k Rosaiah
-
మాస్ పోలీస్
ఆయేషా హబీబ్, రవి కాలే ప్రధాన పాత్రల్లో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పోలీస్ పటాస్’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన 97వ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ ఆవిష్కరించారు. ఇటీవల రోశయ్య 87వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం ట్రైలర్‌ను రోశయ్య చేతుల మీదగా ఆవిష్కరించారు. ‘‘ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు రోశయ్య. ‘‘ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్‌ను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ సత్యనారాయణ. -
90 అడుగుల కన్యకా పరమేశ్వరి
హైదరాబాద్: పంచలోహాలతో 90 అడుగుల ఎత్తుతో రూపొందించిన కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని ఫిబ్రవరి 14న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, వెండి రథం కమిటీ చైర్మన్ రామ్పండుతో కలసి తమిళనాడు మాజీ గవర్నర్, శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ప్యాట్రన్ కె.రోశయ్య కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ..ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వాసవీ కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపనతో పెను గొండ వీధులు భక్తి పారవశ్యంతో విరాజిల్లనున్నాయన్నారు. పెనుగొండ క్షేత్రంలో గొప్ప కార్యక్రమం జరుగుతుందని, ఆలయ అభివృద్ధి, ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లు కాగా, విగ్రహ ఏర్పాటుకు రూ.17 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. -
పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే ప్రయోజనం
సాక్షి,హైదరాబాద్: పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ చేకూరుతుందని, తీసుకెళ్లి షోకేసుల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కె. రోశయ్య అన్నారు. ఏపీ మాజీ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘నవ్యాంధ్రతో నా నడక’పుస్తకంతో పాటు ‘దిస్ దట్ ఎవ్రిథింగ్’.., ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాలను ఆదివారం ఫ్యాప్సీలో రోశయ్య ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా మంది పుస్తకాలు తీసుకెళ్తుంటారే కానీ, వాటిని చదవరని, అలాంటి వాళ్లతో ప్రయోజనం ఉండదన్నారు. వృత్తిపరంగా ఐవైఆర్ కృష్ణారావు అనుభవాలు, రాజకీయనేతలతో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పర్యవసానాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇతరులను కించపరచడానికో లేక.. డైరెక్షన్ చేయడానికో ఈ పుస్తకం రాయలేదని, వృత్తిపరంగా ఎదుర్కొన్న అనుభవాలను, ఎంచుకు న్న ధోరణిలో రాశారన్నారు. భారత్‌టుడే చీఫ్ ఎడిట ర్ జి.వల్లేశ్వర్ పుస్తక సమీక్ష చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తుండటాన్ని చూస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని మాజీ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ విభజన సమయంలో ఓ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులకు ప్రతిరూపమే ఈ పుస్తకమన్నారు. రచయిత ఐవైఆర్ మాట్లాడుతూ ఏపీ విభజనకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఆగమేఘాలపై రాజధాని తరలింపు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు, జవాబుదారీతనం లేని సీఎంఓలో పని చేయడం వల్ల జరిగిన నష్టాలను ఇందులో వివరించానన్నారు. -
వైఎస్ జగన్‌కు చిరంజీవి ఫోన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శనివారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించారు. వైఎస్ జగన్‌ను ప్రముఖ హీరో, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవి ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా వైఎస్ జగన్‌ను ఫోన్లో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, వైఎస్ జగన్‌కు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు ఈరోజు మరోసారి పరీక్షలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు. సంబంధిత కథనాలు నిలకడగా వైఎస్ జగన్ ఆరోగ్యం.. విశాఖ పోలీసుల హైడ్రామా! బాబూ ఈ ప్రశ్నలకు బదులేదీ ఫ్లెక్సీపై మరోడ్రామా! ఆ లేఖ సృష్టించిందే! జగన్ హత్యకు కుట్ర.. బాబే ఏ– వన్! -
మర్రి చెన్నారెడ్డికి పలువురు నేతల నివాళి
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో శుక్రవారం ఆయన సమాధిని తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిలు మాజీ సీఎం చెన్నారెడ్డికి నివాళులర్పించి ఆయన సేవల్ని కొనియాడారు. -
స‘పోర్టు’ ఇచ్చేనా?
