రైతు సమస్యలపై ఐక్యకార్యాచరణ: కోదండరాం | peasant issues on Joint Action M. Kodanda Ram | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై ఐక్యకార్యాచరణ: కోదండరాం

Published Thu, Feb 25 2016 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

రైతు సమస్యలపై ఐక్యకార్యాచరణ: కోదండరాం

రైతు సమస్యలపై ఐక్యకార్యాచరణ: కోదండరాం

మంచాల: రైతాంగ సమస్యలపై ఐక్య కార్యాచరణకు సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌లో రైతులతో సమావేశమయ్యారు. సాగు, తాగునీరు, పశుగ్రాసం, పాడిపంటల తీరుపై అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గమన్నారు. పోరాడితేనే స్వరాష్ట్రం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి కోసం బోర్లు వేయించాలని, రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకురావాలన్నారు.  రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement