Justice shamim Akhtar
-
కొత్త కొలువులకు లైన్‌క్లియర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది. ఉత్తర్వుల రూపకల్పనపై కసరత్తు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వుల రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు రెండ్రోజులుగా ఈ అంశంపైనే అధికారులు దృష్టి సారించారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు వేగవంతం చేశారు. జస్టిస్ షమీప్ అక్తర్ కమిషన్.. 2011 జనగణన ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ కేటగిరీలోని 59 కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సూచించింది.గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చాలని సూచించింది. నాలుగు సిఫారసులు చేయగా.. ఇందులో మూడింటికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, ఒక సిఫారసును మాత్రం తిరస్కరించింది. ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిని అనుసరించేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసి, భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో.. అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపుల వారీ రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్ల నంబర్లను కూడా కమిషన్ సిఫారసు చేసింది. -
ఎస్సీ వర్గీకరణపై సిఫారసులు రెడీ
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఆ ప్రక్రియ పూర్తి చేసింది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపసంఘం కో చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసేందుకు అవసరమైన సిఫారసులతో కూడిన నివేదికను జస్టిస్ షమీమ్ అక్తర్ కేబినెట్ సబ్ కమిటీకి సమరి్పంచారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసులు చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 2011 జనగణన ఆధారంగా.. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. 2011 జనగణన ఆధారంగా పరిశీలన చేపట్టాని, అరవై రోజుల్లోగా అధ్యయనం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బూర్గుల రామకృష్ణారావు భవన్ మొదటి అంతస్తు బి బ్లాక్‌లో కార్యాలయాన్ని కేటాయించింది. కమిషన్‌కు సహకరించేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు ఉమాదేవి, శ్రీధర్‌లను ప్రభుత్వ నియమించింది. నవంబర్ 11న కమిషన్ బాధ్యతలు స్వీకరించింది. అనంతరం క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలన, కులసంఘాలు, ప్రజా సంఘాలతో సమావేశాలు, వినతులు, విజ్ఞాపనల స్వీకరణ తదితరాలు కొనసాగించింది. దీంతో పాటు ఆన్లైన్ పద్ధతిలో వినతులు, సలహాలు, సూచనలు, అభ్యంతరాలను కూడా స్వీకరించింది. అన్ని కోణాల్లో పరిశీలన, సమాచార సేకరణతో పాటు ఆన్లైన్లో వచి్చన వినతులు, ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి నివేదిక తయారు చేసింది. -
భూదాన్ బోర్డు ఏర్పాటు ఎప్పుడు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: భూదాన్ బోర్డును రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వర కు తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించిం ది. ఎప్పటిలోపు బోర్డును ఏర్పాటు చేస్తా రో స్పష్టం చేయాలని, ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ భూదాన్ బోర్డును పునరుద్ధరించకపోవడాన్ని సవా లు చేస్తూ సర్వసేవసంఘ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రేయాస్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మా సనం, భూదాన్ బోర్డును ఎందుకు ఏర్పా టు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.