Jumping leaders
-
జంపింగ్ నేతలపై..కేటీఆర్ షాకింగ్ ట్వీట్
-
ఎన్నికల సీజన్.. నేతల కప్ప గెంతులు
సాక్షి,హైదరాబాద్ : ఎన్నికల సీజన్ వచ్చిందంటే కప్పగెంతులు సహజమే. ఉన్న పార్టీల్లో సీట్లు రానివారు, సీటు రాదని అనుకున్నవారు పార్టీలు మారిపోతుంటారు. ఎందుకు మారుతున్నారంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెబుతారు. అప్పటిదాకా సమర్థించిన పార్టీ అధినేతపై దారుణమైన విమర్శలు చేస్తారు. ఈసారి తెలంగాణలో కప్పగెతుల నాయకుల లీలలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య ఈ కుండ మార్పిళ్ళు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్లు తేదీ వచ్చేసినా పార్టీల మారే నాయకులు ఏమాత్రం తగ్గడంలేదు. రాష్ట్రంలో కీలకంగా మారిన జంపింగ్ జపాంగ్‌లు ఎవరో చూద్దాం. రాజకీయాల్లో సర్కస్ ఫీట్లు మామూలే. ఎన్నికల సీజన్లో ఏ నేత ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టమే. హఠాత్తుగా అడిగితే కొందరు నాయకులు కూడా తమ పార్టీ పేరు గభాల్న చెప్పలేరనే సెటైర్లు కూడా పేలుతుంటాయి. ఎన్నికల్లో సీట్లు రావని ఖరారు చేసుకున్న నేతలు ఏ పార్టీలోకి వెళితే టిక్కెట్ వస్తుందో...దేనిలో చేరితో కచ్చితంగా గెలుస్తామో అంచనా వేసుకుంటారు. దానికి అనుగుణంగా కొత్త పార్టీలో చేరుతుంటారు. పార్టీ ఎందుకు మారారంటే ఫలానా పార్టీని ఎదిరించాలంటే ఈ పార్టీలోనే ఉండాలని...లేదంటే తనకు ఆత్మగౌరవం దెబ్బతినిందని అందుకే పార్టీకి రాజీనామా చేశానని చెబుతుంటారు. ఎన్నికలయ్యాక ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే అభివృద్ది జపం చేయాలి. నా నియోజకవర్గం అభివృద్ది చేసుకోవడానికే అధికార పార్టీలోకి వెళుతున్నానని ఓ ప్రకటన చేసేస్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువై పొలిటికల్ స్క్రీన్ గందరగోళంగా కనిపిస్తోంది. చిన్నా చితకా నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని మంత్రి పదవులు నిర్వహించినవారు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసి ఎంతో అనుభవం సాధించినవారు ఉన్నఫళంగా పార్టీ మారితే అటు పొలిటికల్ సర్కిల్స్‌లోనూ...ఇటు ప్రజల్లోనూ తప్పకుండా చర్చ జరుగుతుంది. ఈ విడతలో ముందుగా గులాబీ పార్టీ నుంచే వలసలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గులాబీ పార్టీని వీడారు. తర్వాత మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాలలో జడ్పీ ఛైర్మన్ గా ఉన్న సరిత గులాబీ గూటినుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ సీటు ఇవ్వలేదన్న కోపంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కారు దిగి గాంధీభవన్‌కు చేరుకున్నారు. అలాగే పాలమూరు జిల్లాలో సీనియర్ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి టిక్కెట్ల విషయంలో పార్టీ అధినాయకత్వం మీద అలిగి కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. టిక్కెట్ల విషయంలో తమ పంతం నెరవేర్చుకున్నారు. ఎన్నికల హడావుడి ప్రారంభం కాగానే మొదలైన నాయకుల వలసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత స్పీడందుకున్నాయి. ముందుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ రెండు జాబితాల్లో ప్రకటించిన వంద మంది అభ్యర్థుల్లో 22 మంది అప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చినవారే ఉండటం ఇతర పార్టీలకు ఆశ్చర్యం కలిగించగా...పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నవారికి ఆగ్రహం తెప్పించాయి. అందుకే వలస పక్షుల్ని అందలం ఎక్కించినపుడు ఇంకా మేమెందుకు అంటూ కాంగ్రెస్ నుంచి నాగం జనార్థనరెడ్డి వంటి సీనియర్లు గులాబీ గూటికి చేరారు. అలాగే ఒకప్పుడు సీఎం కేసీఆర్‌ను ప్రాజెక్టుల రీ డిజైన్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సీటు రానందుకు నిరసనగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసేసి కేసీఆర్ సమక్షంలోనే గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ టిక్కెట్ ఆశించిన దివంగత నేత పి. జనార్థనరెడ్డి తనయుడు విష్ణువర్థన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి టిక్కెట్లు లభిస్తుండగా...