నేను కోలుకున్నా: హీరోయిన్
ముంబయి : డెంగ్యూ జ్వరం నుంచి తాను కోలుకున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ వెల్లడించింది. గతవారం ఆమెకు డెంగ్యూ సోకిన విషయం తెలిసిందే. దీంతో విద్యాబాలన్ ఓ పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం జుహు తారా రోడ్డులోని సొంత ఇంటిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై విద్యా బాలన్ ..‘గుడ్ మార్నింగ్ ఆల్, నా మీద చూపిన ప్రేమ, ఆప్యాయతలకు అందరికి కృతజ్ఞతలు. నేను ఇంట్లోనే కోలుకుంటున్నా. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక విద్యా నటించిన కహానీ-2 చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బేగం జాన్ తో పాటు మరోవైపు ప్రముఖ మలయాళ రచయిత్రి కమలా దాస్ బయోపిక్‌కి విద్యాబాలన్ సిద్ధం అవుతున్నారు.
Good mornin all