juvenile girl
-
అన్వి... అన్నీ విశేషాలే!
ఏడాదిలోపు పిల్లలు పాకుతూ, పడుతూ లేస్తూ నడవడానికి ప్రయత్నిస్తూ పసి నవ్వులు నవ్వుతారు. వచ్చీరాని మాటలను పలుకుతూ ముద్దు లొలికిస్తుంటారు. ‘‘దాదాపు ఈ వయసువారంతా ఇలానే ఉంటారనుకుంటే మీరు పొరపడినట్లే. ప్రతిభకు వయసుతో సంబంధంలేదు. మాలాంటి చిచ్చర పిడుగులు బరిలో దిగితే అచ్చెరువు చెందాల్సిందే’’ అంటోంది అన్వి విశేష్ అగర్వాల్. రెండున్నరేళ్ల వయసున్న అన్వి తన పెయింటింగ్స్‌తో ఏకంగా గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. రెండేళ్లకే ఈ రికార్డు సాధిస్తే ఇక పెద్దయ్యాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తోందో అని అవాక్కయ్యేలా చేస్తోంది చిన్నారి అన్వి. భువనేశ్వర్‌కు చెందిన అన్వి విశేష్ అగర్వాల్ 72 చిత్రాలను గీసి అతి చిన్నవయసులో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఎక్కువ సంఖ్యలో పెయింటింగ్స్ వేసిన అతిపిన్న వయస్కురాలుగా నిలిచి లండన్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. రెండున్నరేళ్ల పాప ఇన్ని రికార్డులు సాధించిందంటే చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షరాలా నిజం. అన్వి పెయింటింగ్ జర్నీ కేవలం తొమ్మిది నెలల వయసులోనే జరగడం విశేషం. అప్పటినుంచి పెయింటింగ్స్ వేస్తూనే ఉంది. ‘‘మ్యాగ్నెంట్, పెండులమ్, కలర్స్ ఆన్ వీల్స్, రిఫ్లెక్షన్ ఆర్ట్, హెయిర్ కాంబ్ టెక్చర్, రీ సైక్లింగ్ ఓల్డ్ టాయిస్, హ్యూమన్ స్పైరోగ్రఫీ, దియా స్ప్రే పెయింటింగ్, బబుల్ పెయింటింగ్’’ వంటి 37 రకాల పెయింటింగ్ టెక్నిక్స్‌ను ఆపోశన పట్టింది. పెయింటింగేగాక పంతొమ్మిది నెలల వయసు నుంచే స్పానిష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. 42 అక్షర మాల శబ్దాలను స్పష్టంగా పలుకుతూ ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అత్యంత అరుదైన చిన్నారులు మాత్రమే ఇవన్నీ చేయగలుగుతారు.అన్నట్లు అన్వి అందర్నీ అబ్బురపరుస్తోంది. ‘‘కోవిడ్ సమయంలో కుటుంబం మొత్తం ఇంటికే పరిమితమయ్యాం. ఈ సమయంలో పిల్లల్ని బిజీగా ఉంచడం చాలా పెద్ద టాస్క్. ఎప్పుడూ వారికి ఏదోఒకటి నేర్పించాలనుకున్నా ఆ సమయంలో అన్నీ లభ్యమయ్యేవి కావు. ఈ క్రమంలో అన్వికి పెయింటింగ్స్ వేయడం నేర్పించాం. మేము చేప్పే ప్రతి విషయాన్నీ లటుక్కున పట్టేసుకునేది. దీంతో ఆమెకు ఆసక్తి ఉందని గ్రహించి పెయింటింగ్స్ మెలుకువలను నేర్పించగా కొద్ది నెలల్లోనే నేర్చేసుకుంది. ఆ స్పీడు చూసి ప్రోత్సహించడంతో ఈ రోజు మా పాప ఈ రికార్డుల్లో తన పేరును చేర్చింది. రెండున్నరేళ్ల అన్వి ఈ రికార్డులు సాధించి మరెంతోమంది చిన్నారులకు ఆదర్శంగా నిలవడం మాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్వి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని ఘాతుకం
సాన్ ఆంటోనియో : తాము తీసుకొచ్చిన సంబంధాన్ని కాదన్నందుకు కూతురి ముఖంపై కాగుతున్న నూనె పోసి దాడి చేసిన సంఘటనలో తల్లిదండ్రులను అరెస్టు చేసినట్టు సాన్ ఆంటోనియో పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఇరాక్‌కు చెందిన ఒక కుటుంబం రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు వలస వచ్చి సౌత్ టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారు. వారు తమ 16 సంవత్సరాల కూతురు వివాహాన్ని ఒక మధ్యవయస్కుడితో నిశ్చయించారు. అందుకు గాను అతడి వద్ద నుంచి 20 వేల అమెరికన్ డాలర్ల సొమ్ము కూడా తీసుకున్నారు. కానీ వారి కుమార్తె ఈ వివాహానికి ఒప్పుకోకపోవడంతో కోపించిన తల్లిదండ్రులు బాలికను కొట్టి, ఆమె మీద వేడి వేడి నూనె పోశారు. తల్లిదండ్రుల చర్యలతో బయపడిన బాలిక ఇంటినుంచి పారిపోయింది. ఈ సంఘటన జనవరి 30న జరిగింది. ఇంటినుంచి పారిపోయిన ఆ బాలికను గుర్తించామని, ఆమెను తన ఐదుగురు తోబుట్టువులతో పాటు పిల్లల సంరక్షణ విభాగంలో ఉంచినట్లు పోలీసు అధికారి బెక్సార్ కౌంటి షేరిఫ్ జేవీయర్ సలజార్ వెల్లడించారు. బాలిక తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
రెండేళ్ళ పాప గొంతు పిసికి ..
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల మైనర్ బాలిక రెండేళ్ల పసిపాపను దారుణంగా హత్య చేసిన ఘటన న్యూఢిల్లీలోని కళ్యాణపురిలో కలకలం రేపింది. జూన్ 10న అదృశ్యమై, శవంగా మారిన రెండేళ్ల పాప కేసును ఛేదించిన పోలీసులు వివరాలను మీడియాకు తెలిపారు. పాప అదృశ్యమైందన్న ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు దాదాపు మూడు రోజుల తర్వాత ప్లాస్టిక్ సంచిలో్ పాప శవం కనిపించడంతో షాకయ్యారు. ఈ కేసును సవాల్‌గా స్వీకరించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఓ అమ్మాయి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో ముందు తనకే పాపం తెలియదని బుకాయించినా చివరికి నేరాన్ని అంగీకరించింది. పాప తల్లితో జరిగిన చిన్న ఘర్షణ బాలికను ఉన్మాదిగా మార్చివేసింది. పాప ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో ఎత్తుకుపోయి, గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆ రోజు సాయంత్రం ఒక ప్లాస్టిక్ కవర్లో పాప శవాన్ని చుట్టి సంజయ్ లేక్ ఏరియాలో పడేసింది. నిందితురాలు మైనర్ కావడంతో జువైనల్ హోం చట్టం ప్రకారం మహిళా పోలీస్ స్టేషన్‌కు కేసును అప్పగించామని కళ్యాణ్ పురి పోలీస్ అధికారి తెలిపారు.