బీఆర్ఎస్లో చేరినవారికి ఎమ్మెల్సీలో...ఇతర పదవులో హామీ ఇస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ మంచి ఊపుమీదున్న సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విభేదించి...మునుగోడు ఎమ్మెల్యీ సీటుకు కూడా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపు పెరగడం..బీజేపీ హవా తగ్గడం వంటి పరిణామాలతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉదయం తన నియోజకవర్గం అయిన మునుగోడు టిక్కెట్ తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య తిరుగుతున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తన కుమారుడితో సహా బీజేపీకి రాజీనామా చేసి తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కాంగ్రెస్‌లో చేరిపోయారు. రాజకీయ జీవితంలో చరమాంకంలో ఉన్న నాయకులు కూడా పలువురు ఇప్పుడు అటు కాంగ్రెస్‌లోను..ఇటు బీఆర్ఎస్లోనూ చేరిపోతున్నారు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే ఎక్కువ మార్పిడీలు జరిగాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు...బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు నాయకులు ఎక్కువగా జంపింగ్‌లు చేశారు. బీజేపీలో ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు చేసి నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో చేరినవారు ఒకరిద్దరే కనిపిస్తున్నారు. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి సీనియర్లు కమలదళం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలో నామినేషన్లు ప్రారంభం కానుండటంతో పార్టీలు మారేవారు తొందరపడుతున్నారు. నామినేషన్లు పూర్తయ్యేనాటికి ఇంకెన్ని వింతలు చూడాల్సి ఉంటుందో అనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఈ జంపింగ్ రాయుళ్ళను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీళ్లంతా పార్టీలు మారేది ప్రజలకు సేవ చేయడానికా..తమకు తాము సేవ చేసుకోవడానికా అని చర్చించుకుంటున్నారు. -
తెలంగాణలో కాషాయ కథలు.. అలా జరిగితే బీజేపీ పెద్ద తప్పు చేసినట్లేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన విషయం చెప్పారు. తన కుమార్తెను పార్టీనే మారాలని బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చిందని ఆయన తెలిపారు. దేశంలో బీజేపీ వికృత రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కచ్చితంగా అలా జరిగితే బీజేపీ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. సహజంగానే బీజేపీ ఈ ఆరోపణను తోసిపుచ్చుతుంది. కాని కేసీఆర్ ఈ సంగతి తెలియచేసినప్పుడు ఏ సందర్భంలో బీజేపీ అంత సాహసం చేసింది? దానికి రాయబారం చేసింది ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారన్న అభియోగంపై ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా, కవిత వద్దకు ఆ ప్రతిపాదన చేసినవారిని ఆధారసహితంగా పట్టుకుని ఉంటే బీజేపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడి ఉండేది. సంతలో సరకు కాదు కదా.! అసలు ఈ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోళ్లు, ఆయా రాజకీయ పార్టీల వైఖరులు, న్యాయవ్యవస్థలో డీల్ చేస్తున్న వైనం అన్నింటినీ పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయి. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు జరుగుతున్న తీరు చూస్తే పలు ప్రశ్నలు తొలుస్తాయి. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం పెద్ద నేరం అయితే, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేయడం అనండి.. అమ్మేయడం అనండి.. పూర్తిగా జరిగిపోతే మాత్రం అది పెద్ద కేసుగా మారకపోవడంపై మనబోటివాళ్లకు బోలెడు డౌట్లు రావచ్చు. వాటిని ఎవరూ తీర్చే పరిస్థితి మన దేశ ప్రజాస్వామ్యంలో లేదేమో! ఆయా రాష్ట్రాలలో, కేంద్రంలో జరుగుతున్న ఫిరాయింపుల పర్వాలను గమనించినప్పుడు ఈ అభిప్రాయం కలుగుతుంది. ఇక తెలంగాణలో తాజా విషయానికొస్తే.. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీతో సంబంధాలు ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారన్నది అభియోగం. దానిపై వారిని ఆడియో, వీడియో ఆధారాలతో అరెస్టు చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరినవారు. వారు మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో విలీనం అయ్యారు. అసలు ఈ విలీనాలు ఎంతవరకు హేతుబద్దం అంటే సమాధానం దొరకదు. ఈ ప్రశ్నకు శాసనవ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఇప్పటికీ జవాబు ఇవ్వలేదు. రాజకీయ వ్యవస్థలో అధికారంలో ఉన్నవారు తమ ఇష్టానుసారం చేసుకుపోతున్నారు. నిజానికి ఒక పార్టీ శాసనసభా పక్షం విలీనం అన్నది ఫిరాయింపుల చట్టాన్ని వక్రీకరించడమే అనిపిస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే క్రమంలో శాసనసభా పక్షంతో పాటు, పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు అన్నీ తీర్మానాలు చేసి ఎన్నికల సంఘం ఆమోదం కూడా పొందాయి. అంత కష్టం ఎందుకని రాజకీయ నేతలు భావించినట్లు ఉన్నారు. వెనక తతంగం, ముందు స్వాగతం తమకు అవసరమైన ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిపేసుకుని పార్టీ ముద్ర వేస్తే సరిపోతుందన్న ఐడియాను కనిపెట్టారు. దీనికి ఏ ముఖ్యమైన పార్టీ అతీతం కాదని చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించి వారితో రాజీనామా చేయించి తమకు పూర్తి మెజార్టీ వచ్చేలా చేసుకుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఇదే పద్దతి అవలంభించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీని ముందుగా మరో పార్టీలోకి విలీనం చేయించి, తదుపరి ఆ పార్టీని బీజేపీలో కలుపుకున్నారు. రాజస్తాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలను ఇదే పద్దతిలో కాంగ్రెస్ కలుపుకుంది. ఏపీ, తెలంగాణలలో గత టరమ్‌లో ఆ పాటి కష్టం కూడా పడలేదు. తెలంగాణలో ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్, బిఎస్పీ, సిపిఐ వంటి పక్షాల ఎమ్మెల్యేలను తడవతడవులుగా టీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ ఆఫీస్‌లోనే కండువా కప్పేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా, పెద్దగా ఫలితం రాలేదు. స్పీకర్ వ్యవస్థ ఈ ఫిరాయింపులకు పూర్తిగా సహకరించినట్టయింది. 23కు సరిగ్గా 23 జవాబు ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 మధ్య కాలంలో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు అప్పట్లో తన పార్టీలో చేర్చుకున్నారు. పైకి డబ్బుల వ్యవహారం కనిపించకపోయినా.. ఏం జరిగిందో సామాన్యడు కూడా చెప్పగలడు కాబట్టే.. 2019 ఎన్నికల్లో ఆయనకు 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారని చెబుతారు. నాడు వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పినప్పుడు వీరిలో ఒక ఎమ్మెల్యే అయితే బహిరంగంగానే తాను ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయానని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే తనకు ఉన్న కోట్ల అప్పులన్నీ ఫిరాయింపుతో వచ్చిన డబ్బుతో తీర్చేసినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలలో ఇలా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు కూడా అయ్యారు. వీరు నేరం చేసినట్లా? కాదా? వీరిపై కోర్టులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎందుకు చర్య తీసుకోలేదు? వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు. అంతెందుకు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏజెంట్‌గా వెళ్లిన రేవంత్ రెడ్డి నగదు కట్టలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా.. ఇంత వరకు కేసు తెమలలేదు. పైగా మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఫోన్లో మాట్లాడినట్టు కేసు ఎదుర్కొంటోన్న చంద్రబాబు.. ఆ మాటలు నావి కావు అని చెప్పకుండా.. ఓటుకు లంచం ఇవ్వడం నేరం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. న్యాయపరమైన అంశాలేంటీ? ఒక ఈశాన్య రాష్ట్రంలో మాత్రం ఇలాంటి ఫిరాయింపునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇతర రాష్ట్రాలలో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు చేయలేదు? స్పీకర్లు ఎందుకు ఈ ఫిరాయింపులకు ఆమోద ముద్ర వేశారు? ఇది న్యాయ సమ్మతమేనా? ఇలాంటి సందేహాలు