kakarla
-
కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా..
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సరేష్‌కు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి బొల్లినేని రామారావు అధిష్టానంపై ఫైర్ అయ్యారు. ‘కాకర్ల ఎలా గెలుస్తారో నేను చూస్తా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నా సత్తా ఏంటో చూపిస్తా.. పన్నెండేళ్లుగా పార్టీ కోసం సర్వం అర్పించా.. ఉదయగిరిలో పార్టీకి దిక్కు లేని సమయంలో పార్టీని, క్యాడర్‌ను కాపాడుకున్నా.. ఆర్థికంగా ఎంతో నష్టపోయా.. ఇప్పుడు డబ్బు సంచులకు అమ్ముడుపోయి, కనీసం రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఉదయగిరి టికెట్ ఇచ్చి నా గొంతు కోశారు..’ అంటూ తన ఆంతరంగికుల వద్ద బొల్లినేని రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరిలో బొల్లినేని శుక్రవారం టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు తనను మోసం చేయరు అని చెప్పి 12 గంటలు గడవక ముందే నియోజకవర్గ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్‌కు గురయ్యారు. నమ్మిన వారిని నట్టేట ముంచే గుణం ఉన్న చంద్రబాబు బొల్లినేని విషయంలో అలాగే చేశారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉదయగిరి నుంచి మా నాయకుడు బొల్లినేని బరిలో ఉంటారు.. ఇక్కడ చంద్రబాబు ఆటలు సాగవు.. కాకర్ల సురేష్ పేరును వెంటనే విత్‌డ్రా చేసుకుని బొల్లినేనిని అభ్యర్థిగా ప్రకటించాలి.. లేకపోతే మా సత్తా ఏంటో ఎన్నికల్లో చూపిస్తాం..’ అంటూ బొల్లినేని అనుచర వర్గం తీవ్ర ఆగ్రవేశాలతో రగిలిపోతున్నారు. ఉదయగిరిలో ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఏ పంచాయతీలో టీడీపీ నాయకుడు ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఎలా ప్రకటిస్తారంటూ టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు. ‘లోకేశ్ డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నారు.. కాకర్లను ఎలా గెలిపిస్తారో చూస్తాం.. మీరేమీ అధైర్యపడొద్దు’ అంటూ బొల్లినేనికి ఆయన అనుచరులు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై ఫైర్ టీడీపీ జాబితా మరో గంటలో ప్రకటించే ముందు చంద్రబాబు బొల్లినేనికి ఫోన్ చేసి.. ‘కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టికెట్ ఇస్తున్నాం.. మీకు రాజ్యసభ సీటు ఇస్తాం’ అని చెప్పబోతుండగా బొల్లినేని తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా తనను వాడుకొని, ఇప్పుడు కరివేపాకులా తీసిపడేయడం ఏంటని గట్టిగా అధినేతపై ఫైర్ అయినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు వారించేందుకు ప్రయత్నించగా.. ఉదయగిరిలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ బొల్లినేని ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. వెంటనే తన అనుచరులతో మాట్లాడుతూ ‘కాకర్లను ఓడించి తీరాలి.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడి మన సత్తా చూపిద్దాం..’ అని బొల్లినేని అన్నట్లు తెలిసింది. త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అనుచరులతో అన్నట్లు సమాచారం. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని బొల్లినేని వైఎస్సార్పీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. రాజీనామా బాటలో బొల్లినేని అనుచరులు టీడీపీ ఉదయగిరి టికెట్ కాకర్ల సురేష్‌కు ప్రకటించడంతో తీవ్రంగా రగిలిపోతున్న బొల్లినేని అనుచరుల్లో కొంతమంది ఆ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ దుత్తలూరు మండల కేంద్రం ఇన్చార్జి కండగుంట్ల వెంకటరెడ్డి పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. పలు మండలాల్లో ఆదివారం సమావేశాలు నిర్వహించి పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ ప్రకటన కాకర్ల వర్గీయుల్లో ఆనందాన్ని నింపితే.. బొల్లినేని వర్గీయులను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిణామం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
థ్రిల్‌కి గురి చేసే మీరా
ప్రముఖ దర్శకులు బాపు వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన కాకర్ల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘హలో మీరా’. గార్గేయి యాల్లాప్రగడ లీడ్ రోల్ చేశారు. జీవన్ సమర్పణలో డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. కాకర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒకే ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం ‘హలో మీరా’. వైవిధ్యభరితమైన కథలో వచ్చే ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. తెరపై కనిపించేది మీరా (గార్గేయి పాత్ర పేరు) అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలేలా ఉంటాయి. ప్రేమ, స్నేహం, స్నేహితుల కోసం దెబ్బలు తినడం, రౌడీయిజమ్, బ్రేకింగ్ న్యూస్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకుడి కళ్ల ముందు ఉండేలా జాగ్రత్త పడ్డాం. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
