Journalist Nagarjuna Reddy
-
చట్టపరిధిలో పనిచేస్తున్నట్లు లేదు!
ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టిన ప్రెస్ కౌన్సిల్ విచారణ కమిటీ - జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై దాడి కేసులో తదుపరి విచారణకు - ప్రకాశం జిల్లా ఎస్పీ స్వయంగా హాజరుకావాలని చైర్మన్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ చట్టపరిధిలో కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ కమిటీ అభిప్రాయపడింది. పత్రికాస్వేచ్ఛ, నైతిక నియమావళి ఉల్లంఘన కేసులపై రెండురోజులుగా ఈ కమిటీ హైదరాబాద్‌లో విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా చీరాలలో జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై దాడి కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ హాజరుకావాలని ఆదేశించినా ఎస్పీ త్రివిక్రమవర్మ బుధవారం విచారణకు హాజరుకాక పోవడంతో కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ తరఫున హాజరైన చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు.. ఎస్పీ ఇతర పనులపై ఐజీ కార్యాలయానికి వెళ్లారని చెప్పడం కౌన్సిల్ చైర్మన్‌కు మరింత ఆగ్రహం తెప్పిం చింది. తదుపరి న్యూఢిల్లీలో జరగనున్న విచారణకు ఎస్పీ స్వయంగా హాజరుకావాలని, అవసరమైతే అరెస్ట్ వారంట్ జారీచేస్తామని కౌన్సిల్ చైర్మన్ సీకే ప్రసాద్ హెచ్చరించారు. నాగార్జునరెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు దాడిచేసిన కేసులో.. కేసు నమోదు, దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై కమిటీ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కేసు నమోదు విషయమై ప్రభుత్వ న్యాయవాది నుంచి కాకుండా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ న్యాయవాది సలహా తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క చీరాలలోనే ఇలా జరగడం లేదని, ఆంధ్రప్రదేశ్ అంతటా ఇదే విధానం అమలవుతోందని డీఎస్పీ చెప్పిన సమాధానం పట్ల చైర్మన్ విస్మయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు బాధిత జర్నలిస్ట్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. జర్నలిస్టులను నిషేధిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్లా? హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధించిన యాజమాన్యం.. తమది ప్రజాస్వామ్య సంస్థగా పేర్కొనడం విడ్డూరంగా ఉందని విచారణ కమిటీ అభిప్రాయ పడింది. రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం విధించడం, వర్సిటీలోకి వచ్చిన ఫ్రంట్‌లైన్ జర్నలిస్ట్‌పై కేసులు బనాయించడంపై బుధవారం కమిటీ విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తో తదుపరి విచారణకు హాజరుకావాలని యూనివర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్ సంజయ్‌కు సూచించింది. దీనిపై సమగ్ర నివేదికను అందించాలని సైబరాబాద్ కమిషనర్‌ను ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఆదేశించారు. ఔట్లుక్ మేగజైన్ ఎడిటర్‌కు సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తున్నందున, ఆ కేసుపై విచారణను వాయిదా వేసింది. -
ఆమంచిపై ఆగ్రహ జ్వాలలు
జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడికి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలు ఒంగోలు : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడి చేయడాన్ని జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కుటుంబం పట్టపగలే ఏకంగా చీరాల పోలీస్‌స్టేషన్ ఎదుటే జర్నలిస్టుపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నివర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. దాడి ఘటనపై పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఖండనలు వెలువడ్డాయి. అసభ్య ఆరోపణలు చేశారనుకుంటే ప్రజాస్వామ్యపద్ధతిలో ఎదుర్కొనే అవకాశం ఉందని, న్యాయస్థానానికి వెళ్లవచ్చని, వాటిని పక్కనపెట్టి ఏకంగా భౌతికదాడులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి ఘటనను ఖండిస్తూ ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆందోళన నిర్వహించింది. యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి బ్రహ్మం నేతృత్వంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం డీఆర్ఓ ప్రభాకరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుపై దాడిచేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జాప్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. దాడులను ఖండించారు. కనిగిరిలో ప్రింట్ మీడియా జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో అన్ని పత్రికల జర్నలిస్టులు ఆందోళనలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం ద్వారా నిరసనలు తెలిపారు. ఆ తర్వాత తహసీల్దార్, సీఐలకు వినతిపత్రం సమర్పించారు. పీసీ పల్లిలోనూ స్థానిక జర్నలిస్టులు దాడి ఘటనను ఖండిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పొదిలి తాలూకా ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్థానిక ఆర్అండ్బీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. చీరాలలో సీపీఐ నేతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుపై దాడి ఘటనను ఖండించారు. జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై దాడి చేసిన ఆమంచి స్వాములు, మిగిలిన వర్గాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమంచి స్వాములును అరెస్టు చేయాలి ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చీరాల రూరల్ : నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు), అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్‌ధర్మా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ బాబు డిమాండ్ చేశారు. నాగార్జున రెడ్డిపై దాడిజరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగంలో ప్రతిఒక్కరికీ వాక్స్వాతంత్య్రం ఉందన్నారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే ఎమ్మెల్యే.. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలేగానీ ఇష్టానుసారం వ్యవహరించరాదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే..సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. దాడిని అపలేకపోయిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమంచి శ్రీనివాసరావు, అతని అనుచరులను అరెస్టు చేయని పక్షంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. -
