బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
కమాన్‌చౌరస్తా :బాలల హక్కులను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భవానీచంద్ర తెలిపారు. మంకమ్మతోట ధన్గర్‌వాడీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘బాలల హక్కులు, బాధ్యతలు’ అనే అంశంపై న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి భవానీచంద్ర మాట్లాడుతూ బాలల అభ్యున్నతికి ప్రభుత్వం నిర్బంధవిద్యను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బాలలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువుపై దృష్టి పెట్టాలని, తప్పుడు మార్గాలకు ఆకర్షించొద్దని సూచించారు. డీపీవో లక్ష్మీరాజం, పాఠశాల హెడ్మాస్టర్ సంపత్‌రావు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఉప్పుల మధు, మెంబర్లు కత్తిరాజుగౌడ్, కిరణ్‌కుమార్, అధ్యాపకులు లక్ష్మణ్‌రావు, న్యాయవాది గౌరు రాజిరెడ్డి పాల్గొన్నారు.