కంభం: రాబోయే రోజులన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవే అని గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక మధుప్రియ రెస్టారెంట్ పైన ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ పటిష్టంగా ఉందని రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. పార్టీని గెలిపించుకోవడం కోసం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటరును కలసి పార్టీ అధికారంలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రంలో పేదప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరెడ్డి, కాకర్ల శ్రీను, నరాళచెన్నారెడ్డి, మాదాసు వసంత, బల్లా చిన్నగురువయ్య, పెద్దయోగయ్య, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన కాకర్ల వాసులు అర్థవీడు మండలం కాకర్లకు చెందిన కాసులపాండు, వెన్నా రంగారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన సుమారు 200 మంది యూత్, ఇతరనాయకులు ఆదివారం రాత్రి కంభంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పాటుపడతామని అన్నా రాంబాబు నాయకత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన వైఎస్సార్ యర్రగొండపాలెం: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన పదవీ కాలంలో మైనార్టీలకు పెద్ద పీట వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆదివారం మండలంలోని వీరభద్రాపురంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా టీడీపీ నుంచి 65 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మైనార్టీలు ఆర్థిక వెసలుబాటు చెందాలని, అన్ని రంగాల్లో ముందుండాలని వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ కేబినేట్లో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించలేకపోయారని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇటీవల ఒకరికి స్థానం కల్పించి మమ అనిపించుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాతో వైఎస్సార్ సీపీ గుర్తుపై పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే డెవిడ్‌రాజు ధనదాహంతో అధికారపార్టీలోకి చేరారని, అటువంటివారిని మరోసారి నమ్మవద్దని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి మాట అటుంచి ఆయన మాత్రం ఎంతో అభివృద్ధి చెందిన విషయం ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. పార్టీ ఫిరాయింపు దారులకు ఎప్పుడు బుద్ది చెప్తామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. వీరభద్రాపురం, గడ్డమీదిపల్లె, ఎల్లారెడ్డిపల్లె గ్రామాలకు చెందిన నూర్బాష వర్గీయులతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన దాదాపు 200 మంది వైఎస్సార్ సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు జగన్ గుండెళ్లో స్థానం ఉందన్న విషయం గుర్తించాలన్నారు. పార్టీలో చేరినవారికి ఆయన పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. మహిళలకు ఎంపీటీసీ సభ్యురాలు ఎం.కోటమ్మ పార్టీ కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డి.మీరావలి, డి.పెద్దనాగూర్, డి.ఖాశింపీరా, డి.మీరావలి (బ్రహ్మంగారివలి), డి బాదుల్లా, కొలికి అంబయ్య, ఎం.కోటయ్య, ఎం.శ్రీను, ఎం.బ్రహ్మయ్య, జి.వెంకయ్య, జి.బొర్రయ్య, వి.యోగయ్య, ఎస్.ఏడుకొండలు ఆధ్వర్యంలో ఆయా కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు డి.కిరణ్‌గౌడ్, ఎ.శ్రీరాములు, వెన్నా మోహన్‌రెడ్డి, ఎం.ఆదిశేషులు పాల్గొన్నారు. -
ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారిస్తాం: వైవీ
ప్రకాశం: జిల్లాలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఏడవ రోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రకాశం జిల్లా గుండెకాయ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని వారం రోజుల క్రితం పాదయాత్ర చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా కాకర్ల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన సభలో వైవీ ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అసైన్డ్ భూముల పేరుతో రైతులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాల ప్రజా సమస్యలు ముందుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రకు వైఎస్సార్సీపీ నేత ఆదిశేషగిరి రావు సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జలకళ అని చంద్రబాబు అనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే బాబు కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కరవు కమ్మేసిందని, ఫ్లోరిన్ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు కాకమ్మ కథలు చెబుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని వెల్లడించారు. తాజాగా సంక్రాంతికి నీళ్లు ఇస్తానని చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. ‘ నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయడం అసాధ్యం. పాత కాంట్రాక్టర్లను తొలగించి చంద్రబాబు తన బినామీలను పెట్టుకున్నాడు. చంద్రబాబూ అబద్ధాలు మాని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. నామీద చౌకబారు ఆరోపణలు మానుకో.నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ, చంద్రబాబు బినామీ. నలభై ఏళ్ల అనుభవంతో చంద్రబాబు కడుతున్న రాజధాని నేడు ముగిపోతుంది. నాపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు మానుకుంటా. ఎవరితోనైనా బాబు కాపురం చేయగలడు. కాంగ్రెస్‌తో, టీడీపీ కలవడంలో ఆశ్చర్యం లేదు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడ’ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. -
భార్య మృతితో మనస్తాపం చెంది...
తిరువూరు : కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె భర్త, కుమార్తె తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో వీరిద్దరు కూడా ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆ క్రమంలో భర్త మృతి చెందగా.. కుమార్తె మాత్రం విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకర్లకు చెందిన ఏడుకొండలు (30) భార్య ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. చేతబడి చేస్తామని కోయవాళ్ల నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య మరణంతో ఏడుకొండలతోపాటు కుమార్తె రమ్య తీవ్ర మనస్థాపం చెందారు. దాంతో బుధవారం రమ్య, ఎడుకొండలు పురుగుల మందు తాగారు. ఆ విషయాన్ని గమనించిన బంధువులు వెంటనే ఏడుకొండలను ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుమార్తె రమ్య మాత్రం విజయవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఏడుకొండలు దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటనతో కాకర్లలో విషాదఛాయలు అలముకున్నాయి.