సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నేతలు డిసెంబర్ 1న ఢిల్లీ వెళ్లనున్నారు. 3,4,5 తేదీల్లో మూడురోజుల పాటు అక్కడే మకాం వేసి తెలంగాణ వ్యతిరేక ప్రయత్నాలను అడ్డుకోవాలని, ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు కూడగట్టాలని నిర్ణరుుంచారు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జేఏసీ ముఖ్యనేతల సమావేశం హైదరాబాద్‌లో గురువారం జరిగింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, దేవీ ప్రసాద్, పిట్టల రవీందర్, డాక్టర్ దాసోజు శ్రవణ్ (టీఆర్‌ఎస్), పి.సూర్యం (న్యూ డెమొక్రసీ) తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు, వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, వాటిని అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చిం చారు.
ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో అన్ని పార్టీల అధినేతలను, ము ఖ్యులను కలిసి తెలంగాణకు మద్దతు కోరుతూ వినతిపత్రాలివ్వాలని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అని, తెలంగాణ ఏర్పాటుకు కొద్దిమంది స్వార్థపరశక్తులే వ్యతిరేకమని పేర్కొంటూ ఒక సవివరమైన నోట్‌ను అందజేయూలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో తెలంగాణ విలీనం, అంతకముందు తెలంగాణ నేపథ్యం, తెలంగాణపై వివక్ష, సుదీర్ఘ ఉద్య మం, ఉద్యమంలో జరిగిన వెన్నుపోట్లు, ఉద్యమకారులపై అణిచివేత, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, రాజకీయపార్టీల వైఖరి వంటివాటిపై కూడా ఓ నోట్‌ను అన్ని పార్టీల నేతలకు ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం ఢిల్లీకి ఇదే చివరియాత్రగా భావిస్తున్న జేఏసీ ము ఖ్య నేతలు అంతా కలిసి ఒకే బోగీలో వెళ్లాలని తీర్మానించుకున్నా రు. ఇలావుండగా టీఆర్‌ఎస్ చేపడుతున్న దీక్షాదివస్‌కు సంఘీభావంగా ఆయూ కార్యక్రమాల్లో పాల్గొనాలని జేఏసీ నిర్ణయించింది.
భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే ఉంచాలి
రాష్ట్రవిభజనానంతరం భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలంటూ ఆ ప్రాంత నాయకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. డివిజన్‌లోని ప్రజలంతా తాము తెలంగాణలోనే కొనసాగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని, ఈ మేరకు 143 గ్రామాల ప్రజలు గ్రామసభల్లో తీర్మానం చేశారని తెలిపారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి ఆ తీర్మానాల ప్రతులను అందజేశారు.
1న ఢిల్లీకి టీ జేఏసీ నేతలు
Published Fri, Nov 29 2013 3:40 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement