jomato App
-
క్లిక్ కొట్టు.. పుడ్ పట్టు
కిచెన్లు బోసిపోతున్నాయి. అయినా విభిన్న రకాల ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి. జిహ్వకు నచ్చిన రుచులు క్షణాల్లో ముంగిట వాలుతున్నాయి. దీంతో పొయ్యిలకు పని లేకుండా పోతుంది. నగర జీవనంలో ఇది ప్రస్ఫుటిస్తుంది. ఉరుకుల పరుగుల జీవనానికి .. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు తోడవడంతో గృహిణులకు వంట భారం తప్పింది. మూడు పూటలా బయట ఫుడ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. నగర వాసుల అభిరుచులను పసిగట్టిన వివిధ యాప్‌లు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులు కూడా బయటఫుడ్కే మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు పోతే ఇళ్లల్లో కిచెన్ కనిపించకుండాపోతుందేమో..! సాక్షి, విశాఖపట్నం: ఉరుకుల పరుగుల జీవితాల్లో కనీసం వంట చేసి తినడానికి కూడా జనానికి సమయం.. ఓపిక దొరకడం లేదు. ఎవరికి వారు బిజీబీజీగా గడుపుతున్నారు. ముప్పొద్దులా వండి కాస్త రుచిగా తినేందుకు సైతం వారికి సమయం ఉండటం లేదు. ఉదయం హడావుడిగా లేవడం.. రెడీ అయ్యేందుకే సమయం సరిపోకపోవడం.., మధ్యాహ్నం ఇంటికి రాలేకపోవడం రాత్రి ఆలస్యంగా రావడం మొదలైన కారణాలు కడుపు నిండా కాస్త తిండి తినేందుకు కూడా తీరిక ఉండటం లేదు. ఫలితంగా ఇటీవల అధిక శాతం ప్రజలు బయటే కొని తింటున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం కూడా ఇంటి ఫుడ్ దూరమవడానికి కారణమవుతోంది. చిన్న కుటుంబాలు పెరిగిపోవడం పల్లెల నుంచి జనం నగరాలకు అధికంగా వలసలు రావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం పిల్లల కార్పొరేట్ చదువులు వంటి కారణాలతో ప్రతీ ఒక్కరూ బిజీగా మారుతున్నారు. ఫలితంగా జిల్లాలో హోటళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ప్రధానంగా రోడ్డు సైడ్ హోటళ్లు, మొబైల్ క్యాంటీన్లు రెస్టారెంట్లు, దాబాలు, ఫుడ్ డెలివరీ యాప్‌లు అధికమవుతున్నాయి. రద్దీగా హోటళ్లు... ముఖ్యంగా ఎన్ఎడీ జంక్షన్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, వీఐపీరోడ్, అక్కయ్యపాలెం, అశీల్‌మెట్ట, సిరిపురం, బీచ్‌రోడ్డు, సీతమ్మధార, మద్దిలపాలెం మొదలైన కేంద్రాల్లో హోటళ్ల వ్యాపారం జోరందుకుంటోంది. ఇంట్లో వంట చేయకుండా హోటళ్ల నుంచే ఆహారం కొనుగోలు చేసుకొని భోజనం కానిచ్చేందుకు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు పెరగుతున్నాయి. ఉద యం వేళల్లో టిఫిన్ సెంటర్లు, మొబైల్ క్యాంటీ న్లు, హోటళ్ల వద్ద అల్పాహారం కోసం రద్దీ కనిపిస్తోంది. ఇంట్లో నలుగురు ఉంటే హోటళ్లో టిఫిన్ కొనాలంటే కనీసం రూ.150 అవుతుంది. అదే ఇంట్లో టిఫిన్ తయారు చేసుకుంటే రూ.50 సరి పోతుంది. కానీ ఖర్చుకు జనం వెనుకాడటం లే దు. కేవలం మధ్యాహ్న భోజనం మాత్రం వండుకుని ఆఫీస్‌కి వెళ్తున్నారు. ఒక్కోసారి అన్నం మా త్రం వండుకుని మార్గమధ్యంలోని కర్రీ పాయింట్లో కూరలు, సాంబార్ కొని తింటున్నారు. యువతకు ఉపాధి.. ఫుడ్ డెలివరీ సంస్థలు రావడంతో స్థానికంగా ఉన్న యు వతకు ఉపాధి లభిస్తోంది. ఆహారం డెలివరీ చేసే సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తి నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలు సంపాదిస్తున్నారు. ఉన్న ఊర్లో రూ.20 వేల దాకా సంపాదిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటున్నారు. ఒక్క నగరంలోనే ఫుడ్ డెలివరీ సంస్థల్లో పని..చేసే వారి సంఖ్య 500 దాకా చేరుకుందని సమాచారం. కేవలం ఇంటర్, డిగ్రీ చదివి ఉండి, సొంతంగా బైక్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు హోటళ్లు సైతం ఫుడ్ డెలివరీ సంస్థలకు డిస్కౌంట్లు ఇస్తుండటం, ఫుడ్ డెలివరీ చేసినందుకు కమీషన్లు ఉండటంతో ఈ సరికొత్త వ్యాపారం లాభసాటిగా ఉంటోందని యువత అభిప్రాయపడుతోంది. ఆన్లైన్ ఆర్డర్ల జోరు.. ఏడాది కిందట నుంచి నగరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఉబెర్‌ఈట్స్, ఫుడ్‌పాండా.. ఇలా.. పలు ఆన్లైన్ సంస్థలు వచ్చాక ప్రజలు వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. మొదట్లో పిజ్జాలు, బర్గర్లు మాత్రమే ఆర్డర్ ద్వారా ఇంటికి తెచ్చుకునేవారు. ఇప్పుడు వాటి స్థానంలో టిఫిన్లు, భోజనం, బిర్యానీలు కూడా చేరాయి. స్మార్ట్‌ఫోన్‌లో సదరు సంస్థల యాప్‌లు డౌన్లోడ్ చేసుకుని, అందులో నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే అతి తక్కువ సమయంలో కోరుకున్న ఆహారం ఇంటి ముందు..ప్రత్యక్షమవుతోంది. ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే వంటి సంస్థలు పలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించడం ఈ వ్యాపారానికి మరింత ఊతమిస్తోంది. రెండు కొంటే ఒకటి ఉచితమన్నట్లు ఈ వ్యాపారం ఉండటంతో జనం ఆసక్తి చూపుతున్నారు. రాత్రి వేళా టిఫిన్లకే మొగ్గు రాత్రి వేళ అన్నం బదులు టిఫిన్ తినడం ఇటీవల అధికమైంది. దీంతో వివిధ మోడళ్లలో రోడ్ల వెంబడి వెలసిన దుకాణాల్లో తిని ఇంటికి వెళ్తున్నారు. మరికొందరు తీరిగ్గా రెస్టారెంట్లకు వెళ్లి మాంసాహారం, ఇతర వెరైటీ వంటకాలు ఆరగించి వెళ్తున్నారు. దీంతో ఇంట్లో వండుకోవడం, అనంతరం పాత్రలు కడగడం వంటి శ్రమ తగ్గుతోందని అధిక శాతం భావిస్తున్నారు. బయట ఫుడ్‌కే జై.. మేము ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారంలో బిజీబిజీగా ఉంటున్నాం. ఒక్కోసారి మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనానికి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కువసార్లు బయట నుంచే టిఫిన్లు, భోజనాలు తెచ్చుకుంటున్నాం. ఫుడ్ డెలివరీ సంస్థలతో హోటళ్లకు వెళ్లి తెచ్చుకునే కష్టం కూడా తప్పింది. – జి.వేణుగోపాలరావు, వ్యాపారి, పెదవాల్తేరు అలసట దూరం భార్యా భర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కాలం వెళ్లదీయలేని రోజులివి. ఈ నేపథ్యంలో.. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. వారమంతా ఇంటి పని, ఆఫీస్.. ఇలా బిజీ బిజీగా గడుపుతాం. వారాంతంలోనూ పనిలో పడితే.. శారీరక అలసట ఎక్కువవుతోంది. అందుకే వీకెండ్లో హోటళ్లకు వెళ్లడం, లేదంటే.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ.. రిలాక్స్ అవుతుంటాం. – సీహెచ్ హిమబిందు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నందగిరినగర్ ఇష్టమైనవన్నీ ఇంటికే ఇంట్లో నచ్చిన వంటలు చేసుకొని తినాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. హోటల్‌కి వెళ్లి తినాలన్నా.. అక్కడ ఫుడ్ వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి. అదే.. ఆన్లైన్లో ఆర్డర్ చేసి.. ఇంటిలో ఇతర పనులు పూర్తి చేసుకొనే సరికి ఇష్టమైన ఫుడ్ ఇంటికే వచ్చేస్తోంది. మనకు నచ్చినట్లుగా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. – శారద, గృహిణి -
డెలివరీ బాయ్స్‌పై పోలీసుల సీరియస్
సాక్షి, ముంబై: ఇళ్లకు, కార్యాలయాలకు వేడివేడి ఫుడ్ సరఫరా చేస్తున్న ప్రముఖ స్విగ్గీ, జొమాటో కంపెనీ యాజమాన్యాలకు నోటీసులు జారీచేయాలని ట్రాఫిక్ శాఖ భావిస్తోంది. ఇందులో పనిచేసే డెలివరీ బాయ్‌లు తమ ప్రాణాలను ఫణంగా పెడుతూట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై దూసుకెళుతున్నారు. దీంతో వారిని నియంత్రించాలని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయనుంది. డెలివరీ తొందరగా ఇవ్వడానికి.. నేటి ఆధునిక యుగంలో బయట ఫుడ్‌కు చాలా మంది అలవాటు పడ్డారు. డబ్బుకు విలువలేకుండా పోయింది. ఉద్యోగం చేసే దంపతులతోపాటు ఇళ్లలో ఉండే సామాన్య ప్రజలు కూడా రెడీమేడ్ ఫుడ్‌కు ఆకర్షితులయ్యారు. డోమినోజ్ ఫిజ్జా,పాశ్చత్యదేశాల ఫుడ్‌పై కూడా మోజు పెంచుకున్నారు. కేవలం ఫోన్ చేస్తే చాలు కొద్ది నిమిషాల్లోనే ఇంటి గుమ్మం ముందుకు తము ఆర్డర్ చేసిన ఫుడ్ ప్రత్యక్షమైతుంది. ఇలాంటి వారికి తినుబండారాలు సరఫరా చేసే స్విగ్గి, జోమేటో కంపెనీలునగరంలో అక్కడక్కడ తమ బ్రాంచ్‌లు తెరిచాయి. కానీ, అందులో పనిచేస్తున్న డెలీవరి బాయ్‌లు పనితీరు సక్రమంగా లేదు. అడ్డగోలుగా బైక్‌లు వేగంగా నడుపుతున్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బాయ్‌లు తొందరగా డెలీవరి చేసి మరో ఆర్డర్ దక్కించుకోవాలనే తపనతో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు బైక్‌లను ఆపే ప్రయత్నం చేసినా తప్పించుకు పారిపోతున్నారు. వీరి ప్రాణాలకు రక్షణ లేకపోవడమేగాకుండా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే ఆస్కారముంది. దీంతో డెలీబాయ్‌లకు మార్గదర్శనం చేయాలని లేదంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయకతప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. -
స్త్రీలోక సంచారం
