K Madan mohan rao
-
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్‌మోహన్‌రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్‌గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
27 మందితో ‘దేశం’ తొలి జాబితా
* 3 ఎంపీ స్థానాలకూ అభ్యర్థులు ఖరారు * నేడు మిగతా సీట్లకు అభ్యర్థుల ప్రకటన * సర్వేలు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాల మేరకే ఎంపిక * మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రకటన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితాను ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం విడుదల చేశారు. 27 శాసనసభ, 3 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చే సిన ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం కోసం మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పొత్తులు పెట్టుకోవడం టీడీపీకి కొత్త కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పొత్తు పెట్టుకొన్నామని చెప్పారు. పొత్తు కారణంగా పార్టీలో కొందరికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, సీట్లు కోల్పోయిన తెలుగుదేశం నాయకులకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీ, ఇతర పదవుల ద్వారా న్యాయం చేస్తానని చెప్పారు. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అభ్యర్థులను సమీక్షించవలసి ఉందని, మంగళవారం మొత్తం జాబితాను వెల్లడిస్తానని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం నాలుగు సార్లు సర్వేలు చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని, ఆ తర్వాతే అభ్యర్థులను ఖరారు చేశామని వివరించారు. కాగా, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి కె.మదన్మోహన్రావు, పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కావడం గమనార్హం. తొలి జాబితాలో ఎంపిక చేసిన అభ్యర్థులు వీరే... లోక్‌సభ నియోజకవర్గం - అభ్యర్థి పేరు ఆదిలాబాద్ - రమేష్ రాథోడ్ మహబూబాబాద్ - బానోతు మోహన్‌లాల్ జహీరాబాద్ - కె. మదన్మోహన్రావు అసెంబ్లీ నియోజకవర్గం - అభ్యర్థి పేరు 1. బాన్సువాడ - నానావత్ బద్యానాయక్ 2. బాల్కొండ - ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి 3. బోధన్ - ప్రకాష్‌రెడ్డి 4. పెద్దపల్లి - చింతకుంట విజయ రమణారావు 5. మంథని - కర్రు నాగయ్య 6. జగిత్యాల - ఎల్. రమణ 7 మానకొండూరు - డాక్టర్ సత్యనారాయణ 8. అచ్చంపేట - పి. రాములు 9. సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ 10. చాంద్రాయణగుట్ట - ఎం. ప్రకాష్ ముదిరాజ్ 11. నారాయణఖేడ్ - విజయపాల్‌రెడ్డి 12. పరకాల - చల్లా ధర్మారెడ్డి 13. నర్సంపేట - రేవూరి ప్రకాష్‌రెడ్డి 14. మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి 15. కూకట్పల్లి - మాధవరం కృష్ణారావు 16. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 17. తాండూరు - ఎం. నరేష్ 18. రాజేంద్రనగర్ - టి. ప్రకాష్‌గౌడ్ 19. భువనగిరి - ఉమా మాధవరెడ్డి 20. సూర్యాపేట - పటేల్ రమేష్‌రెడ్డి 21. దేవరకొండ - బిల్యానాయక్ 22. జహీరాబాద్ - వై.నరోత్తమ్ 23. మిర్యాలగూడ - బంటు వెంకటేశ్వర్లు 24. మహబూబాబాద్ - బాలు చౌహాన్ 25. ములుగు - ధనసరి అనసూయ (సీతక్క) 26. గజ్వేల్ - ప్రతాప్‌రెడ్డి 27. హుజూర్నగర్ - వంగాల స్వామిగౌడ్