అప్పుల వసూలుకు వస్తాదులొద్దు
కొచ్చి: రుణగ్రహీతల నుంచి అప్పులు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కండలుతిరిగిన వస్తాదులను నియమించడం అనైతికం, అన్యాయమని కేరళ హైకోర్టు పేర్కొంది. వస్తాదులను పంపి రుణగ్రహీతలను వేధించి, భయపెట్టి అప్పులు రాబడుతున్నారని, దీనికి డిటెక్టివ్ ఏజన్సీలనూ వాడుతున్నారని జడ్జి జస్టిస్ సురేశ్ అన్నారు. ఇది చట్టప్రకారం నేరమన్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ ఒక బ్యాంకుపై వేసిన పిటిషన్ను జడ్జి విచారించారు.