► సౌదీ అరేబియాలో స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అరేబియా రాజ్యపు నిబంధనలివి. ఈ నిబంధనలను అతిక్రమించి ఒక సంగీతకారుడిని ప్రేమించి, అతడితో పెళ్లికోసం కోర్టుకు వెళ్లిన ఒక మహిళ చివరికి ఆ న్యాయ పోరాటంలో ఓడిపోయింది. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో వాద్యాలపై సంగీతం పలికించే వారిని మతపరంగా తక్కువగా చూస్తారు. అలాంటి ‘తక్కువ’ యువకుడిని ఈ యువతి ప్రేమించడం రాజ్య నిబంధనలకు విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది. సౌదీ రాజధాని రియాద్‌కి ఉత్తరాన ఉన్న ఖస్సిమ్ శుద్ధ సంప్రదాయ ప్రాంతం. రెండేళ్ల క్రితం.. అక్కడి ఒక బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న 38 ఏళ్ల యువతిని ప్రేమించిన ‘లూట్’ (గిటార్‌ను పోలి ఉంటుంది) వాద్యకారుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ యువతి కూడా అందుకు ఒప్పుకుంది కానీ, ఆమె తల్లిదండ్రులు సమ్మతించలేదు. ‘‘మతాచారం ప్రకారం అతడు నీకు తగినవాడు కాదు’’ అని పెళ్లికి తిరస్కరించారు. ఆమె కోర్టుకు వెళ్లింది. అతడిని పెళ్లిచేసుకోడానికి న్యాయపరమైన అనుమతిని ఇమ్మని కోరింది. దీనిపై రెండేళ్ల పాటు విచారణ జరిపిన కోర్టు... ఆమె తల్లిదండ్రుల నిర్ణయాన్నే సమర్థించింది. ‘‘ఆ సంగీతం వాయించేవాడు నీతో పెళ్లికి అనర్హుడు’’ అని తీర్పు చెప్పింది. ఇక ఆమె ప్రియుడు.. తన ‘లూట్’పై విషాద గీతాలను ఆలపించుకుంటూ తిరగడం తప్ప వేరే మార్గం లేక దిగాలు పడిపోయాడు. ఆ యువతి మాత్రం సౌదీ ఫెమినిస్టు సౌఆద్ అల్షమ్మరీ మద్దతు కోసం చూస్తోంది. ► టర్కీలో పదహారేళ్ల బాలుడు తన 13 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకున్నాడు. దానినెవరో వీడియో తీశారు. ఆ వీడియోను ఎవరో నెట్లో పోస్ట్ చేశారు. దాన్ని స్కూల్ టీచర్లు చూశారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అభం శుభం తెలియని పిల్లని ముద్దుపెట్టుకుంటాడా అని స్కూలు యాజమాన్యం స్కూలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ బాలుడిపై కేసు నమోదు చేశారు. పదిహేనేళ్ల లోపు బాలికల్ని ముద్దు పెట్టుకోవడం టర్కీలో నేరం కనుక ఆ స్కూలు ఉన్న అంతల్య ప్రావిన్సులోని కోర్టు.. ఆ వీడియోను తెప్పించి.. నేరం జరిగినట్లు రూఢీ చేసుకుని ఆ పిల్లవాడికి నాలుగున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో పాటు.. ఆ వీడియో తీసిన బాలుడినీ, దానిని షేర్ చేసిన బాలుడినీ, ఇంకా ఆ క్రైమ్‌లో భాగస్వామ్యం కలిగిన 13–16 ఏళ్ల మధ్య బాలురు ఐదురురిపైన కూడా స్కూలు పోలీసులు కేసు వేశారు కానీ.. వారందరినీ కోర్టు నిర్దోషులుగా వదిలిపెట్టింది. ముద్దు పెట్టుకున్న బాలుడి తరఫున వాదిస్తున్న జుహాల్ మెర్వ్ ఆజ్ఫిదాన్ అనే మహిళా న్యాయవాది ఇప్పుడు పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. టర్కీలో ఇటీవలే స్కూల్ పోలీస్ వ్యవస్థ ప్రారంభం అయింది. పాఠశాలల్లో పిల్లల మధ్య జరుగుతున్న లైంగిక చొరవలు, చొరబాట్లను అదుపు చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ► స్టార్టప్ కంపెనీల్లో మూడింట ఒక వంతుకు పైగా మహిళా ఉద్యోగులే ఉంటున్నారని యు.