ఉన్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని కొనుగోలు చేయబోయారన్న అభియోగంపై ముగ్గురిని అరెస్టు చేయించి ఒక సంకేతాన్ని ఇచ్చారు. తద్వారా ఇలాంటి లావాదేవీలలో ఎవరు పాల్గొన్నా అరెస్టులు తప్పవన్న హెచ్చరిక చేసినట్లయింది. అయితే అదే సమయంలో కేవలం ఫోన్ లావాదేవీలు, మంతనాల ఆధారంగానే కేసులు అవుతాయా అన్న చర్చ ఉంది. దానిపై న్యాయ వ్యవస్థ కూడా భిన్నరూపాలలో నిర్ణయాలు చేసింది. ఏసీబీ కోర్టు అరెస్టు చెల్లదని చెబితే హైకోర్టు చెల్లుతుందని పేర్కొంది. బీజేపీ దీనిపై సీబీఐ విచారణ కోరితే హైకోర్టు అంగీకరించలేదు. ఈ కేసుతో బీజేపీ పిటిషన్ వేయడాన్ని ప్రశ్నించింది. నేరుగా సంబంధిత పార్టీ కాదు కదా అని అభిప్రాయపడింది. ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందా? కానీ ఇదే సమయంలో కొన్ని కేసులలో ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే సీబిఐ విచారణ చేయించడం, కొంతమంది ప్రముఖులను నెలల తరబడి జైలులో ఉంచడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పిల్స్ విషయంలో న్యాయ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ఒక పద్దతి అనుసరించడం లేదని న్యాయ కోవిదులే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విషయం వెల్లడించారు. తన కుమార్తెనే బీజేపీ వారు పార్టీ మారమన్నారని ఆరోపించారని కథనం. దీనికి సంబంధించి ఏదైనా ఆధారం బయటపెట్టి ఉంటే దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి ఉండేది. భవిష్యత్తులో ఏమైనా కొత్త సమాచారం ఇస్తారేమో చూడాలి. ఈ తరహా రాజకీయాలపై తెలంగాణ నుంచే పోరాటం ఆరంభిస్తామని ఆయన అన్నారు. ఇది మంచి విషయమే. కానీ ముందుగా తాను కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఈ పోరాటం చేస్తే ఇంకా గొప్పపేరు వస్తుంది. ఇప్పటికైనా ఆయన ఒక విధాన నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన అంశమే. పార్టీ మారతారా అని అడిగితే చెప్పుతో కొడతామని చెప్పండని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ మారొచ్చా? ఎలా మారాలి? ఇక్కడే ఒక అంశం ప్రస్తావనకు వస్తుంది. రాజ్యాంగంలో పార్టీలు మారే స్వేచ్చ ఉంటుంది. కాకపోతే దానికి కొన్ని పద్దతులు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ మారవచ్చు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ మాట చెప్పి ఉండవచ్చు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారన్న కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తోంది. దీనిపై హైకోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే సిట్ దర్యాప్తు వివరాలను లీక్ చేయవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు కాని కేసీఆర్ తన రాజకీయ అవసరాలకోసం ఈ కేసును ఉపయోగించుకోవడం కాకుండా, ఫిరాయింపుల నిరోధానికి ఉపయోగిస్తే దేశంలోనే కేసీఆర్‌కు ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. మరి కేసీఆర్ అలా చేస్తారా? పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గోడ దూకేద్దాం..!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి భారీ దెబ్బతగిలింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీనీ వీడేందుకు కొంతమంది నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ రాష్ట్రంలో మనుగడ కొనసాగించడం కష్టమవుతుండటంతో తామే ముందు జాగ్రత్త పడితే మంచిదని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇప్పుడే పార్టీ మారి కొత్తపార్టీలో ఈ ఐదేళ్లు పనిచేస్తే తగిన గుర్తింపు వస్తుందని తమ అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి, విజయవాడ: జిల్లా టీడీపీ గడ్డు పరిస్థితిని అనుభవిస్తోంది. ఒక పక్క పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు.. మరో పక్క పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు పార్టీ కేడర్‌ను గందరగోళంలో పడేస్తున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారే.. విజయవాడ నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక నాయకుడు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతానికి ఈయన విదేశాల్లో ఉన్నారు. స్వదేశం వచ్చిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ తనకు తగిన గుర్తింపు రాలేదని, అందువల్లే మరొక uమొదటిపేజీ తరువాయి పార్టీలోకి వెళ్లిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తగ్గట్లుగానే ఇటీవల ‘ట్వీటారు’ కూడా. కాగా మరో యువనేత కూడా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తనకు అత్యంత సన్నిహితులతో ఈ విషయం పై చర్చించారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తనకు నగరంలో కాకుండా మరో నియోజకవర్గంలో చంద్రబాబు సీటు కేటాయించి అన్యాయం చేశారనే ఆగ్రహంతో ఉన్నట్లు వినికిడి. టీడీపీలో పడ్డ కష్టం మరొక పార్టీలో పడితే తనకు తప్పకుండా మంచి గుర్తింపు ఉంటుందని భావిస్తున్నారు. నగరంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక నియోజకవర్గం పై ఈ ఇద్దరు నేతలు కన్నేసినట్లు తెలిసింది. ఈ ఇద్దరు నేతలు నగరంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాగా వీరిద్దరి బాటలోనే జిల్లాలోని నూజీవీడుతో పాటు మరొక నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాలం వేస్తున్న సుజనా చౌదరి ఇటీవల టీడీపీనీ బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి కృష్ణాజిల్లాలోని టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారు. తన సొంత జిల్లా కావడంతో కొంతమందిని బీజేపీలోకి చేర్చడం ద్వారా బీజేపీ నాయకులకు తన సత్తా చూపించాలని భావిస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో ఆయన వ్యక్తిగతంగా టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉంటే బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా తమ సామాజికవర్గం వారిని బీజేపీలోకి తీసుకుని తద్వారా బీజేపీని బలోపేతం చేయాలని సుజనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుజ్జగిస్తున్న ఓ మాజీ మంత్రి.. కాగా గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన జిల్లాకు చెందిన ఒక మంత్రి టీడీపీకి గండిపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ వీడవద్దని తెలుగు తమ్ముళ్లకు సర్ది చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీలో గుర్తింపు ఇస్తామని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ ఎదగదని, ఆ పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసుకోవద్దంటూ హితవు పలుకుతున్నట్లు తెలుస్తోంది. -
తెలుగుదేశం పార్టీలో ముసలం..
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు 14 మంది కాకినాడలో సమావేశం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో జిల్లా నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో వీరు భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశంలో కొనసాగాలా, లేక పార్టీ మారాలా అన్న విషయంపై చర్చ జరిపినట్లు సమాచారం. అందరూ ఒకే నిర్ణయంపై ఏ పార్టీలోనైనా చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం వీరు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై కూడా చర్చ జరిగింది. అయితే వారు మాత్రం తాము పార్టీ మారడం లేదని, ఎన్నికల్లో ఓటమి కారణాలపై చర్చించామని చెబుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఓటమిపై చర్చించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాజ్యసభలో టీడీఎల్పీ బీజేపీలో విలీనం అయ్యింది. ఎంపీ సుజనా చౌదరి నేతత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు గురువారం సాయంత్రం టీడీపీ లెజిస్లేటివ్ పార్టీనీ బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందజేశారు. ఈ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రాంమ్మోహన్రావు సంతకం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తెలుగుదేశం ఎంపీలతోపాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే చివరి నిముషంలో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్ మాత్రమే మిగిలారు. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు సర్వత్రా చర్చకు దారితీశాయి. -
కాంగ్రేసోల్లు బీజెపిల శెరికయినా బర్కత్ లేద?
సాక్షి, కరీంనగర్ : నేన్జెప్పలే... రాశ్టంల టియారెస్కు పోటిచ్చేట్ది మేవేనని... నామ్నేశన్ ఎయ్యడాన్కి వోతన్న పువ్వు పార్టి జులూస్ను బంగ్ల వీద గూసొని సూస్కుంట కండ్లెగిరేసిండు... మాదోస్త్ లచ్చన్న. వాజ్పాయ్ జమాన కెల్లి లచ్చన్నకు బార్తీయ జంత పార్టంటెæ మస్త్ ఇశ్టం. సద్వుకునెటప్పడు అద్వాని రతంయాత్ర, అయోద్యె లొల్లికి సుత లచ్చన్న వోయిండు. మొన్నటి అసంబ్లి ఎలశ్చన్ల బీజెపి ఇర్వై సీట్లన్న గెలుత్తదని ఆశె వడి నీర్గారిండు. ఎందుకొ శాన్రోజులకు ఇయ్యల్ల జెల్ది రమ్మని ఫోన్జేత్తె పోయిన. లచ్చన్నను ఏడిపిద్దావని... ‘గిప్పటికిప్పుడు గట్లెందుకనిపిస్తందే నీకు. మీ పార్టోల్లు గిట్ట ఏవన్న యాగాలు స్టాట్ జేసిన్రా... నవ్వుకుంట అడిగిన. రోజు పేపర్లల్ల, టీవ్లల్ల సూస్తలేవ ఏవైతందో... పిస్సోన్లెక్క అడ్గుతన్నవ్ ’ కొంచెవంత కోపంగనె అన్నడు లచ్చన్న ‘మీ అమిత్‌శా, మోడి తెలంగానల ఆపీసేవన్న పెడ్తన్రా. తెలంగనకేవన్న ఇస్పెషల్ పాకేజ్ అసొంటిది గిట్ట ఇత్తన్రా... ’ కొంచెం ఎగతాల్గనె అడిగిన. సాల్ తీ.. నీ ఎచ్చిర్కపు మాటలు... రోజు ఎవ్వలెవ్వలు బీజేపిల శెరీకయితన్రో సూత్తలెవ్వ. రాశ్టంల కాంగిరెస్ పనైపాయె. వాల్లు సుత ఫూచర్ల బీజేపిల్నయితెనె గెల్తమని ఆల్శంగ తెల్సుకున్రు. కాంగిరెస్ను ఇడ్షి ఐద్రబాదు వొయ్యి బార్తీయ జన్త పార్టి ఆపీస్‌కు లైన్ గడ్తన్రు. గా ముచ్చెట నేన్జెప్తంటె నువ్వేదేందొ అనవడ్తివి... మొకం మాడ్సుకుంట అన్నడు లచ్చన్న. వో గదా... టియారెస్కు పోటిచ్చెడ్ది మేవె అంటె... కొత్తగ ఇంకేవన్న మత్లబ్ ఉందేవో అన్కున్న లచ్చన్నా.... ఎలశ్చన్లన్నంక టికిట్లు రానోల్లు పార్టిలు మార్సుడు ... గెల్శినంక డెవులప్మెంటు పేర్మీద మల్ల మారుడు అయ్దేండ్ల సంది సూత్తనే వున్నం గాదె... సమ్దాయించుకుంట శెప్పిన. గద్వేరు... గిద్వేరు... గిప్పుడు రాశ్టంల కాంగిరెస్ పార్టిలున్న పెద్ద లీడర్లంత బార్తీయ జంత పార్టిల్నే శెరీకయెవట్టిరి. యెంపి శీట్లకు మస్తు డిమాండచ్చింది. తెలంగానల పదన్న గెల్వాల్నని అమిత్శ , మోడి సుత సీర్యస్ గున్నరంట. గందుకని కాంగిరేస్లున్న కత్తర్నాక్ లీడర్లను పార్టిల శేర్పిస్తున్రు... ఆయినకు ఎరుకైన సంగతులన్ని జెప్పిండు. అట్లనానె... నువ్ శెప్పింది∙నువద్దే అన్కుందాం. కాంగిరేసుల యెంపి టికిట్లు అచ్చినోల్లో, మొన్న గెల్శిన ఎమ్మెల్లెలు గిట్టనో... ఎవలన్న శేరిన్రా బార్తీయ జంతల. గాడ ఆంద్రల ఒకాయినె తెల్గుదేశెం శీటనౌన్సు జేసినంక ఏపో నువ్వద్దు, నీ శీటద్దని జగన్ పార్టిల శెరీకైండు. సిట్టింగు ఎమ్మెల్లెలు, ఎంపిలు గుడ ఆడ తెల్గుదేశెంను ఇడ్షిపెడ్తన్రు. గాడ గెల్శెడిది జగన్ పార్టె నని అందర్కి అర్దమైంది. గట్ల గీడేవన్న బార్తీయ జంత పార్టిల జరిగింద? అసంబ్లి ఎలశ్చన్ల వోడ్పోయిన కాంగిరేసోల్లె గద శేరుతన్రు. రొండు నిమ్శాలు ఆలోశన్జేసిన లచ్చన్న... నువ్వన్నది నువద్దె గని కాంగిరెసోల్లు బీజెపిల శెరికయి యెంపి శీట్లల్ల పోటి శేలె ్త పార్టి బలం, లీడర్ బలం కల్షి బంపర్ వోట్లతోటి గెల్తరు గద ... కొత్త పాయింటు జెప్పిండు లచ్చన్న గట్లనా... మైబూబ్నగర్ల పువ్వు గుర్తుకున్న ఓట్లెన్ని?