Kahaani 2
-
బాలీవుడ్ భామ.. హంగామా
బాలీవుడ్ భామ విద్యాబాలన్ నగరంలో సందడి చేశారు. తాను నటించిన ‘కహానీ 2’ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ‘తక్ష్’ మల్టీక్యుజిన్ రెస్టారెంట్‌కు వచ్చిన ఆమె చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఇదొక అద్భుతమైన సినిమాని, తన కెరీర్లో ఓ మైలురారుుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం మాదాపూర్‌లోని ఎస్మార్ట్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను సందర్శించి కస్టమర్లను పలకరించారు. సరికొత్త బ్రాండ్ ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి విడుదల చేశారు. అదే విధంగా కూకట్‌పల్లిలోని సుజనాఫోరం మాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ‘సెల్ఫీ ఫెస్టివల్’ను లాంఛనంగా ప్రకటించారు. గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ 11న ‘సెల్ఫీ పండుగ’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. - సాక్షి, సిటీబ్యూరో/ బంజారాహిల్స్ -
దుర్గారాణీ.. ఎక్కడున్నావ్?
ఈ ఫొటోలోని మహిళ పేరు దుర్గారాణీ సింగ్ (ఒరిజినల్‌గా అయితే విద్యా బాలనే). వయసు.. 36 ఏళ్లు (ఈ సినిమా లెక్కల్లో రెండేళ్లు దాచేశారు). ఎత్తు.. ఐదు అడుగుల నాలుగు అంగుళాలు (హీల్స్ వేసుకుంటే ఇంకా ఎత్తుగా కనిపించే అవకాశం ఉంది). కిడ్నాపింగ్ అండ్ మర్డర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మోస్ట్ వాంటెడ్ లేడీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘కహానీ 2’ చూడమంటున్నారు దర్శకుడు సుజోయ్ ఘోష్. ఆయన దర్శకత్వంలో విద్యాబాలన్ ముఖ్యతారగా నటిస్తున్న చిత్రమిది. 2012లో విడుదలైన సూపర్‌హిట్ సస్పెన్స్ థిల్లర్ ‘కహానీ’కి సీక్వెల్. ఇందులో విద్యాబాలన్ డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విద్యా ఫస్ట్ లుక్‌ను ‘వాంటెడ్’ అంటూ టీవీలో న్యూస్ రీడర్ వార్త చదువుతున్నట్టు ఆసక్తికరంగా పోస్టర్ రూపంలో విడుదల చేశారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకూ దుర్గారాణీ సింగ్ కిడ్నాప్ చేసింది ఎవర్ని? హత్య చేసింది ఎవర్ని? అనే వివరాలు సస్పెన్సే. -
ఔను! ఆమె మోస్ట్ వాంటెడ్ మర్డరర్!!
-
ఔను! ఆమె మోస్ట్ వాంటెడ్ మర్డరర్!!
పేరు: దుర్గారాణి సింగ్. వయస్సు 36 ఏళ్లు. శరీర ఛాయ తెలుపు. ఎత్తు ఐదడుగుల నాలుగు అంగుళాలు. కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ఆమె మోస్ట్ వాంటెడ్ నిందితురాలు. ఆమె జాడ గురించి ఏమాత్రం తెలిసినా పోలీసులకు సమాచారం అందించండి అంటూ బ్రేకింగ్ న్యూస్ చదువుతున్న దృశ్యాన్ని.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ కహానీ-2’ ఫస్ట్ పోస్టర్, టీజర్‌గా విడుదల చేశారు. సుజయ్ ఘోష్ దర్శకత్వంతో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ’కహానీ’ సినిమా సూపర్ హిట్ అయింది. నయనతార కథానాయికగా ‘అనామిక’ పేరుతో శేఖర్ కమ్ముల తెలుగులో దీనిని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘కహానీ’కి సీక్వెల్ రాబోతున్నది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్లోనూ విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్, టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. -
నేను కోలుకున్నా: హీరోయిన్
ముంబయి : డెంగ్యూ జ్వరం నుంచి తాను కోలుకున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ వెల్లడించింది. గతవారం ఆమెకు డెంగ్యూ సోకిన విషయం తెలిసిందే. దీంతో విద్యాబాలన్ ఓ పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై విద్యా బాలన్ ..‘గుడ్ మార్నింగ్ ఆల్, నా మీద చూపిన ప్రేమ, ఆప్యాయతలకు అందరికి కృతజ్ఞతలు. నేను ఇంట్లోనే కోలుకుంటున్నా. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక విద్యా నటించిన కహానీ-2 చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బేగం జాన్ తో పాటు మరోవైపు ప్రముఖ మలయాళ రచయిత్రి కమలా దాస్ బయోపిక్‌కి విద్యాబాలన్ సిద్ధం అవుతున్నారు. Good mornin all