M. Kodanda ram
-
రైతు సమస్యలపై ఐక్యకార్యాచరణ: కోదండరాం
మంచాల: రైతాంగ సమస్యలపై ఐక్య కార్యాచరణకు సిద్ధం కావాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లో రైతులతో సమావేశమయ్యారు. సాగు, తాగునీరు, పశుగ్రాసం, పాడిపంటల తీరుపై అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గమన్నారు. పోరాడితేనే స్వరాష్ట్రం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి కోసం బోర్లు వేయించాలని, రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకురావాలన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
ఎన్నికల్లో పోటీచేయను: కోదండరాం
కేసీఆర్‌తో భేటీ.. గంటన్నర చర్చలు ఉద్యమాల్లోనే ఉంటూ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటానన్న జేఏసీ నేత సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, టీఎన్జీవో అధ్యక్షులు దేవీ ప్రసాద్ సమావేశమయ్యారు. కేసీఆర్ నివాసంలోనే బుధవారం వీరు సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చాలా అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. తెలంగాణ బిల్లు ఆమోదానికి ముందు, ఆ తరువాత ఢిల్లీలో జరిగిన పరిణామాలు, కాంగ్రెస్‌తో జరిగిన చర్చలు, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు, సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి, దానికి సంబంధించిన ప్రధానమంత్రి ప్రకటన వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోటి నుంచి పోటీ చేయాలని కోదండరాంను కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏర్పాటు కాబోయే ప్రభుత్వాలపై ఒత్తిడి కోసం ప్రజా సంఘాల ఆవశ్యకత ఉందని, అలాంటి ఉద్యమాల్లో ఉంటూ పునర్నిర్మాణం కోసం పాటు పడతానని కోదండరాం సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న పరిచయాలతో పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి అవకాశంగా ఉంటుందని, ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడానికి ఇదొక అవకాశంగా ఈ ప్రతిపాదన చేసినట్టుగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ప్రతిపాదన చేసినందుకు కృతజ్ఞతలు అని, పోటీ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని సున్నితంగా తిరస్కరించినట్టుగా కోదండరాం విలేకరులకు వెల్లడించారు. -
‘అపాయింటెడ్ డే’లో కుట్ర: కోదండరాం
పంపకాలు జరిగేంత వరకు అప్రమత్తంగా ఉండాలి: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన ‘ఆపాయింటెడ్ డే’ ను దూరంగా పెట్టడంలో కుట్ర దాగుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం కీలకమైన స్థానాల్లో సీమాంధ్రకు చెందిన అధికారులే ఉన్నందున పంపకాల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందన్నారు.విభజన జరిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఉంటే సీమాంధ్రుల ఆగడాలను నిలువరించడానికి అవకాశం ఉండేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలంతా ఏవిధంగా సంఘటితమై పోరాటం చేశారో.. పంపకాలు జరిగేంతవరకు అంతేజాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సీపీఐ-ఎంఎల్(న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం- ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సులో ఆయన మాట్లాడారు. - వివిధ రంగాల్లో నష్టపోయిన తెలంగాణకు సహా యం చేయాల్సింది పోయి, విభజనవల్ల ఆంధ్రకు అన్యాయం జరుగుతుందంటూ ప్రత్యేక ప్యాకేజీలు, హోదాలు కల్పించడం సరైందికాదన్నారు. - ఆంధ్రకు 15శాతం టాక్స్ మినహాయింపు ఇస్తే, ఇక్కడున్న పరిశ్రమలు ఉంటాయా? అని ప్రశ్నిం చారు. తెలంగాణపై రాష్ట్రపతి చేసిన సంతకం సిరా ఆరకముందే పోలవరం రూపంలో కేంద్రం తెలంగాణకు ద్రోహం తలపెట్టిందని విమర్శించారు. - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మిలియన్‌మార్చ్ లాంటి ఉద్యమాల్లో న్యూడెమోక్రసీ పాత్ర చాలా కీలకమైనదని టీజేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య చెప్పారు. - తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా జేఏసీ పాత్ర ఉండాలని సీపీఐ-ఎంఎల్(న్యూడెమోక్రసీ) రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.గోవర్దన్ కోరారు. -
