Justice Manjunatha Committee
-
చంద్రబాబు తీరు ఇంకా మారలేదు
సాక్షి, అమరావతి : కాపులపై కపటనాటకాలు ఆడిన చంద్రబాబుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, అయినా ఆయన తీరుమారలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజాలు ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. అందుకే కాపులు చంద్రబాబుకు బుద్ది చేప్పారని ఎద్దేవా చేశారు. కాపుల రిజర్వేషన్‌పై ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ్ కమిటీ తన సంతకం లేకుండానే నివేదిక సమర్పించినా.. దానిని అప్పటీ సీఎం చంద్రబాబు ఆమోదించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కాపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నమ్ముతున్నారని, ఆయన కాపులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. -
మంజునాథ మాత్రమే జాప్యం చేశారు
సాక్షి, అమరావతి : కాపు రిజర్వేషన్ల తీర్మానం నేపథ్యంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వటంలో జస్టిస్ మంజునాథ జాప్యం చేస్తున్నారని మంత్రి చెప్పారు. నలుగురు సభ్యుల్లో ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు నివేదిక ఇచ్చారని.. దీంతో మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని మంత్రి తెలిపారు. 50 శాతం రిజర్వేషన్లు దాటితే 9వ షెడ్యూల్లో చేర్చాలి. అందుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపాం అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావనే తాము అనుకుంటున్నామని.. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కాగా, కాపు కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మంజునాథ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్ సభ్యులుగా శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రరావు, సుబ్రమణ్యం ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను ఈ ముగ్గురు సభ్యులు సమర్థించారు. చైర్మన్‌గా ఉన్న జస్టిస్ మంజునాథ మాత్రం తన సిఫారసులు ఇవ్వలేదు. కమిషన్ సమష్టిగా ఏకాభిప్రాయంతో నివేదిక ఇస్తే బాగుంటుందని సీఎం చెబితే మంజునాథ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్లు.. బాబు వ్యూహం! -
సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
కాకినాడ : రాష్ట్రంలో జస్టిస్ మంజునాథ్ కమిషన్ పర్యటన వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కాపుల రుణ దరఖాస్తులకు కాలపరిమితి లేకుండా చూడాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కాపుల రుణ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించాలని సూచించారు. జన్మభూమి కమిటీలతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేయాలని చంద్రబాబును ముద్రగడ కోరారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు.