయ్యాయి. క్రిమినల్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణం, మనోరంజన్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ రైల్వే కోర్టు ప్రాంగణం, పురానీ హవేలీ కోర్టు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కుటుంబ తగాదా కేసులు–277, చెక్»ౌన్స్ కేసులు–1,615, ఎస్టీసీ కేసులు–98,050, సీసీ ఐపీసీ కేసులు– 2,669 పరిష్కారమయ్యాయి. అలాగే ఈ లోక్ అదాలత్‌లో రూ.3,61,97000 పరిహారం కింద చెల్లించినట్లు కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి పాల్గొన్నారు. అదాలత్‌లో కేసు రాజీపడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి..ఇకపై కలిసి మెలిసి జీవించాలని వారికి సూచించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,04,769 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి డా.పట్టాబి రామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీందర్, ఎసీపీ శ్రీధర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు. -
నీరజ్‌ను చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్: సరూర్ నగర్ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్ పన్వార్‌లు షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్‌నుమాలోని షంషీర్‌గంజ్‌లో కాపురం పెట్టారు. నీరజ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్‌పై కక్ష పెంచుకున్నారు. తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్ బంటీపై హత్యకు స్కెచ్ గీశారు. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్. నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్‌తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్‌ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. -
నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల కోసం అక్రమంగా నగదు నిల్వ ఉంచారనే సమాచారం మేరకు సిద్దిపేట పట్టణంలో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించగా... సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదు గుర్తించామని, ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్), ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ మంగళవారం తెలిపారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఎవరు సమాచారం ఇచ్చినా, అనుమానం ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేస్తామన్నారు. సోమవారం నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేయగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షల నగదును దొరికిందని, సోదాల సమయంలో ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియో తీయడం జరిగిందని తెలిపారు. అంజన్‌రావు సమక్షంలోనే సోదాలు నిర్వహించామన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలీసులతో గొడవకు దిగి సీజ్ చేసిన డబ్బులను లాక్కున్నారన్నారు. వీరిలో ఐదుగురిని గుర్తించి అరె స్టు చేశామని, రూ. 27,500 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో 22 మందిపై కేసు లు నమోదు చేశామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సంఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఫోన్లో వివరించామని, సిద్దిపేటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, రావొద్దని ఆయనకు ముందుగానే చెప్పా మన్నారు. అయినా ఎంపీ సిద్దిపేటకు వచ్చే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని తి రిగి కరీంనగర్ పంపించామన్నారు. ఉపఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఎవరినీ అడ్డుకోవడం లేదన్నారు. ఇతర పార్టీల నాయకుల వా హనాలను కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పకడ్బందీగా దుబ్బాక ఉపఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం పని చేస్తోందన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. -
పుస్తకాలు, టవల్స్ ఇవ్వండి..: మంత్రి
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హరీశ్‌రావుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనను కలిసేందుకు వచ్చే అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున ఆయనను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పూలదండలు, బొకేలతో రావడంతో పూలదండలు, బొకేలకు బదులుగా నోట్‌పుస్తకాలు, శాలువాలకు బదులుగా టవల్స్ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురికి నచ్చేలా, నలుగురు మెచ్చేలా మంచి చేద్దామన్నారు. మీరిచ్చే నోట్‌బుక్కులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. నేత కార్మికుడు నేసిన తువ్వాలలు తేవడం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచిన వారమవుతామని అన్నారు. ప్రస్తుత సమాజంలో ఏ ఫంక్షన్‌కు వెళ్లినా అతిథులకు పూలబోకేలు ఇచ్చి ఆహ్వానించటం అనవాయితీగా ఉందని, కానీ అలాంటి అనవాయితీకి స్వస్తి పలకాలని హరీశ్‌రావు సూచించారు. మంత్రికి అభినందనలు తెలిపిన సీపీ సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌రావును బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ బాబురావు, ఏసీపీ రామేశ్వర్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, టూటౌన్ సీఐ ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. -
ఎవరైనా సరే.. రూల్ ఫర్ ఆల్!
ఆదిలాబాద్ క్రైం : స్పెషల్ డ్రైవ్‌లో ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్ హడలెత్తించారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన వాహనాల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అన్ని కూడళ్లలో పోలీసులు ద్విచక్ర వాహనాలు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగానే ఏఎస్పీ స్వయంగా రోడ్డుపై వాహనాలు ఆపుతూ నంబర్‌ప్లేట్, పత్రాలు లేని పదుల సంఖ్యలో వాహనాలను సీజ్ చేసి ఆర్టీవో ఆఫీస్‌కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట సిగ్నల్ పడిన సమయంలో ఆగిన వాహనాలు సైతం తనిఖీలు చేశారు. నాలుగు రోజుల ముందే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. వాహనదారులు అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పత్రాలు లేకుండా చాలామంది వాహనదారులు అడ్డంగా దొరికిపోయారు. ప్రతి రోజు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపడుతామని ఏఎస్పీ తెలిపారు. వాహనదారులు పత్రాలు వెంటే ఉంచుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్‌తో నేరాల అదుపునకు కృషి చేస్తున్నామని వివరించారు.