ఎస్. రైడ్–షేర్ కంపెనీ ‘లిఫ్ట్’ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అమెరికా స్టార్టప్ కంపెనీల్లో 40 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉండగా, ఇండియా స్టార్టప్ కంపెనీలలో సగటున 25 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని లిఫ్ట్ తెలిపింది. లిఫ్ట్ నివేదిక ప్రకారం ఇండియాలో మొత్తం 5000 నుంచి 5200 వరకు స్టార్టప్స్ ఉండగా.. వాటి వ్యవస్థాపకులుగా 2015లో 9 శాతం మంది, 2016లో 10 శాతం మంది, 2017లో 11 శాతం మంది చొప్పున మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇండియాలో అనతికాలంలోనే ఆదరణ పొందిన ఐదు స్టార్టప్ కంపెనీల్లో మహిళల శాతం ఈ విధంగా ఉంది. జొమాటో (ఫుడ్ డెలివరీ కంపెనీ) విలువ 200 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 2,500 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 48 శాతం పేటీఎం (ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్) విలువ : 1000 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 13,000 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 35 శాతం. ఓలా (టాక్సీ, ఫుడ్ డెలివరీ) విలువ : 400 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 5,000 మందికి పైగా మహిళా ఉద్యోగులు 18 శాతం ఇన్మోబీ (మొబైల్ మార్కెటింగ్) విలువ : 100 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 1,500 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 29 శాతం రజోర్‌పే (ఆన్లైన్ పేమెంట్స్) విలువ : 10 కోట్ల డాలర్లు ఉద్యోగులు : 200 మందికి పైగా మహిళా ఉద్యోగులు : 25 శాతం -
ఫుడ్ స్టార్టప్ లకు గడ్డుకాలం..!
♦ గతేడాది 235.66 మిలియన్ డాలర్ల సమీకరణ ♦ సమీకరణఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చింది 51.46 మిలియన్ డాలర్లే ♦ సమీకరణసేవలు కుదించుకుని... ఉద్యోగులనూ తొలగిస్తున్న కంపెనీలు ♦ సమీకరణఫుడ్ పాండా ఇండియా సేవల అమ్మకం... కొనేవారు కరువు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెస్టారెంట్లను వెదికి పట్టి... రేటింగ్‌తో సహా చూపించే జొమాటో యాప్... జనవరి 11 నుంచి కోయంబత్తూరు, ఇండోర్, కోచి, లక్నో నగరాల్లో తన సేవలను నిలిపేసింది. 300 మంది ఉద్యోగుల్ని కూడా తొలగించింది. విదేశీ ఫుడ్ డెలివరీ దిగ్గజం ఫుడ్‌పాండా... గతేడాది డిసెంబర్లో 300 మంది ఉద్యోగుల్ని తీసేసింది. తన ఇండియా ఆపరేషన్స్‌ను అమ్మకానికి పెట్టినా... ఒక్కరూ కొనటానికి ముందుకు రాలేదని సమాచారం. ఇక దేశీ ఫుడ్ డెలివరీ యాప్ టైనీ ఔల్ పరిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. గతేడాది సెప్టెంబర్‌లో ముంబై, పుణే కార్యాలయాల్లో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పేసింది. యూకేకు చెందిన జస్ట్ఈట్ దేశీయ మార్కెట్లోకి ఎంత వేగంగా వచ్చిందో.. చడీచప్పుడు కాకుండా వెళ్లిపోయింది. అంతేకాదు!! దేశీ ఫుడ్ స్టార్టప్స్ గతేడాది 54 ఒప్పందాల ద్వారా 235.66 మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తే... ఈ ఏడాది ఇప్పటిదాకా కేవలం 3 ఒప్పందాలు మాత్రమే కుదిరాయి. వాటిద్వారా సమకూరింది కేవలం 51.46 మిలియన్ డాలర్లు. ఈ గణాంకాలు చాలవూ.. దేశంలో ఫుడ్ స్టార్టప్స్‌కు ఎంతటి ఎదురుగాలి వీస్తోందో చెప్పటానికి.. ‘తినడానికి తిండి.. కట్టుకునేందుకు దుస్తులు.. ఉండేందుకు ఇల్లు’ మనిషి కనీస అవసరాలివే. ఇందులో దుస్తులు, ఇల్లు విషయం కాసేపు పక్కన పెడితే... ఒక్కరోజు తిండి లేకున్నా భూమ్మీద నూకలు చెల్లిపోయినట్టే. అందుకే ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్న స్టార్టప్స్... తిండి విషయంలోనూ అంతే కీలకంగా మారాయి. దేశంలో ఈ-కామర్స్ తర్వాతి స్థానం ఫుడ్ స్టార్టప్స్దే అనేంత స్థాయికి ఎదిగిపోయాయి. కాకపోతే ఏడాదికాలంగా పరిస్థితి తిరగబడింది. అవే ఫుడ్ స్టార్టప్స్ తిరోగమన బాటలో పయనిస్తున్నాయిపుడు. ‘‘ప్రస్తుతం దేశంలో ఫుడ్ స్టార్టప్ పరిస్థితిల కోడి ముందా.. గుడ్డు ముందా అన్నట్లుంది. తమ వెబ్సైట్లో రెస్టారెంట్ల జాబితా ఎక్కువగా లేకపోతే కస్టమర్లు ఆయా స్టార్టప్‌ల వెబ్‌సైట్‌ను గానీ, యాప్‌ను గానీ చూడరు. అదే సమయంలో భారీ వినియోగదారులు లేకుంటే సదరు రెస్టారెంట్లు కూడా స్టార్టప్‌లను దగ్గరకు రానివ్వటం లేదు. ఇదే స్టార్టప్స్ ఫెయిల్యూర్‌కే ప్రధాన కారణం’ అని ఓ ఫండింగ్ సంస్థ నిపుణుడు విశ్లేషించారు. తిండి మీద అంచనాలెక్కువ... ఫుడ్‌ను విక్రయం అంటే ఆన్లైన్లో ఫోన్లు, దుస్తులు అమ్మినంత సులువేమీ కాదు. ఆన్లైన్లో ఏది కొన్నా డెలివరీకి 2-3 రోజుల సమయం తీసుకుంటారు. ఫుడ్ విషయానికొస్తే... ఆర్డర్ చేసిన గంటలోపే కస్టమర్‌కు చేరిపోవాలి. దీనికితోడు ఆహా రం వేడిగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండాలి. లేకపోతే తిరస్కరిస్తారు. ‘‘ఫుడ్ మీద కస్టమర్లు చాలా అంచనాలు పెట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ తప్పవు’’ అని లీడ్ ఏంజిల్స్ నెట్వర్క్ దక్షిణభారత వైస్ ప్రెసిడెం ట్ వినుత రాళ్లపల్లి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. మొబైల్స్, యాప్స్ మార్కెట్టే కీలకం.. దేశంలో ఫుడ్ సేవల మార్కెట్ విలువ 48 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా దాదాపు 18-20 బిలియన్ డాలర్లు. దీన్లో 15 బిలియన్ డాలర్ల వ్యాపారం కేవలం ఫోన్ల ద్వారానే జరుగుతున్నట్లు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ వీసీసీ ఎడ్జ్ ఒక నివేదికలో తెలియజేసింది. దేశంలో రోజుకు ఫోన్ ద్వారా 10 లక్షల ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొంది. ‘‘25 ప్రధాన నగరాల్లోని 75 వేల రెస్టారెంట్లలో (లంచ్, డిన్నర్) ఫోన్ ద్వారా 10 లక్షలకు పైనే ఆర్డర్లు వస్తున్నాయి. డామినోస్కు ఫోన్, నెట్, యాప్ ద్వారా రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల వరకు ఆర్డర్లు వస్తున్నాయి. యాప్స్‌నే తీసుకుంటే స్విగ్గీ 15 వేలు, జొమాటో 13వేలు.. ఇలా అన్ని స్టార్టప్స్ రోజుకు మొత్తం 50 వేల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తున్నాయి’’ అని వీసీసీ తెలియజేసింది. 