కొత్త ప్రభుత్వం, కొత్త ప్రతిపాదనలు పీపీపీ అంటూ కొత్త రాగం నవయుగ సంస్థతో ఇంతవరకు చర్చలే లేవు బడ్జెట్లో బందరు పోర్టుకు నిధులేవీ? ఆరు నెలల్లో పోర్టు పనుల హామీ నెరవేరేనా? జిల్లా వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బందరు పోర్టు వ్యవహారం మూడడుగులు ముందుకీ... ఆరడుగులు వెనక్కీ అన్న చందంగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోర్టు నిర్మాణ విషయంలో పాలకులు కొత్తరాగం ఆలపించడం షరా మామూలైందనే వాదన వినిపిస్తోంది. గత ప్రభుత్వం బీవోటి పద్ధతి ప్రతిపాదిసే.. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిని ప్రతిపాదిస్తుండడంతో పోర్టు అభివృద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మచిలీపట్నం : బందరు పోర్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే ఆరునెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని జిల్లాకు చెందిన మంత్రులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలు పూర్తికావస్తోంది. ఇంత వరకు పోర్టు పనులు ప్రారంభానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోర్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పోర్టు నిర్మిస్తామని ప్రకటించారే తప్పా ఏ మేరకు నిధులు కేటాయిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు. కాగా గత ప్రభుత్వ హయాంలో బందరు పోర్టు నిర్మాణాన్ని బీవోటీ పద్ధతిలో నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. టీడీపీ ప్రభుత్వంలో పీపీపీ పద్ధతి ద్వారా పోర్టు నిర్మిస్తామని చెబుతుండటంతో... అసలు పోర్టు పనులు ప్రారంభమవుతాయా అనే అనుమానాలకు తెరలేస్తుంది. 13 సంవత్సరాలుగా బందరు పోర్టు నిర్మించాలనే ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ పోర్టు నిర్మాణం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ ఈ అంశాన్ని సాగదీస్తూ వస్తున్నారు. నవయుగ సంస్థతో చర్చలే జరపలేదు ... బందరు పోర్టు నిర్మాణ పనులను నవయుగ కన్సార్టియం సంస్థకు 2010 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య అప్పగించారు. 2012 మే 2వ తేదీన పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి 5324 ఎకరాలను కేటాయిస్తూ జీవో నంబరు 11ను జారీ చేశారు. అప్పటి నుంచి భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ముందడుగు పడలేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల వ్యవధిలో బందరుపోర్టు పనులు దక్కించుకున్న నవయుగ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదు. భూసేకరణ ఉత్తర్వులు జారీ చేయలేదు. కాగా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
వర్మ సినిమా ఆడియా ఫంక్షన్ కు రోశయ్య
నాందాండ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ రోశయ్యను నిర్మాత దేవిశ్రీదేవి సతీష్ ఆహ్వానించారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం నాందాండ. హిందీలో వచ్చిన సత్య సినిమాకు ఇది సీక్వెల్. హిందీ, తెలుగు, తమిళ భాషాల్లో ఇది తెరకెక్కుతోంది. తమిళ వెర్షన్ ను సతీష్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై దేవిశ్రీదేవి సతీష్ నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ముంబయి ముద్దుగుమ్మలు అనైక, అనీషా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో సురేష్, తలైవాస్ విజయ్ కనిపించనున్నారు. కథేంటి రామ్‌గోపాల్ వర్మ చిత్రాలు ఇలా ఉంటాయని ఊహించడం కష్టం. ఆయన దర్శకశైలి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే వైవిధ్యభరిత కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో వర్మది అందెవేసిన చేయి. అలాంటి దర్శకుడు ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం నాందాండా అని నిర్మాత సతీష్ పేర్కొన్నారు. ఆయన చిత్రీకరణ ఎంత వేగంగా ఉంటుందో అంత అద్భుతం గా ఉంటుందని తెలిపారు. రౌడీలకు రౌడీగా మారితే జరిగే పరిణామాలేమిటన్నది నాందాండా చిత్ర కథ అని చెప్పారు. శరవేగంగా నిర్మాణం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని సతీష్ వెల్లడించారు. చిత్ర షూటింగ్ తుది షెడ్యూల్ ఈ నెల 13 నుంచి చెన్నైలో జరగనుందని తెలిపారు. మరోపక్క డబ్బింగ్, ఎడిటింగ్, రీరికార్డింగ్, స్పెషల్ ఎఫెక్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెలలోనే ఆడియో ఈ నెలలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ రోశయ్యను ఆహ్వానించినట్లు వెల్లడించారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ట్రైలర్‌కు కలైపులి థాను వాయిస్ ఓవర్ నాందాండ ఉత్తర చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రమని సతీష్ వివరించారు. చిత్ర సంభాషణలు ఆ ప్రాంత యాసలోనే ఉంటాయని చెప్పారు. చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని భావించానన్నారు. అందువలనే ఉత్తర మద్రాసులో పుట్టిన పెరిగిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థానుతో ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించామని తెలిపారు. ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్.థాను తొలిసారిగా వాయిస్ ఓవర్ ఇస్తున్న చిత్రం నాందాండా కావడం విశేషం.