1న ఢిల్లీకి టీ జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నేతలు డిసెంబర్ 1న ఢిల్లీ వెళ్లనున్నారు. 3,4,5 తేదీల్లో మూడురోజుల పాటు అక్కడే మకాం వేసి తెలంగాణ వ్యతిరేక ప్రయత్నాలను అడ్డుకోవాలని, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు కూడగట్టాలని నిర్ణరుుంచారు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జేఏసీ ముఖ్యనేతల సమావేశం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, దేవీ ప్రసాద్, పిట్టల రవీందర్, డాక్టర్ దాసోజు శ్రవణ్ (టీఆర్ఎస్), పి.సూర్యం (న్యూ డెమొక్రసీ) తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు, వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, వాటిని అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చిం చారు. ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో అన్ని పార్టీల అధినేతలను, ము ఖ్యులను కలిసి తెలంగాణకు మద్దతు కోరుతూ వినతిపత్రాలివ్వాలని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అని, తెలంగాణ ఏర్పాటుకు కొద్దిమంది స్వార్థపరశక్తులే వ్యతిరేకమని పేర్కొంటూ ఒక సవివరమైన నోట్‌ను అందజేయూలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో తెలంగాణ విలీనం, అంతకముందు తెలంగాణ నేపథ్యం, తెలంగాణపై వివక్ష, సుదీర్ఘ ఉద్య మం, ఉద్యమంలో జరిగిన వెన్నుపోట్లు, ఉద్యమకారులపై అణిచివేత, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, రాజకీయపార్టీల వైఖరి వంటివాటిపై కూడా ఓ నోట్‌ను అన్ని పార్టీల నేతలకు ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం ఢిల్లీకి ఇదే చివరియాత్రగా భావిస్తున్న జేఏసీ ము ఖ్య నేతలు అంతా కలిసి ఒకే బోగీలో వెళ్లాలని తీర్మానించుకున్నా రు. ఇలావుండగా టీఆర్ఎస్ చేపడుతున్న దీక్షాదివస్‌కు సంఘీభావంగా ఆయూ కార్యక్రమాల్లో పాల్గొనాలని జేఏసీ నిర్ణయించింది. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలి రాష్ట్రవిభజనానంతరం భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలంటూ ఆ ప్రాంత నాయకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. డివిజన్లోని ప్రజలంతా తాము తెలంగాణలోనే కొనసాగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని, ఈ మేరకు 143 గ్రామాల ప్రజలు గ్రామసభల్లో తీర్మానం చేశారని తెలిపారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి ఆ తీర్మానాల ప్రతులను అందజేశారు. -
తెలంగాణ ఇస్తే చాలు : కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ఏ కమిటీ వేసుకున్నా తెలంగాణ ఇస్తే చాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు.ఇంకా అఖిలపక్ష కమిటీలు,మంత్రుల కమిటీల పేరుతో ఆలస్యం చేయకుండా తెలంగాణను వెంటనే ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణవాదులు నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించారు. శుక్రవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలను ధరించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ జెండాను ఆవిష్కరించారు. కాగా, నల్లజెండాలను ఎగురవేయకుండా పోలీసులు వాటిని తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇంకా దాగుడు మూతలు ఆడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ నాయకులకు అవకాశాలు ఇంకా రావని, చంద్రబాబును నిలదీయాలని సూచించారు. ఎటువైపు ఉండాలో తెలంగాణ టీడీపీ నాయకులు తేల్చుకోవాలని కోదండరాం సూచించారు. జేఏసీ అధికారప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, అసెంబ్లీలో తీర్మానం చేయకుంటే జరుగదని, 371(డి) అని సీమాంధ్ర ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. చైనాగోడ కడతామా: ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ నదీ జలాలను అడ్డుకోవడానికి తెలంగాణలో చైనా గోడను కట్టబోమని,తెలంగాణకు రావాల్సిన వాటాను మించి ఒక్క టీఎంసీని కూడా అదనంగా వాడుకోబోమని ఎమ్మెల్సీ, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్‌కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా నల్ల పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పిట్టల రవీందర్,టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్, రేచల్, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, ఉపాధ్యక్షుడు వేదకుమార్, టీఆర్ఎల్డి నాయకులు చెరుకూరి శేషగిరిరావు, ఎ.