JSV PRASAD
-
నవంబర్‌కల్లా గాలిగోపురం నిర్మాణం
– శ్రీకాళహస్తిలో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న గాలిగోపురం నిర్మాణాలు నవంబర్‌కల్లా పూర్తయ్యేలా చూడాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జేఎస్వీ ప్రసాద్ సూచించారు. గురువారం రాత్రి ఆయన శ్రీకాళహస్తి దేవస్థానంతోపాటు గాలిగోపుర నిర్మాణాలను పరిశీలించారు. ఆయనతోపాటు జిల్లా స్పెషల్ కలెక్టర్ హివూంసుశుక్లా,ఆలయ చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు,సభ్యులు కాసరం రమేష్,పీఎం చంద్ర,ఆలయ ఈవో భ్రవురాంబ, ఈఈ వెంకటనారాయణ ఉన్నారు. గాలిగోపురం పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. నిర్మాణపనులు వేగవంతం చేయాలని సూచించారు. గాలిగోపురానికి ప్రహరీగోడ ఏర్పాటు చేయాలని, అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేస్తే యాత్రికులకు ఆకర్షణగా ఉంటుందని తెలిపారు. తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానంలో పలు గోపురాలను పరిశీలించారు. వాటి మరవ్ముతుల విషయాలపై చర్చించారు. దేవస్థానంలో నూతన కట్టడాలు చేయరాదని సూచించారు. మరవ్ముతుల్లోను కళాసంపదకు భంగం వాటిల్లికుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 2017 ఫిబ్రవరిలో నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. తర్వాత స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు సత్కరించి,స్వామి,అవ్మువార్ల జ్ఞాపికను,తీర్థప్రసాదాలను అందజేశారు. -
అన్నవరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా రోహిత్
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబీకునిగా ఐవీ రోహిత్‌ను గుర్తిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహారిస్తున్న ఐవీ రామ్‌కుమార్ గతేడాది మరణించడంతో ఆయన కుమారుడిని తదుపరి ఆలయ వ్యవస్థాపక దర్శకర్త సభ్యునిగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ఇంటికి ఐదుగురికి ‘దివ్య దర్శనం’
ఉచిత తిరుమల యాత్ర విధి విధానాలను ప్రకటించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ కొత్తగా ప్రవేశపెట్టదలిచిన దివ్యదర్శనం పథకం విధివిధానాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో ఇంటి నుంచి గరిష్టంగా ఐదుగురి అవకాశం కల్పిస్తారు. మూడేళ్ల లోపు పిల్లలను అదనంగా తీసుకెళ్లవచ్చు. హిందుమతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారినే ఈ పథకంలో 90 శాతం లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు. అగ్ర కులాల్లో తెల్ల కార్డులున్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. 70 ఏళ్ల లోపు వయసు ఉన్న వారినే ఈ పథకం వరిస్తుంది. ప్రతి జిల్లా నుంచి విడతల వారీగా ఏడాదికి పది వేల మందికి ఉచిత తిరుమల దర్శనం కల్పిస్తారు. ఉచిత యాత్ర సమయంలో లబ్ధిదారులకు ప్రమాద బీమా కల్పించడానికి దేవాదాయ కమిషనర్ చర్యలు చేపడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వర్షాల కోసం యజ్ఞయాగాదులు చేయండి
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ యజ్ఞయాగాదులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో సహా అన్ని ప్రముఖ దేవాలయాల ఆధ్వర్యంలో వరుణ దేవుడికి పూజలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ మంగళవారం దేవాదాయ శాఖ కమీషనర్, టీడీపీ ఈవోలను ఆదేశించారు. భవిష్యత్‌లోనూ ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమాజ హితం కోరుతూ అవసరం ఉన్నప్పుడల్లా ఇలాంటి యజ్ఞయాగాదులు చేపట్టాలని కూడా సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయదారులకు ఉపయోగపడే వర్షాలు కురవక మూడో వంతు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసింది. వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలలు పూర్తయ్యాయి. -
'పురాతన ఆలయాలు కూలిస్తే చర్యలే'
హైదరాబాద్: పునఃనిర్మాణం పేరుతో రాష్ట్రంలో పురాతన ఆలయాల కూల్చివేతలపై ప్రభుత్వం నిషేధం విధించింది. పురాతన ఆలయ సంపదను కాపాడుకునే ఉద్దేశంతో రాష్ట్ర దేవాదాయ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వందేళ్ల కిత్రం నిర్మించిన ఆలయాలను ప్రభుత్వం, ఏపీ ధార్మిక పరిషత్ అనుమతి లేకుండా కూల్చవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ ఆలయ శిధిలావస్థకు చేరిన పరిస్థితులు ఉంటే దాని స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయని విధంగా ఆలయాన్ని కాపాడేందు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రాతికట్టడాలతో ఉన్న ఆలయ గోడలకు రంగులు వాడడంపై నిషేధం విధించారు. ఆలయ అభివృద్ధికి దాతలు చేసిన దానాల వివరాలను గోడలపై రాయడం కాకుండా అందుకు సంబంధించిన వివరాలను ఆలయ రికార్డుల్లో మాత్రమే ఉంచాలని సూచించారు. దాతలు ఇచ్చిన ఫ్యాన్లు, వాటర్ కూలర్లు వంటి వాటిపై సైతం వారి పేర్ల నమోదు చేయకుండా అందుకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో భద్రపరచాలన్నారు. -
సంప్రదాయాన్ని విస్మరించం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో కోదండరాముని కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. కోదండ రామాలయం చుట్టు పక్కల ఇళ్లను తొలగించేందుకు సహకరించిన వాటి యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. ఒంటిమిట్ట చెరువుకు నీరు చేరితే అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోదండరాముని బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈనెల 28వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోదండరాముని దర్శనానికి రానున్నట్లు ఆయన తెలిపారు. సీతారాముల కల్యాణోత్సవానికి ఏప్రిల్ 2వ తేదీన గవర్నర్ చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, అధికారిక లాంఛనాలతో స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. ఆలయంలో నూతన నిర్మాణాలకు తావు లేదన్నారు. ఆలయ శిల్ప సంపదను చెన్నైలోని ప్రత్యేక చిత్రకారుల సహకారంతో పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామకుటీరం, కృంగిశైల పర్వతం, ఇళ్లు కూలదోస్తున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారు నిరుత్సాహపడవద్దని, వారికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ కేవీ రమణ, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ, ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా జేఎస్వీ ప్రసాద్
సాక్షి, తిరుమల: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర దేవాదాయ (రెవె న్యూ) శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 7.15 బంగారు వాకిలిలో స్వామివారి ముందు టీటీడీ ఈవో సాంబశివరావు ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.