అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక ప్రాంతానికి చెందిన బాలరాజు ఆలియాస్ కె.బాలు (39) కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కృష్ణానగర్ ప్రాంతంలో ఉండే సావిత్రి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసిన వెంటనే అతడు ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా వ్యవహరించాడు. సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.