వర్షాల కోసం యజ్ఞయాగాదులు చేయండి | JSV prasad to make pujas for Rains | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం యజ్ఞయాగాదులు చేయండి

Published Tue, Aug 18 2015 7:24 PM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

JSV prasad to make pujas for Rains

హైదరాబాద్ సిటీ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ యజ్ఞయాగాదులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో సహా అన్ని ప్రముఖ దేవాలయాల ఆధ్వర్యంలో వరుణ దేవుడికి పూజలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ మంగళవారం దేవాదాయ శాఖ కమీషనర్, టీడీపీ ఈవోలను ఆదేశించారు. భవిష్యత్‌లోనూ ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

సమాజ హితం కోరుతూ అవసరం ఉన్నప్పుడల్లా ఇలాంటి యజ్ఞయాగాదులు చేపట్టాలని కూడా సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయదారులకు ఉపయోగపడే వర్షాలు కురవక మూడో వంతు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసింది. వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలలు పూర్తయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement