Justice BS Chouhan
-
ఖరీదైపోయిన ‘న్యాయం’..
న్యూఢిల్లీ: భారత న్యాయ వ్యవస్థ పేదలకు అందనంత ఖరీదైన వస్తువుగా మారిందని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్(రిటైర్డ్) బీఎస్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను కూడా పెద్ద లాయర్లను నియమించుకునే స్థితిలో లేనన్నారు. ఖైదీల హక్కులపై తీహార్ జైలు శనివారం ఇక్కడ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. బెయిల్ షరతులు సంక్లిష్టం కావడంతో పేదలు జైలులోనే ఉండిపోయి శిక్షాకాలాన్ని పూర్తిచేస్తుండగా, ధనికులు ముందస్తు బెయిల్ పొందుతున్నారన్నారు. ‘మన న్యాయ వ్యవస్థ, బెయిల్ షరతులు ఎందుకింత క్లిష్టమయ్యాయన్నదే అతి పెద్ద ప్రశ్న. పేదలకు కోర్టులను ఆశ్రయించే స్తోమత లేదు’ అని అన్నారు. న్యాయ వ్యవస్థను పేదలు, ధనికులకు చేరువ చేయడంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్న పెద్ద లాయర్లను తప్పుపట్టారు. -
ఆధార్ తప్పనిసరి కాదు: సుప్రీం
-
ఆధార్ ఇక నిరాధారం
ఆధార్ కార్డు తప్పని సరి అని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి అని వివిధ ప్రభుత్వ విభాగాలు అభ్యర్థులను తిప్పి పంపుతున్నాయని తమకు అనేక లేఖలు వచ్చాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వివాహం కేవలం ఆధార్ కార్డు లేనందున రిజిస్టర్ కాలేదని, పలు సంఘటనల్లో ఆధార్ లేనందున ఆస్తుల రిజిస్ట్రేషన్ కాలేదని న్యాయమూర్తి బిఎస్ చౌహాన్ అధ్యక్షతన ఏర్పడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆధార్ తప్పనిసరి అని చెప్పే ఆదేశాలను తక్షణమే ఉపసంహరించాలని సుప్రీం కోరింది. తాము సేకరించిన బయోమెట్రిక్ వివరాలను ఏ సంస్థకూ ఇవ్వకూడదని కూడా సుప్రీం ఆధార్ సంస్థను ఆదేశించింది. ఆధార్ సంస్థ జనవరి 28, 2009 న ఏర్పాటైంది. ప్రతి పౌరుడికీ పన్నెండంకెల ఆధార్ సంఖ్య ను ఇవ్వాలని ఆధార్ సంకల్పించింది. కానీ సుప్రీం తాజా ఆదేశాలతో ఆధార్ నిరాధారం అయిపోయింది.