కథలకూ ఆన్లైనే!
• కథలు, సీరియల్స్, నవలలకు వేదిక కహానియా
• ఇందులో 15 వేల కథలు, 250 సీరియళ్లు, 50 నవలలు
• రచరుుతలకు, పాఠకులకు మధ్య వారధి సేవలు
• 2 వారాల్లో రూ.కోటి నిధుల సమీకరణ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కథ.. నాటిక.. నవల.. ఏదైనా సరే భావాలను, సామాజిక పోకడలను ప్రతిబింబిస్తుందంటారు. అందుకే అవి రాయాలంటే వివేకమే కాదు పాఠకులను ఆకట్టుకునే నేర్పూ కావాలి మరి. అలా అని రాసిన ప్రతి కథా అచ్చు వేసుకోలేం కదా! మరి, అవి పాఠకులను చేరేదెలా? పోనీ, ఆన్లైన్లో సొంత బ్లాగ్‌లో రాస్తే.. అవి చేరే రీడర్స్ సంఖ్యెంత?
⇔ మీలాంటి రచరుుతల అవసరాలనే తీరుస్తోంది కహానియా.కామ్! ఇందులో తెలుగులోనే కాదు ప్రపంచలోని ఏ భాషలోనైనా కథలు, నవలలు, నాటికలు రాసుకోవచ్చు. కేవలం రాయటమే కాదు.. మీ కథలను అమ్ముకోవచ్చు కూడా.
⇔ పాఠశాల నుంచి మిత్రులైన దేవెందర్, జెస్వంత్, పల్లవ్, సందీప్ నలుగురు కలిసి ఈ ఏడాది మేలో హైదరాబాద్ కేంద్రంగా కహానియా.కామ్‌ను ప్రారంభించారు. రచరుుతలను, పాఠకులను కలపటమే కహానియా.కామ్ ప్రత్యేకత.
⇔ తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాళీ, మరాఠీ, గుజరాతీ, ఓడియా, పంజాబి 11 భాషల్లో కథలు రాసుకోవచ్చు. చదువుకోవచ్చు కూడా. ప్రింట్ చేసుకునే అవకాశం లేదు. కనీసం కాపీ చేసుకునే వీలు కూడా ఉండదు. సో.. మీరు రాసిన కథకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథలు, నవలలు, సీరియల్స్ కహానియాలో చదువుకోవచ్చు, రాసుకోవచ్చు కూడా.
⇔ {పస్తుతం కహానియాలో 15 వేల కథలు, 250 సీరియళ్లు, 50 నవలలున్నారుు. ఇందులో పిల్లల కథలు, హాస్య, నాటక, కాల్పనిక, ప్రేరణాత్మక, జానపద, చారిత్రక, శృంగార, సామాజిక.. ఇలా అన్ని రకాల కథలున్నారుు. కొత్త రచరుుతలే కాకుండా మల్లాది వెంకటకృష్ణ మూర్తి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, శ్రీరమణ, ఖదీర్‌బాబు వంటి ప్రముఖుల రచనలూ ఉన్నారుు. సుమారు 450 మంది రచరుుతలున్నారు.
⇔ కహానియాలో ఫ్రీ, పెరుుడ్ రెండు రకాల కథలుంటారుు. పెరుుడ్ స్టోరీస్‌లో మాకు ఆదాయం వస్తుంది. ఒక్కో కథపై 50-60 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. ఇలా గత నెలలో రూ.1.10 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాం. విస్తరణలో భాగంగా మరో 3 నెలల్లో అనువాదకుల కోసం ఆదాయ మార్గాన్ని తీసుకొస్తున్నాం. ఇదేంటంటే.. ఇతర భాషల్లోని కథలను స్థానిక భాషల్లో తర్జుమా చేసి కొంత ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం కహానియాలో ఉద్యోగుల సంఖ్య 7 మంది. ఈ నెలాఖరుకల్లా నిధుల సమీకరణ పూర్తి చేయనున్నాం. ప్రైవేట్ ఇన్వెస్టర్ నుంచి రూ.కోటి పెట్టుబడులు సమీకరించాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...