UCC CODE: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)ని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది.
తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఒకట్రెండు రోజుల్లో సీఎం పుష్కర్‌సింగ్ ధామికి నివేదిక సమరి్పంచనుంది. దీపావళి అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై యూసీసీ బిల్లును ఆమోదించనుంది. తద్వారా దానికి చట్టబద్ధత కలి్పంచనుంది.
ఎన్నికల వాగ్దానం: ఉత్తరాఖండ్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ అమలు ప్రధానమైనది. ఆ మేరకు జస్టిస్ దేశాయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి కేబినెట్ భేటీలోనే సీఎం ధామీ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారీ కోసం రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మందితో కమిటీ చర్చలు జరిపింది. యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు.
ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి?
► కులం, మతం, ఆడ–మగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధానోద్దేశం.
► ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి.
► వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాలు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి.
► రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు.
► 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు!
► గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది.
రాజ్యాంగం ఏమంటోంది?
‘‘దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి’’ అని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు. కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించజాలవు.
సుప్రీంకోర్టు కూడా...
అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్ర లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ‘‘ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు. అభిలషణీయమూ కాదు’’ అంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదిక సమరి్పంచింది!
పారీ్టల్లో భిన్నాభిప్రాయాలు...
యూసీసీ అమలుపై రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ దీన్ని గట్టిగా సమరి్థంచడమే గాక అధికారంలోకి వస్తే దేశమంతటా యూసీసీని కచి్చతంగా అమలు చేస్తా మని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో హా మీ కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్, మజ్లిస్ తదితర పక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి...
► ప్రధాని మోదీ తొలినుంచీ యూసీసీ అమలును గట్టిగా సమరి్థస్తూ వస్తున్నారు. రెండు రకాల చట్టాలతో దేశం ఎలా నడుస్తుందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశ్నించారు.
► ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ తదితరులు కూడా పలు సందర్భాల్లో యూసీసీని సమరి్థంచారు. ‘‘దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్నదే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కూడా. దాని అమలుకు ఇదే సమయం’’ అని ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు.
► యూసీసీ పేరుతో ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పెను సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ దుయ్యబడు
తోంది.
► రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘‘బహుళత్వం, వైవిధ్యమే మన దేశ సంపద. యూసీసీ పేరుతో వాటికి తూట్లు పొడిచేందుకు మోదీ ప్రయ
తి్నస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.
► యూసీసీ వస్తే తమ సాంప్రదాయిక ఆచారాలకు అడ్డుకట్ట పడుతుందేమోనని దేశవ్యాప్తంగా 30 పై చిలుకు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే సందేహం వెలిబుచ్చాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్