హైదరాబాద్‌లో తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్.రమణ
* 3 ఎంపీ స్థానాలకూ అభ్యర్థులు ఖరారు
* నేడు మిగతా సీట్లకు అభ్యర్థుల ప్రకటన
* సర్వేలు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాల మేరకే ఎంపిక
* మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం అభ్యర్థుల తొలి జాబితాను ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం విడుదల చేశారు. 27 శాసనసభ, 3 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చే సిన ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం కోసం మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
పొత్తులు పెట్టుకోవడం టీడీపీకి కొత్త కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పొత్తు పెట్టుకొన్నామని చెప్పారు. పొత్తు కారణంగా పార్టీలో కొందరికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, సీట్లు కోల్పోయిన తెలుగుదేశం నాయకులకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీ, ఇతర పదవుల ద్వారా న్యాయం చేస్తానని చెప్పారు. ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అభ్యర్థులను సమీక్షించవలసి ఉందని, మంగళవారం మొత్తం జాబితాను వెల్లడిస్తానని చెప్పారు.
అభ్యర్థుల ఎంపిక కోసం నాలుగు సార్లు సర్వేలు చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని, ఆ తర్వాతే అభ్యర్థులను ఖరారు చేశామని వివరించారు. కాగా, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి కె.మదన్‌మోహన్‌రావు, పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు కావడం గమనార్హం. తొలి జాబితాలో ఎంపిక చేసిన అభ్యర్థులు వీరే...
లోక్‌సభ నియోజకవర్గం - అభ్యర్థి పేరు
ఆదిలాబాద్ - రమేష్ రాథోడ్
మహబూబాబాద్ - బానోతు మోహన్‌లాల్
జహీరాబాద్ - కె. మదన్‌మోహన్‌రావు
అసెంబ్లీ నియోజకవర్గం - అభ్యర్థి పేరు
1. బాన్సువాడ - నానావత్ బద్యానాయక్
2. బాల్కొండ - ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి
3. బోధన్ - ప్రకాష్‌రెడ్డి
4. పెద్దపల్లి - చింతకుంట విజయ రమణారావు
5. మంథని - కర్రు నాగయ్య
6. జగిత్యాల - ఎల్. రమణ
7 మానకొండూరు - డాక్టర్ సత్యనారాయణ
8. అచ్చంపేట - పి. రాములు
9. సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్
10. చాంద్రాయణగుట్ట - ఎం. ప్రకాష్ ముదిరాజ్
11. నారాయణఖేడ్ - విజయపాల్‌రెడ్డి
12. పరకాల - చల్లా ధర్మారెడ్డి
13. నర్సంపేట - రేవూరి ప్రకాష్‌రెడ్డి
14. మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి
15. కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు
16. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
17. తాండూరు - ఎం. నరేష్
18. రాజేంద్రనగర్ - టి. ప్రకాష్‌గౌడ్
19. భువనగిరి - ఉమా మాధవరెడ్డి
20. సూర్యాపేట - పటేల్ రమేష్‌రెడ్డి
21. దేవరకొండ - బిల్యానాయక్
22. జహీరాబాద్ - వై.నరోత్తమ్
23. మిర్యాలగూడ - బంటు వెంకటేశ్వర్లు
24. మహబూబాబాద్ - బాలు చౌహాన్
25. ములుగు - ధనసరి అనసూయ (సీతక్క)
26. గజ్వేల్ - ప్రతాప్‌రెడ్డి
27. హుజూర్‌నగర్ - వంగాల స్వామిగౌడ్