k9
-
లద్దాఖ్‌లో ‘వజ్ర’ రెజిమెంట్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో భారత్ అప్రమత్తమైంది. వాస్తవా«దీన రేఖ వెంబడి డ్రాగన్ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది. ‘పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది. ఇటీవలే ఉత్పత్తయిన ఈ హొవిట్జర్ల మొత్తం రెజిమెంట్‌ను ఇక్కడ మోహరించాం. ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి’అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ‘చైనా వైపు పరిణామాలను నిత్యం కనిపెట్టి చూస్తున్నాం. తూర్పులద్దాఖ్‌తోపాటు, మన తూర్పు కమాండ్ పరిధిలో చైనా గణనీయంగా బలగాలను మోహరించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి దుందుడుకు చర్యనైనా తిప్పికొట్టేందుకు ఉపక్రమించాం. ఆర్మీ, ఆయుధ సంపత్తి మోహరింపుతోపాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచాం’అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. కాగా, దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర. ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. భారత్–చైనాల మధ్య వాస్తవా«దీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్ ఖండిస్తోంది. గత ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి. -
వైరల్ వీడియో: బాగ్దాదీ అంతానికి ట్రైనింగ్
న్యూయార్క్: సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అమెరికా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన శునకం (కే9) ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. అయితే ఉగ్రవాదులను వేటాడటానికి ఆ కుక్కకు అమెరికా సైన్యాలు ఇస్తున్న ట్రైనింగ్ చూస్తే షాకవ్వక తప్పదు. బాగ్దాది హతం అనంతరం ఆ కుక్కపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా సైన్యం ఆ కుక్కు చేసే సైనిక విన్యాసాల వీడియోను సోషల్ మీడియోలో షేర్ చేసింది. వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. Belgian Malinois.. The breed of dogs used by US special forces... To track and kill Baghdadi. pic.twitter.com/QeJzB31Xuc — Archie{Col Vijay S Acharya(R)} (@archie65) November 2, 2019 -
బాగ్దాదీని తరిమిన కుక్క
బాగ్దాదీని తుదముట్టించడంలో బలగాలకు సాయంగా ఉన్న శునకం ‘కే–9’ఫొటోను అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో షేర్ చేశారు. రహస్య సొరంగం చివరికి వెళ్లిన బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో ‘కే–9’ స్వల్పంగా గాయపడింది. ‘బాగ్దాదీ కోసం చేపట్టిన ఆపరేషన్‌లో కే–9 పేరున్న ఈ కుక్క అద్భుత పనితీరు చూపింది’అంటూ బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన ఆ కుక్కపై ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆ శునకం పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. -
రైతులకు అందుబాటులో కే–9
- వచ్చే ఖరీఫ్‌లో సబ్సిడీతో పంపణీ - వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన కదిరి–9 (కే–9) విత్తన వేరుశనగను ఖరీఫ్–2017లో రాయితీతో రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రస్తుత ఎంపిక చేసిన కొందరు రైతులకు అందజేసి రబీలో ప్రయోగాత్మకంగా పండిస్తున్నామన్నారు. 50 శాతం రాయితీతో జిప్సం, జింక్‌సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు అందజేసి పంట దిగుబడులు బాగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరింఆచరు. మొత్తం పంట ఉత్పత్తులను సేకరించి ఖరీఫ్‌లో ఎక్కువ మంది రైతులకు విత్తనం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. వర్షాభావ ప్రాంతమైన జిల్లాలో బెట్టను తట్టుకుని పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నందున ఖరీఫ్‌లో కొంత మొత్తంలో కే–9 రకపు సాగు విస్తీర్ణం పెంచనున్నట్లు చెప్పారు. కే–9 రకం వివరాలు.. ఇది ఒక రకంగా తీగరకం వేరుశనగ. ఆకులు చిన్నవిగా, మందంగా, ముదురు ఆకుపచ్చరంగులో ఉంటాయి. అందువల్ల ఎండకు బాగా తట్టుకుంటుంది. రెమ్మలు దళసరిగా ఉంటాయి. ఎండిన తర్వాత కూడా లొత్తగా కాకుండా గట్టిగానే ఉంటుంది. కీలకమైన పూత దశలో కూడా 45 రోజుల వరకు వర్షాలు లేకున్నా బెట్టను తట్టుకుని నిలబడుతుంది. ఆ తర్వాత వర్షానికి వెంటనే తేరుకోగలదు. తెగుళ్లు తట్టుకునే శక్తి ఎక్కువ. ఆకుముడుత, ఆకుమచ్చ తెగుళ్లు సోకే అవకాశం చాలా తక్కువ. తీగరకం మాదిరిగా కాయలు కొమ్మల చివర వరకు ఊడలు దిగి కాస్తాయి. కొమ్మలను ఊడదశలో (40 నుంచి 50 రోజుల్లో) తడికెతో తొక్కి నేలకు దగ్గర చేస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి పరమైన ఇబ్బందుల వల్ల పంట సకాలంలో తీయలేకపోయినా, నిద్రావస్థ దశ ఉన్నందున ముదిరిన కాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ మొలకెత్తవు. తీగరకం కావడంతో రెమ్మలు భూమిపైకి పాకుతాయి. నీటి ఆధారంగా సాగు చేసే ప్రాంతాల్లో ఇరుసాళ్లలో వేయకూడదు. ఎకరాకు 50 నుంచి 60 కిలోల విత్తనం అవసరం. పంట కాలం 120 నుంచి 130 రోజులు. నూనె శాతం కూడా ఎక్కువే. పంట తొలగించేదాకా ఆకులు రాలవు. పశుగ్రాసం బాగా వస్తుంది. జాగ్రత్తలు: తీగజాతి వేరుశనగ కావడం, విత్తనం 30 రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. దీంతో పంట తొలగించిన వెంటనే అదే విత్తనాన్ని సాగు చేస్తే మొలకశాతం తగ్గిపోతుంది. ఒక వేళ అదే విత్తనాన్ని వేయాలనుకుంటే యంత్రాల్ ద్రావణం ద్వారా నిద్రావస్థను తొలగించాలి. ఈ రసాయన ముందు అన్ని చోట్ల లభ్యమవుతుంది. పండ్లను తొందరగా మాగడానికి ఈ మందును వినియోగిస్తారు. 100 కిలోల విత్తనానికి 100 మిల్లిలీటర్ల మందు 200 లీటర్ల నీటికి కలిపి 12 గంటల పాటు డ్రమ్ములో ఉంచాలి. తర్వాత తడి ఆరేవరకు అంటే ఒకట్రెండు గంటలు నీడలో అరబెట్టి విత్తుకోవాలి.