kabaddy
-
జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం
పాత తుంగపాడులో కబడ్డీ శిక్షణ జాతీయ స్థాయి పోటీలకు సమాయత్తం రాజానగరం : జాతీయ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు రాజానగరం మండలం, పాతతుంగపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానం శిక్షణాప్రాంగణమైంది. మండలంలో మారుమూల గ్రామంగా ఉన్న ఈ ప్రాంతంలో జిల్లా కబడ్డీ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు ముగింపు దశకు చేరాయి. పది రోజులుగా ఇక్కడ జరుగుతున్న ఏపీ 28వ సబ్ జూనియర్స్ జాతీయ కబడ్డీ శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపిక చేసిన 20 మంది క్రీడాకారులు కోచ్ జగదీష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారని పీఈటీ షేక్ మహబూబ్ షరీప్ తెలిపారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలపాటు ఈ శిక్షణ జరుగుతుందన్నారు. 15 రోజుల శిక్షణ అనంతరం తమిళనాడులోని కోయంబత్తూరులో ఈనెల 13, నుంచి 16 వరకు జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో వీరు పాల్గొంటారు. -
పవర్‌గ్రిడ్ కబడ్డీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: సదరన్ రీజియన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లకు చెందిన ఉద్యోగులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నారు. దాదాపు 120 మంది వివిధ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. బుధవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సదరన్ రీజియన్ (సికింద్రాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి. శేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. -
హెచ్ఏఎల్పై రైల్వే జట్టు గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఎ-లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్), ఆంధ్రాబ్యాంక్, శాట్స్ జట్లు విజయం సాధించాయి. ఎల్బీస్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్సలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్సీఆర్ జట్టు 23-12 స్కోరుతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) జట్టుపై అలవోక విజయం సాధించింది. రైల్వే జట్టులో అంకిరెడ్డి, అమిర్ రాణించగా, హెచ్ఏఎల్ జట్టులో కిషోర్ రైడింగ్‌లో ఆకట్టుకున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఆంధ్రాబ్యాంక్ 22-19తో సాయ్ ఎస్టీసీపై చెమటోడ్చి నెగ్గింది. ఆంధ్రాబ్యాంక్ జట్టులో సతీశ్ కుమార్, వెంకటేశ్ అదరగొట్టారు. సాయ్ తరఫున అన్వేశ్ క్రమం తప్పకుండా పారుుంట్లు సాధించిపెట్టాడు. చివరి మ్యాచ్‌లో స్పోర్ట్స అథారిటీ (శాట్స్) జట్టు 30-25తో తెలంగాణ ఆర్టీసీ జట్టును ఓడించింది. శాట్స్ జట్టులో శివానంద, నిరీక్షణ్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ తరఫున రాజేశ్, భరత్ మెరుగ్గా ఆడారు.