హెచ్‌ఏఎల్‌పై రైల్వే జట్టు గెలుపు | railways team beats haal | Sakshi
Sakshi News home page

హెచ్‌ఏఎల్‌పై రైల్వే జట్టు గెలుపు

Published Thu, Sep 22 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

railways team beats haal

సాక్షి, హైదరాబాద్: ఎ-లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్), ఆంధ్రాబ్యాంక్, శాట్స్ జట్లు విజయం సాధించాయి. ఎల్బీస్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్‌‌సలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌సీఆర్ జట్టు 23-12 స్కోరుతో హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) జట్టుపై అలవోక విజయం సాధించింది. రైల్వే జట్టులో అంకిరెడ్డి, అమిర్ రాణించగా, హెచ్‌ఏఎల్ జట్టులో కిషోర్ రైడింగ్‌లో ఆకట్టుకున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఆంధ్రాబ్యాంక్ 22-19తో సాయ్ ఎస్‌టీసీపై చెమటోడ్చి నెగ్గింది. ఆంధ్రాబ్యాంక్ జట్టులో సతీశ్ కుమార్, వెంకటేశ్ అదరగొట్టారు. సాయ్ తరఫున అన్వేశ్ క్రమం తప్పకుండా పారుుంట్లు సాధించిపెట్టాడు. చివరి మ్యాచ్‌లో స్పోర్‌‌ట్స అథారిటీ (శాట్స్) జట్టు 30-25తో తెలంగాణ ఆర్టీసీ జట్టును ఓడించింది. శాట్స్ జట్టులో శివానంద, నిరీక్షణ్ రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ తరఫున రాజేశ్, భరత్ మెరుగ్గా ఆడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement