joint action
-
ఏకీకృత కమాండ్‌తోనే యుద్ధాల్లో విజయం
న్యూఢిల్లీ: శత్రుదేశాలతో యుద్ధాలను వీలైనంత త్వరగా గెలవడానికి ఆర్మీ, నావికాదళం, వాయుసేనలను కలిపి ఏకీకృత కమాండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా తెలిపారు. యుద్ధాల సమయంలో త్రివిధ దళాలు పరస్పరం సమన్వయం చేసుకుంటే శత్రువులను చావుదెబ్బ తీయవచ్చని వెల్లడించారు. ఈ ఏకీకృత కమాండ్ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రంతో పాటు రక్షణశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు ఈ విధానాన్ని ఇప్పటికే పాటిస్తున్నాయన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనోవా మాట్లాడుతూ.. చైనా తన సైన్యాన్ని ఐదు ఏకీకృత కమాండ్లుగా విభజించిందని తెలి పారు. భారత్‌లో మాత్రం 17 కమాండ్లు ఉన్నాయనీ, ఒక్క అండమాన్–నికోబార్ దీవుల్లో మాత్రం 2001లో వ్యూహాత్మక ఏకీకృత కమాండ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. రక్షణరంగంలో స్వయంసమృద్ధి సాధించడం ప్రతి దేశానికి కీలకమని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్‌లో దశలవారీగా ఆధునీకరణ చేపడుతున్నట్లు ధనోవా వెల్లడించారు. -
రైతు సమస్యలపై ఐక్యకార్యాచరణ: కోదండరాం
మంచాల: రైతాంగ సమస్యలపై ఐక్య కార్యాచరణకు సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లో రైతులతో సమావేశమయ్యారు. సాగు, తాగునీరు, పశుగ్రాసం, పాడిపంటల తీరుపై అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గమన్నారు. పోరాడితేనే స్వరాష్ట్రం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి కోసం బోర్లు వేయించాలని, రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకురావాలన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
కేంద్ర బలగాలతో కలసి ఉమ్మడి చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బలగాలతో కలసి ఉమ్మడి చర్యలు తీసుకుంటున్నట్లు హోం శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోల ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన ఏడు మండలాల్లో కేంద్ర నిధులతో రోడ్లు, పోలీసుస్టేషన్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. డిపాజిట్లు, మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో రాష్ట్రంలో అనేక సంస్థలు అక్రమ లావాదేవీలు జరుపుతున్నాయన్నారు. సినీ నటులు, ప్రముఖులు అలాంటి సంస్థల ప్రకటనల్లో నటించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పోలీసు విభాగంలో 14 వేల ఖాళీలు పోలీసు విభాగంలో 200 ఎస్సై పోస్టులతో కలిపి మొత్తం 14 వేల ఖాళీలున్నాయని చినరాజప్ప చెప్పారు. భర్తీకి అనుమతివ్వాలని ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు తెలిపారు.