junior staff
-
బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు!
అంతటా డిజిటలీకరణ ధోరణి పెరుగుతున్న తరుణంలో బ్యాంకుల ఉద్యోగుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. ముఖ్యంగా ఫ్రంట్లైన్లో పనిచేసే జూనియర్ స్థాయి సిబ్బందిలో ఈ క్షీణత పెరుగుతోంది. జాబ్ మార్కెట్లో పోటీతత్వం పెరగడంతో నైపుణ్యం కలిగిన ప్రతిభకు డిమాండ్ సరఫరాను మించిపోయింది. టాప్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిస్తే గత రెండేళ్లుగా అట్రిషన్ రేట్లు (ఉద్యోగుల సంఖ్య క్షీణత) క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఈ ధోరణికి ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల దృక్పథంలో వచ్చిన మార్పు ఓ కారణమైతే.. ప్రతిభను నిలుపుకోవడంలో వైఫల్యం కూడా మరో కారణంగా నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 34.2 శాతం కోవిడ్ పరిస్థితుల అనంతరం సేల్స్ సిబ్బందితో సహా కింది స్థాయి ఉద్యోగుల లక్ష్యాల్లో వచ్చిన మార్పు అట్రిషన్ పెరగడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీషన్ పేర్కొన్నారు. ఈ ధోరణి అన్ని రంగాలకు విస్తరించిందని, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మరింత పెరిగిందని వివరించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం అట్రిషన్ రేటు 34.2 శాతం ఉండగా అత్యధికంగా జూనియర్ సిబ్బందిలో 39 శాతం ఉంది. అయాన్ కన్సల్టింగ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం అట్రిషన్ రేటు 24.7 శాతంగా ఉంది. యాక్సిస్ బ్యాంక్ 35 శాతం ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో తాము 33 నుంచి 35 శాతం క్షీణతను చూస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి అన్నారు. అయితే, సీనియర్ స్థాయి సిబ్బందిలో, కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగుల్లో అట్రిషన్ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయి అట్రిషన్ సాధారణమే ఆయన వివరించారు. యస్ బ్యాంక్ 43 శాతం ఇక యస్ బ్యాంక్ సిబ్బందిలో అట్రిషన్ దాదాపు 43 శాతం ఉంది. ఇది ఎక్కువగా సేల్స్ విభాగంలోనే ఉందని, దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అట్రిషన్ రేట్లను 25 నుంచి 30 శాతానికి తగ్గించేలా కార్యాచరణ చేపడతామని యస్ బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో అధిక అట్రిషన్ రేట్లు పెరగడానికి ముఖ్యమైన కారణాలలో ఆటోమేషన్ ఒకటి అని ప్రముఖ మానవ వనరుల సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా ప్రొఫెషనల్ సెర్చ్,సెలక్షన్ డైరెక్టర్ సంజయ్ శెట్టి చెబుతున్నారు. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకుల్లో ఖాళీలు 40 నుంచి 45 శాతం పెరిగాయని, అలాగే నియామకాలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 10 నుంచి 12 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ Myntra LayOffs 2023: మింత్రాలో ఉద్యోగుల తొలగింపు.. ఫ్లిప్‌కార్ట్ కరుణిస్తేనే.. -
సీనియర్లను ఇంటికి పంపేస్తున్న కాగ్నిజెంట్
అంతర్జాతీయ ప్రముఖ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లను ఇంటికి పంపేస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగాలపై వేటు వేయాలని చూస్తున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది. సీనియర్లపై వేటు వేయాలని చూస్తున్న ఈ కంపెనీ, ఆ స్థానాల్లో మరింత మంది జూనియర్లకు చోటు కల్పించనున్నట్టు కూడా తెలిపింది. గురువారం ప్రకటించిన కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను కాగ్నిజెంట్ చేరుకోలేకపోయింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలోనే కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్‌లో ఈ రెండో క్వార్టర్లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ఆఫర్ చేసినట్టు పేర్కొంది. సీనియర్లను కాగ్నిజెంట్ టార్గెట్ చేసిందని, ఇది కేవలం వాలంటరీ మాత్రమే కాదని, ఇది మరింత ఇన్వాలంటరీ(బలవంతం పంపించేయడం) అని కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజ్ మెహతా ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సారి లేఆఫ్‌లో ఎంతమంది సీనియర్ స్థాయి ఉద్యోగులును టార్గెట్ చేశారో ఆయన బహిర్గతం చేయలేదు. ఇది గ్లోబల్ ప్రక్రియ అని, ప్రత్యేక ప్రాంతాన్ని, ప్రత్యేక దేశాన్ని తాము టార్గెట్ చేయలేదని మాత్రం చెప్పారు. కాగ, సీనియర్లపై వేటు వేస్తున్న ఈ కంపెనీ జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటుంది. మరింత మంది జూనియర్లకు తన కంపెనీలో చోటు కల్పిస్తోంది. జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటున్న ఈ కంపెనీకి, ఈ క్వార్టర్లో హెడ్‌కౌంట్ కూడా పెరిగింది. రెండో క్వార్టర్లో 7500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది. మూడో క్వార్టర్లో జూనియర్ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్‌లో కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లాగ్లిన్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్లో ఉంటాయన్నారు. ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టడానికి తమకు మంచి మార్జిన్లు నమోదవడం గుడ్‌న్యూస్ అని మెహతా చెప్పారు. ఈ రెండో క్వార్టర్లో కాగ్నిజెంట్ రెవెన్యూలు 4.01 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది నుంచి ఇవి 9.2 శాతం పెంపు. -
హెచ్-1బీ వీసా ఎఫెక్ట్: ఇన్ఫీ కీలక నిర్ణయం
బెంగళూరు : హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అమెరికా తీసుకుంటున్న చర్యలతో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ ఎంప్లాయిస్ కి హెచ్-1బీ వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వర్క్ వీసాలో వస్తున్న కఠినతరమైన నిబంధనలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దేశీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నాయి. కానీ కొత్తగా ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఐటీ కంపెనీలకు షాకిస్తూ హెచ్-1బీ వీసాల్లో మార్పులకు ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో కంపెనీ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులకు వర్క్ వీసాలు అప్లయ్ చేయకూడదని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఇతర దేశాలకు వ్యాపారాలను తరలించే ప్రక్రియపై క్లయింట్లతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఇండియాలోనే ఎక్కువ పని ఉండేలా.. జూనియర్ ఎంప్లాయిస్ ను భారత్ కే ఎక్కువగా తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. సిస్టమ్స్ ఇంజనీర్స్, సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్స్ కు ఇన్ఫోసిస్ వీసా అభ్యర్థనలను పంపలేదని మరో ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్స్ కనీస వేతనాన్ని ప్రస్తుతమున్న దానికి రెండింతలు చేస్తూ అంతకముందే అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ వేతనాల పెంపు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే జూనియర్లకు వీసాలు అప్లయ్ చేయకపోయే విషయంపై కంపెనీ స్పందించడానికి నిరాకరించింది. జూనియర్ ఎంప్లాయిస్ కి వీసా దరఖాస్తు చేయకపోవడం కంపెనీలో మరో సమస్య నెలకొంటుందని ఇన్ఫోసిస్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.