ఢీకె అర్నమ్మ మొన్నట్దాక గెల్శిన ఘద్వాల సుత మైబూబ్నగర్ల లేదు. నాగర్కర్నూల్ల వుంది. గప్పుడెప్పుడొ జితెందర్‌రెడ్డి బీజెపి టికిట్ మీద గెల్శిండంటవా? గప్పుడు తెల్గుదేశెం తోటి పొత్తుండె. గప్పట్ల గా పార్టి గట్టిగుండె గెల్శిండు. గిప్పుడేడిది? తెల్గుదేశాన్ని రాశ్టంలనె బొందవెట్టిరి. బీజేపికి డిపాజిట్లె రాకపాయె. ఇంటిపార్టి లీడర్ ఎన్నెం శీనివాస్రెడ్డి బయెలశ్చన్ల బీజెపి టికిట్మీద గెల్శి, రొండువేల పడ్నాలుగుల వోడేపాయె. ఇగ అయిలాబాదుల సోయెం బాప్రావు కాంగిరేస్ టికిట్ ఇయ్యలేదనె బీజేపిల శెరీక్ అయిండు. గాడ అయిలబాద్, ముదోల్ అసంబ్లిల్నే రొండో ప్లేసచ్చింది. ఖానపూరు, నిర్మల్ల గిన్నన్ని ఓట్లచ్చిన సుత కాంగిరెసు తర్వాతె. టియారెస్సు టికిట్లు ఇయ్యని శిట్టింగులు, వివేకసొంటోల్లు , మొన్నోడిపోయినోల్ల కొడుకులు అత్తరేవో నని సూడవట్టిన్రు... గంతెగద. పూసగుచ్చినట్టు శెప్పిన్నేను. గదేందన్న... పదారు గెలుత్తం అన్న కెసియార్‌కు సపోట్గ మాట్లాడవడ్తివి నువ్వు... గీ పెద్దపెద్దోల్లు అచ్చిన సుత బార్తీయ జంత పార్టికి సీట్లు రావ? కాంగిరెస్ పనైపోయిందంటె ... ఇగ మిల్గేది బీజెపే గద? విక్రవార్కున్లెంక ఇడిసిపెట్టకుంట అడిగిండు లచ్చన్న. సూడు లచ్చన్నా... అసంబ్లి ఎలశ్చన్లయి మూన్నెల్లె దాటింది. గప్పుడున్న వోటర్లె గిప్పుడున్నరు. దబ్బన లీడర్లు పార్టిలు మారంగనె వోటర్లు సుత మార్తరనుకున్న సుత ... కాంగిరేస్లున్నప్పుడు లీడర్‌ను జూసి వోట్లేసినోల్లు గిప్పుడు బీజెపిల శెరీకైనంక గయినకె అబ్మానంతోటి ఓటేత్తరు. ఇగ బీజెపి పార్టికున్న వోట్లు గట్టనె వుంటై. మరి గట్లనె కాంగిరేసు పార్టి ఓట్లు సుత గాపార్టికె ఉంటయి గద. అంటె... కాంగిరేస్ ఓట్లు శీల్తయి తప్ప టియారెస్సుయి గాదు. గదె జర్గుతె కాంగిరేసు, బీజెపి రొండో ప్లేసు కోసం కొట్లాడుడె అయిద్ది తప్ప టీయారెస్సు వోట్లను యాడ కొడ్తరు? బారతంల క్రుశ్నుని లెక్క వుపదేశెం జేస్న. అంటె కాంగిరేసోల్లు బీజెపిల శెరికయినా బర్కత్ లేన్లెక్కనేన? గప్పట్ల నాగం జనార్దన్‌రెడ్డి, సంగారెడ్డిల జెగ్గరెడ్డి అసంటోల్లు అచ్చి మల్ల వోయిన్రు. గిప్పుడు గుడ బర్కత్ లేకపోతె ఎట్ల.. కెసియార్‌కు పదారు పండుగ తప్పద..? అన్కుంట నారాజై ఇంట్లకు వోయిండు లచ్చన్న. రోడ్‌మీద బార్తీయ జంత పార్టి జులూస్ సుత ఎల్లిపోయింది. నేను తంతెలు దిగుకుంట ఇంటి మొకం బట్టిన. – పోలంపల్లి ఆంజనేయులు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
బాబు ట్రాప్‌లో కాంగ్రెస్ సీనియర్లు!