రవి, 1969 ఉద్యమకారుల సంఘం నాయకులు కొల్లూరి చిరంజీవి, ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వలసలకు కేంద్రంగా తెలంగాణ: కోదండరాం ఆవేదన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం 1956లో జరిగిన రెండు సామాజిక ఆర్థిక వ్యవస్థల విలీనమని, దాంతో తెలంగాణ అంతర్గత వలస కేంద్రంగా మారిపోయిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఫజల్ అలీ కమిటీ తెలంగాణ దోపిడీకి గురవుతుందని అప్పట్లోనే ప్రకటించిందన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘నవంబర్ 1 తెలంగాణ విద్రోహ దినం’ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీటీఎఫ్ ఇన్చార్జి అధ్యక్షుడు కె.రమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పక్కన తెలంగాణ మంత్రులా?: టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కన తెలంగాణకు చెందిన మంత్రులు ఎలా ఉంటారని టీఆర్ఎస్ నేతలు నాయిని నర్సింహ్మా రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో నల్ల జెండాను ఎగురేసిన అనంతరం వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఇదే చివరి విద్రోహదినమని అన్నారు. -
ఆధిపత్య దోపిడీ కోసమే.. : ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: సమైక్యవాదం పేరుతో కొంతమంది అధికారాన్ని దక్కించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ఆరోపించారు. సమైక్యవాదం ఆధిపత్య దోపిడీ కోసమైతే తెలంగాణది జీవన పోరాటమన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో, మెదక్‌జిల్లా సంగారెడ్డిలో జరిగిన విద్యార్థి భేరి సభలో మాట్లా డారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరి వల్లా కాదన్నారు. హైదరాబాద్ తమది అని సీమాంధ్రులు అంటే.. హైదరాబాదే నవ్వుతుందని ఎద్దేవా చేశారు. కేవలం హైదరాబాద్‌లో కోటలు కట్టుకున్నవారు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు సంబరాలు మాని, తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో సకలజనభేరి సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యే హరీష్‌రావు, లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ , నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 29న నిర్వహించనున్న సకలజనుల భేరిసభ నిర్వహణపై చర్చించేందుకు బుధవారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మంగళవారం టీఎన్జీవో భవన్లో పలువురు నేతలు సమావేశమై సభకు జన సమీకరణ, నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. -
సీమాంధ్రులది ఉన్మాదం
నిజామాబాద్, న్యూస్‌లైన్ : సీమాంద్రులది ఉన్మాదమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిజామాబాద్‌లో జేఏసీ నిర్వహించిన శాంతి ర్యాలీ, ముల్కీ అమరుల దీక్షలో ఆయన మాట్లాడారు. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడితేనే పెళ్లవుతుందని, లేదంటే తప్పయితదని పేర్కొన్నారు. అదే అమ్మాయి కావాలని అబ్బాయి యాసిడ్ పట్టుకొని వెంటపడితే ఉన్మాదం అవుతుందని, ప్రస్తుతం సమైక్య ఉద్యమం అలాంటిదేనని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణ ప్రజలకు ముఖం చూపెట్టలేక గుంటూరులో ఆత్మగౌరవ యాత్ర చేపట్టారని, ఆ యాత్ర అక్కడే ముగుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ శాంతి ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరన్నారు. అద్వానీ, వాజ్పాయ్ల ఎదుట తెలంగాణ ఏర్పాటు వద్దని చెప్పిన చంద్రబాబు, 2009లో తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నదీ కూడా తానేనని ఎందుకు ఒప్పుకోవడంలేదని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన హైదరాబాద్: ఈ నెల 7న ముల్కీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సిటీ కళాశాల విద్యార్థి జేఏసీ, పాతనగర రాజకీయ జేఏసీ సంయుక్తాధ్వర్యంలో సన్నాహక కాగడాలు, కొవ్వొత్తులతో సిటీ కళాశాల చుట్టూ ప్రదర్శన నిర్వహించారు. అమరువీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రదర్శనలో తెలంగాణ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇంటాక్ ఏపీ స్టేట్ కో-కన్వీనర్ ఎం.వేద కుమార్, తెలంగాణ జేఏసీ కో-కన్వీనర్లు ఎ.మాణిక్ ప్రభు గౌడ్, ఎం.ఎస్. తిరుమల్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్, బాబు సీమాంధ్రకే ప్రతినిధులు: కోదండరాం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుల స్వభావం తేటతెల్లమైందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఆదిలాబాద్‌లో ముల్కీ అమరుల సంస్మరణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చంద్రబాబు చెప్పడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడమేనని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్.. ఇప్పుడేమో నిర్ణయాలు పార్టీలు కాదు ప్రజలు తీసుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వారిద్దరు ఆంధ్ర ప్రాంత నాయకుల్లా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులను హైదరాబాద్‌లో బతకనివ్వరనడంలో వాస్తవం లేదన్నారు. హైదరాబాద్‌లో భూములమ్మి ఫ్లై ఓవర్లు, రింగ్‌రోడ్లు, హైటెక్‌సిటీని నిర్మించి సీమాంధ్రులకు లబ్ధి చేకూర్చిన చంద్రబాబు, అంతా తానే చేశానని చెప్పుకోవడం సరికాదన్నారు. సీమాంధ్ర నేతల పాలన కారణంగానే హైదరాబాద్‌లో ఫార్మా, ఇతర పరిశ్రమలన్నీ మూతడ్డాయని ధ్వజమెత్తారు. ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించే శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
7న చలో హైదరాబాద్: ప్రొఫెసర్ ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘చలో హైదరాబాద్’ పిలుపుతో సెప్టెంబరు మొదటివారంలో రాజధానిలో భారీ శాంతిర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించిన సద్భావనాదీక్ష (శాంతిదీక్ష)లో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 4-7 తేదీల మధ్య తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్‌కు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయాలు లేవని, సంపన్న సీమాంధ్రులే తెలంగాణను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా కలిసే ఉంటామని చెప్పడానికి సెప్టెంబరు మొదటివారంలో భారీశాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉపద్రవం ఏదో వస్తున్నట్టుగా, భారతదేశం నుండి విడిపోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇదే ఫెడరల్ వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రాలన్నీ ఇప్పటిలాగానే పనిచేస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒక మాట, ఢిల్లీలో మరోమాట చెప్తూ ఇటు ప్రజలను, అటు అధిష్టానాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. నదీ జలాల పంపకం, హైదరాబాద్ వంటివాటిని వివాదం చేసే విధంగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేదాకా ఇదే ఐకమత్యంతో పోరాడాల్సిందేనని కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్రకు పోవాలని, లేదంటే అది ఆత్మవంచన యాత్రే అవుతుందని టీఆర్ఎస్ సంస్థాగత, శిక్షణా శిబిరాల నిర్వహణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే ఎవరికీ మంచిదికాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనుకుంటే ఎవరూ సహించబోరని ఆయన చెప్పారు. వైషమ్యాలు పెంచడానికి ఎంఐఎం కుట్రలు: కవిత తెలంగాణపై ఇలాంటి కుట్రలే కొనసాగితే ఇప్పటిదాకా బతుకమ్మలు ఎత్తుకున్న చేతులతోనే బరిసెలను పడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల ఇంటిపై ఎంఐఎం పేరు రాసుకోవాలని అసదుద్దీన్ చెప్తున్నారని, రాజకీయ లబ్ధికోసం తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై ఇంకా మోసపూరితంగా వ్యవహరించకుండా చంద్రబాబునాయుడు వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పొట్ట నింపుకోవడానికి వచ్చినవారితో సామరస్యంగా ఉంటామని, పొట్టలు కొట్టేవారితోనే తమ పోరాట మని చెప్పారు. ప్రజల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టకుండా, శాంతియుత విభజనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలో జేఏసీ నేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, రఘు, జల వనరులరంగం నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు తదితరులు ప్రసంగించారు. సెప్టెంబరు 7న శాంతిర్యాలీ..? జేఏసీ నిర్వహించ తలపెట్టిన శాంతిర్యాలీ సెప్టెంబరు 7న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 4 నుంచి7 తేదీల మధ్యనే దీనిని నిర్వహించాలని మొదట భావించారు. అయితే సెప్టెంబరు 3, 4 తేదీల్లో ముల్కీ అమరుల సంస్మరణ దినంగా జరుపుకోనున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న ఉండటంతో శాంతి ర్యాలీని 7న నిర్వహించాలని జేఏసీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. -