20కి మించి స్టార్టప్స్ లేవు.. ప్రస్తుతం దేశంలో జొమాటో, టైనీ ఔల్, ఈట్లో, స్విగ్గీ, ఫుడ్ పాండా, హలోకర్రీ వంటి 20కి మించి ఫుడ్ స్టార్టప్స్, యాప్స్ లేవు. అవి కూడా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణే వంటి దేశంలోని ప్రధానమైన 25 నగరాలకే పరిమితమయ్యాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా విస్తరణ కావట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఫుడ్ స్టార ్టప్స్ సమీకరించిన విలువ కేవలం అర బిలియన్ డాలర్లు. అదే చైనాలోని ఫుడ్ స్టార్టప్స్ విషయానికొస్తే ఇవి 3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. ఈ ఏడాది దేశంలో జనవరి నెలలో దేశీయ స్టార్టప్స్‌లో 3 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ సుమారు 300 కోట్లుంటే.. ఇందులో స్విగ్గీ కంపెనీయే రూ.230 కోట్ల నిధులను సమీకరించింది. ఇటీవలే స్విగ్గీలో నార్వెస్ట్ వెంచర్స్ పార్టనర్స్, సైఫ్ పార్టనర్స్, ఇతరులు కలసి ఈ పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు జొమాటో 225 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించగా... ఇందులో టెమసెక్, సెకోయా క్యాపిటల్, ఇన్నోఎడ్జ్ పెట్టుబడుల వాటా 220 మిలియన్ డాలర్లు. 2014లో ప్రారంభమైన టైనీ ఔల్లో సెకోయా క్యాపిటల్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లు రారు.. దేశీయ ఫుడ్ స్టార్టప్స్ నిధుల సమీకరణ మీద పెట్టినంత దృష్టి... స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు, వారి జీవన స్థితిగతులపై పెట్టడం లేదు. డిస్కౌంట్లు, రాయితీల ద్వారా కస్టమర్లను ఆకర్షించుదామనుకునే కంపెనీలకు నిధుల సమీకరణ, విస్తరణ కష్టంగా మారింది. కొన్ని సంస్థలు ఇప్పుడు నో-డిస్కౌంట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులు, వారి భావోద్వేగాలు, స్థానిక స్థితిగతుల్ని అర్థం చేసుకొని మెనూ రూపొందించాలన్నది నిపుణుల మాట. దేశంలో ఫుడ్ స్టార్టప్స్ వ్యాపారం తీరిదీ... రెస్టారెంట్ లిస్టింగ్: తమ వెబ్సైట్, యాప్‌ల ద్వారా స్థానిక రెస్టారెంట్లు, మెను, ధరలు, ఆఫర్ల వివరాలను అందిస్తాయి. ఇలా రెస్టారెంట్లకు కస్టమర్లను పెంచుతాయి. స్టార్టప్స్: జొమాటో ఫుడ్ ఆర్డరింగ్: వెబ్సైట్, యాప్‌ల్లో ఫుడ్‌ను ఆర్డరిస్తే.. వాటిని స్థానిక రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి పార్శిళ్ల రూపంలో డెలివరీ చేస్తాయి. ఇలా రెస్టారెంట్ల అమ్మకాలు పెరుగుతాయి. స్టార్టప్స్: స్విగ్గీ, ఫుడ్‌పాండా, టైనీ ఔల్... క్లౌడ్ కిచెన్: షెఫ్‌లను నియమించుకుని ఆహారాన్ని తయారుచేసి నేరుగా కస్టమర్లకు అందిస్తాయి. స్టార్టప్స్: హోలాషెఫ్, ఫ్రెష్ మెను, భుక్కడ్, డైట్ ఆన్ క్లిక్...