-
పోయే వారికిపొగ!
=జంపింగ్ నేతల నియోజక వర్గాల్లో కొత్త నాయకత్వం =జాబితా సిద్ధం చేసిన డీసీసీ,విశాఖ నగర కాంగ్రెస్ =11, 12ల్లో పరిశీలకుల రాక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమనుకునే వారికి తామే పొగబెట్టి పంపే దిశగా జిల్లా, నగర కాంగ్రెస్ విభాగాలు అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే అనుమానితుల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకులను తెర మీదకు తెచ్చి కొన్ని రోజుల్లో వారికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అనకాపల్లి, భీమిలి, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల జాబితాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు సహా మరో నలుగురు ఎమ్మెలు పార్టీకి టాటా చెప్పడం ఖాయమని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నారు. న ర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాపను అనుమానిత జాబితాలో ఉంచారు. ఈ నెల 23 తర్వాత వీరంతా పార్టీని వీడితే ఆయా నియోజకవర్గాల్లో ఒక్కసారిగా నాయకుడు లేకుండా పోతారనే ఆలోచనతో ఎమ్మెల్యేలు ఉండగానే వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌ల నియామక ప్రక్రియ మొదలెట్టారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచన మేరకు డీసీసీ అధ్యక్షుడు ధర్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఈ మేరకు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ తరపున నిలిపే అభ్యర్థులను బట్టి సామాజిక, ఆర్థిక బలసమీకరణలను అంచనా వేసి తమ అభ్యర్థిని తెరమీదకు తెచ్చే పనిలో పడ్డారు. ఏఐసీసీ ఆదేశం మేరకు ఈ నెల 11, 12వ తేదీల్లో కర్ణాటక ఎమ్మెల్యే యశ్వంత్రీగౌడ్ పరిశీలకునిగా జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు సంబంధించి చోడవరం, పాడేరులో రెండు సమావేశాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు యోచిస్తున్నారు. విశాఖ సిటీ సమావేశం ఎక్కడ నిర్వహించేదీ ఇంకా ఖరారు కాలేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను సూచిస్తే పరిశీలకులు వాటిని ఢిల్లీకి తీసుకుని వెళ్లి పీసీసీ ద్వారా మరింత సమాచారం సేకరించి స్థానిక పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ ముఖ్య నాయకుడొకరు ‘సాక్షి’కి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నియోజకవర్గాల వారీగా నేతలు ఖరారు చేసిన అభ్యర్థుల జాబితా ఇలా వుంది. అనకాపల్లి : కె. జగన్, రఘుబాబు, కాపు సా మాజికవర్గం నుంచి ఎం. రమణ రావు, లేదా ఆయన సతీమణి ధనమ్మ, సన్యాసినాయుడు యలమంచిలి : గంధం నందగోపాల్, బి.వెంకటేశ్వరరావు, గవర నుంచి పోటీకి దింపాలనుకుంటే ఎన్ఆర్ఐ ఒకరి పేరు పరిశీలనలో ఉంది. మాడుగుల : ధర్మశ్రీ. ఆయన అనకాపల్లి ఎంపీకి పోటీ చేసేట్లయితే రామ్మూర్తినాయుడు, తులపట్ల భాస్కర్. చోడవరం : ధర్మశ్రీ లేదా గొర్లె సూరిబాబు, స్థానికుడైన ఒక డాక్టర్. పెందుర్తి : శరగడం చిన అప్పలనాయుడు, బిజి నాయుడు, దొర్ల రామునాయుడు, తాలపు మీన, తోట విజయలక్ష్మి భీమిలి : మాజీ శాసనసభ్యుడు కర్రి సీతారాం నర్సీపట్నం : ముత్యాలపాప. ఈమె పార్టీ మారితే ప్రత్యామ్నాయంగా తూర్పుకాపు, వెలమ, క్షత్రియ సామాజిక వర్గాల నుంచి పేర్లు పరిశీలనకు తీసుకోవాలని నిర్ణయించారు.