సమైక్య ఉద్యమం అప్రజాస్వామికం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సమైక్యవాద ఉద్యమమే రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. ఇష్టం లేని ప్రాంతాలను బలవంతంగా కలిసి ఉండాలంటూ ఉద్యమాలు చేయడమే అప్రజాస్వామికమన్నారు. శనివారమిక్కడ టీఎన్జీవో కార్యాలయంలో వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జేఏసీ స్టీరింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడారు. సీమాంధ్రలోని సమైక్య ఉద్యమాన్ని వివిధ కోణాల్లో చూపిస్తున్న మీడియాలోని ఒకవర్గం తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గుర్తించడం లేదన్నారు. సమైక్య సమ్మెలో ఆర్టీసీ కార్మిక సంఘాలు, 11 ఉద్యోగ సంఘాలు, సింగరేణి కార్మికులు పాల్గొనడం లేదన్నారు. వీటిని మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి ఉండటం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదని, అయినా కలిసి ఉండాలని ఉద్యమాలు చేయడం ప్రజల హక్కును హరించడమేనని చెప్పారు. ఎవరి హక్కులకోసం వారు పోరాడితే తప్పులేదని, ఇతరులకు హక్కులు లేకుండా చేయడమే అప్రజాస్వామిక ధోరణి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీని కలిసే ఆలోచన జేఏసీకి లేదన్నారు. ఉద్యోగులు, డాక్టర్లు, విద్యార్థులు, ప్రజలు తెలంగాణలో కార్యక్రమాలు పెట్టుకుంటామంటే అనుమతించని ప్రభుత్వం.. ఏపీఎన్జీవో సభకు ఎలా అనుమతిని ఇస్తుందని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అధికారం ఉద్యోగ సంఘాలకు, నేతలకు ఉన్నా తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో చేసిన తీర్మానాలను కోదండరాం మీడియాకు వివరించారు హైదరాబాద్ రాజధానిగా, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్‌పై తెలంగాణకు సంపూర్ణ అధికారాలు ఉండాలని ఈ సభ తీర్మానించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రా ప్రాంతంలో రాజధాని ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్‌ను తాత్కాలిక రాజధానిగా మాత్రమే పరిగణించాలి. తెలంగాణపై కేంద్ర కేబినెట్లో వెంటనే తీర్మానం చేయాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలి. ప్రజల ఆకాంక్షలను నిష్పక్షపాతంగా వ్యక్తీకరించి, ప్రజాస్వామిక విలువలను ప్రతిష్టింపజేయాల్సిన బాధ్యత మీడియాది అని భావిస్తున్నాం. మీడియాలోని ఒక వర్గం సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికలుగా వ్యవహరిస్తూ ప్రజల మధ్య విద్వేషాలను , వైషమ్యాలను రెచ్చగొడుతోంది. మీడియాలోని ఈ పక్షపాత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత విభజనకు మీడియా తోడ్పడాలని కోరుతున్నాం. సమైక్యవాద ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకం. ఈ ఉద్యమాన్ని తిరస్కరించి శాంతియుత విభజనకు సహకరించి, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కాపాడటానికి తోడ్పడాలని ఆంధ్రా ప్రజలను కోరుతున్నాం. తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లిన ఎంపీ వీహెచ్‌పై దాడికి దిగడం అప్రజాస్వామికం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దోషులను గుర్తించి, కఠినంగా శిక్షించాలి. ఈ నెల 19 నుంచి వారంరోజుల పాటు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సద్భావనా దీక్షలను చేయాలి. వీటిలో రోజుకు కొన్ని జేఏసీలు పాల్గొనాలి. కోదండరాం ఢిల్లీ పర్యటన వివాదం జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిశారని, కాంగ్రెస్ పార్టీకి వీరు దగ్గరవుతున్నారని శనివారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జేఏసీలోని కొందరు కాంగ్రెస్‌కు దగ్గర అవుతుంటే, మరికొందరు ఇంకో రాజకీయ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. దీనిపై జేఏసీలోనూ చర్చించి నట్టుగా తెలిసింది. ఈ అంశంపై కోదండరాంను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నేను ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను ఎవరినీ కలువలేదు. పుకార్లను నమ్మవద్దు. సంబంధం లేని అంశాలను అంటగట్టి, జరుగని నిర్ణయాలను జరిగినట్టుగా చిత్రీకరించడం మంచిది కాదు. జేఏసీలో ఏం జరిగినా చర్చించి, ఏకగ్రీవంగా తీర్మానించుకుంటాం. మనుషులు ఎవరైనా తప్పులు చేస్తరు. వాటిని చర్చల ద్వారా సరిదిద్దుకుంటం. జేఏసీలో విభేదాలు లేవు’’ అని చెప్పారు.