కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. తీవ్ర తర్జనభర్జనల తర్వాత ప్రభాకర్‌రెడ్డి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. బుధవారం ఉదయం 09:09 గంటలకు సంగారెడ్డిలో ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. దేవీప్రసాద్, కె.భూపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పరిశీలనకు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రభాకర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు.
ఉద్యమ సమయంలో ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ టిక్కెట్ దక్కించుకోవడం విశేషం. సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక జరగనుంది.