jumbo
-
పిచ్చి అంటారండి దీన్ని!.. కాస్త ఉంటే..
మనుషులకు-వన్యప్రాణులకు మధ్య జరిగే సంఘర్షణ గురించి తెలియంది కాదు. నగరీకరణ, అడవుల్లో కార్పొరేట్ వ్యవహారాలు పెరిగి పోయే కొద్దీ.. అలాంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. జనావాసాల వైపుగా వచ్చిన ఏనుగుల మందను తరిమే క్రమంలో ఓ కుర్రాడు.. కర్రతో ఏనుగును కొట్టాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ గజరాజు ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సురేందర్ మెహతా.. ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. జస్ట్ మ్యాడ్నెస్(కేవలం పిచ్చి) అనే క్యాప్షన్ ఉంచారాయన. Just madness…🐘#Wildlife #conflict @susantananda3 pic.twitter.com/Il8jx4AqgZ — Surender Mehra IFS (@surenmehra) December 4, 2022 ఇదీ చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం -
పేద్ద.. గుమ్మడి: బరువు 1161 కిలోలు.. రికార్డులు బద్దలు!
వాషింగ్టన్: గుమ్మడికాయ అంటే గరిష్ఠంగా 10-20 కిలోల వరకు ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ, వెయ్యి కిలోల గుమ్మడిని ఎప్పుడైనా చూశారా? అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హాఫ్ మూన్ బే సిటీలో జరిగిన పోటీల్లో ఏకంగా 2,560 పౌండ్లు(1161 కిలోలు) బరువైన గుమ్మడికాయను ప్రదర్శించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు ట్రావిస్ జింజర్ అనే ఉద్యానవన ఉపాధ్యాయుడు. హాఫ్ మూన్ బే సిటీలో మంగళవారం 49వ ప్రపంచ స్థాయి బరువైన గుమ్మడికాయల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి భారీ గుమ్మడికాయను మిన్నెసోటా నుంచి తీసుకొచ్చేందుకు ఏకంగా 35 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని తెలిపారు ట్రావిస్ జింజర్. ఆ రెండు రోజుల ప్రయాణంలో గుమ్మడికాయను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు. దానిని ప్లాస్టిక్, తడి బ్లాంకెట్లతో చుట్టి ఉంచామన్నారు. ‘మిన్నెసోటాలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. గుమ్మడి సాగుకు ప్రతికూలమనే చెప్పాలి. రోజుకు 75 గ్యాలన్ల నీటిని అందించాలి. భారీ గుమ్మడికాయను తీసుకొచ్చి పోటీలో గెలుపొందటం చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపారు. 2020లోనూ జింజర్ పోటీలో గెలుపొందారు. గతవారం నమోదైన 2,554 పౌండ్ల బరువు గుమ్మడికాయ రికార్డును తాజాగా ఆయన బద్ధలు కొట్టారు. Travis Gienger, a horticulture teacher from Minnesota, set a new U.S. record Monday for the heaviest pumpkin after raising one weighing 2,560 pounds. https://t.co/T8vuqaCD2N pic.twitter.com/AbUj3cYwol — CBS News (@CBSNews) October 11, 2022 ఇదీ చదవండి: నీ పిచ్చి తగలెయ్య.. అది బెడ్రూం కాదురా అయ్యా!.. నడి రోడ్డు.. -
మళ్లీ ‘సేవలు’ బాగుపడ్డాయి..
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో మళ్లీ వృద్ధి బాట పట్టింది. ఉపాధి కల్పన ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్– పీఎంఐ ఈ విషయాన్ని తెలిపింది. మార్చిలో సేవల సూచీ 50.3గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 47.8 వద్ద ఉంది. పీఎంఐ ప్రమాణాల ప్రకారం– సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటే దానిని వృద్ధి దశగానే భావించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సేవలు–తయారీ వృద్ధి బాటకు.. కాగా సేవలు, తయారీ రంగాలు రెండూ కలిపిన నికాయ్ ఇండియా కాంపోజిట్ ఇండెక్స్ కూడా మార్చిలో మంచి మెరుగైన ఫలితాన్నే ఇచ్చింది. పీఎంఐ ఉత్పత్తి ఇండెక్స్ మార్చిలో 50.8గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 49.7 పాయింట్ల వద్ద ఉంది. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం, ఈ విభాగం క్రియాశీలత మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నికాయ్ మార్కెట్ తయారీ పీఎంఐ మార్చిలో 51 గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ పాయింట్లు 52.1 శాతం. అయితే తయారీ ఇండెక్స్ వరుసగా గడచిన ఎనిమిది నెలల్లో 50 పాయింట్ల ఎగువనే ఉంది. -
గిన్నిస్ పుటల్లో ఎక్కనున్న గజరాజు!
కేరళ గజరాజుకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన ఏనుగుగా 86 ఏళ్ళ వృద్ధ ఏనుగు గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. వృద్ధాప్యంలోనూ హుషారుగా గడిపేస్తున్న ఏనుగు గురించి యజమానులు.. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) గిన్నిస్ అధికారులకు వివరాలతో లేఖ రాశారు. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా దాక్షాయణి గురించి లేఖలో వివరించారు. ప్రాణాలతో జీవిస్తున్న ఏనుగుల్లో దాక్షాయణి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు అని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు పరీయర్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళ అటవీశాఖ రికార్డులు కూడా అదే విషయాన్ని స్సష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన దాక్షాయణిని ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ బోర్డు ప్రత్యేకంగా సత్కరించింది. దేవస్వం మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఫారెస్ట్ మినిస్టర్ కె. రాజు పంచదేరం టైటిల్ తో ఏనుగును సత్కరించారు. ట్రావెన్ కోర్ రాజులు దాక్షాయణిని టీడీబీ కి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు ఛంగలూర్ మహాదేవ ఆలయంలో ఉంటోంది. కేరళ పోస్టల్ సర్వీస్ కూడా దాక్షాయణి పేరిట ఓ ప్రత్యేక పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉంది. తైవాన్ కు చెందిన ఏనుగు.. 85 ఏళ్ళ వయసులో 2003 లో చనిపోగా... దాక్షాయణి 86 ఏళ్ళు జీవించిఉన్న ఏనుగుగా ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుని, గిన్నిస్ పుటలకు ఎక్కనుంది.