చీరాలలో టెన్షన్.. టెన్షన్
► ఆమంచి అనుచరుల హల్చల్ ► ‘సాక్షి’ వద్దకు వచ్చి గోడువెళ్లబోసుకున్న ప్రజాసంఘాల నాయకులు ► తన డబ్బులు, సెల్‌ఫోన్ తీసుకెళ్లాడని ఆమంచి స్వాములుపై ఫిర్యాదు ► నిందితులను అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ ► నాగార్జునరెడ్డిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అనుచరుల ర్యాలీ చీరాల : చీరాలలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వందలాది మంది జనం రోడ్డుపైకి వచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు సోమవారం భారీగా మొహరించి హల్చల్ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు, అతని అనుచరుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నాగార్జునరెడ్డి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై జరిగిన దాడిని మీడియాకు వివరించడంతో పాటు తన డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఆమంచి స్వాములు తీసుకెళ్లాడని, అతనిపై చోరీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుపై దాడిచేసిన ఆమంచి స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు అరాచకాలను ప్రజాసంఘాల నాయకులు ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు తమ అవినీతి అక్రమాలపై బాస అనే మాస పత్రికలో కథనం రాసిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డిపై చీరాల గడియార స్తంభం సెంటర్లో దాడిచేసిన విషయం విధితమే. ఈ ఘటనతో నాగార్జునరెడ్డికి వైఎస్సార్ సీపీ, ప్రజాసంఘాలు, టీడీపీకి చెందిన పాలేటి రామారావు, పోతుల సునీతలు అండగా నిలిచారు. దాడిచేసిన ఆమంచి స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఆమంచి అనుచరులు కూడా ఉదయం నుంచి డ్రైనేజీ అతిథి గృహంలో పెద్దసంఖ్యలో చేరారు. సాక్షి ఓబీ వ్యాన్ వద్ద ప్రజాసంఘ నాయకులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఈ దాడిని ఖండిస్తూ మాట్లాడుతుండగా ఆమంచి అనుచరులు కూడా ముందుకు వచ్చి తాము కూడా మాట్లాడతామని గొడవకు దిగారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగే పరిస్థితి ఉందని భావించిన పోలీసులు.. వారిని పక్కకు పంపించారు. అనంతరం ఆమంచి అనుచరులు చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎమ్మెల్యే ఆమంచి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు దళి తులను కించపరిచేలా కథనాలు రాసిన నాయుడు నాగార్జునరెడ్డిని అరెస్ట్ చేయాలని కోరారు. పట్టణంలో ర్యాలీ చేసి సీఐని కలిసి వినతిపత్రం అందించారు. అయి తే ఉదయం కొద్దిసేపు సాక్షి ప్రసారాలు నిలిచిపోయా యి. అనంతరం తిరిగి ప్రసారమయ్యాయి. స్వాములను అరెస్టు చేయండి : వైఎస్సార్ సీపీ వినతి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డిపై దాడిచేసిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు స్వాములు, అతని అనుచరులను అరెస్టు చేయాలని సోమవారం రాత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, బాపట్ల పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ వి.అమృతపాణి, పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కర్నేటి వెంకటప్రసాద్, పార్టీ నాయకులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. నాగార్జునరెడ్డిపై దాడి జరిగి 24 గంటలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. దోషులSను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అయి తే 24గంటల్లో దోషులను అరెస్ట్ చేయని పక్షంలో చీరాల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్, ధర్నాకు అవకాశం కల్పించాలని సీఐని కోరారు. నన్ను చంపడానికి నాలుగుసార్లు ప్రయత్నించారు : బాధిత జర్నలిస్ట్ నాయుడు నాగార్జునరెడ్డి చీరాల ఎమ్మెల్యే, ఆయన బంధువులు గత పదేళ్లుగా చేసిన అవినీతి అక్రమాలు, దౌర్జనాలపై కథనాలు రాయడంతో పాటు మీడియాకు సమాచారం ఇస్తున్నానని నాపై కోపం పెంచుకున్నాను. నన్ను చంపేందుకు నాలుగుసార్లు ప్రయత్నించారు. ఆమంచి అక్రమాలపై 14 పేజీల వ్యాసం రాసినందుకు నన్ను చంపేందుకు కుట్ర చేశారు. చీరాలలో పట్టపగలే నాపై దాడి జరిగితే పోలీసులు చూస్తూ ఉన్నారేగానీ, చర్యలు తీసుకోలేదు. నా మరణం వరకు ఆమంచి అక్రమాలపై పోరాడతా. అరాచకాలను ప్రశ్నించినందుకు నాపై అక్రమ కేసులు పెట్టించారు. ఆమంచి సోదరుడు స్వాములు దాడిచేసిన సమయంలో నా వద్ద రూ.25 వేల నగదు, శ్యాంసంగ్ ట్యాబ్, పవర్ బ్యాంక్, కొన్ని ఏటీఎం కార్డులు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అతనిపై చోరీ కేసు నమోదు చేయాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. ఆమంచి స్వాములును అరెస్టు చేయాలి ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చీరాల రూరల్ : నాగార్జునరెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు శ్రీనివాసరావు (స్వాములు), అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్‌ధర్మా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ బాబు డిమాండ్ చేశారు. నాగార్జున రెడ్డిపై దాడిజరిగి 24 గంటలు గడిచినా పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులకు తెగపడటం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగంలో ప్రతిఒక్కరికీ వాక్స్వాతంత్య్రం ఉందన్నారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే ఎమ్మెల్యే.. రాజ్యాంగానికి లోబడి పాలన చేయాలేగానీ ఇష్టానుసారం వ్యవహరించరాదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించే జర్నలిస్టులకే రక్షణ లేకపోతే..సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందన్నారు. దాడిని అపలేకపోయిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆమంచి శ్రీనివాసరావు, అతని అనుచరులను అరెస్టు చేయని పక్షంలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.