భార్య మృతితో మనస్తాపం చెంది... | father and daughter suicide attempt in krishna district | Sakshi
Sakshi News home page

భార్య మృతితో మనస్తాపం చెంది...

Published Wed, Jul 27 2016 1:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

father and daughter suicide attempt in krishna district

తిరువూరు : కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె భర్త, కుమార్తె తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో వీరిద్దరు కూడా ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆ క్రమంలో భర్త మృతి చెందగా.. కుమార్తె మాత్రం విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

కాకర్లకు చెందిన ఏడుకొండలు (30) భార్య ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. చేతబడి చేస్తామని కోయవాళ్ల నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య మరణంతో ఏడుకొండలతోపాటు కుమార్తె రమ్య తీవ్ర మనస్థాపం చెందారు.

దాంతో బుధవారం రమ్య, ఎడుకొండలు పురుగుల మందు తాగారు. ఆ విషయాన్ని గమనించిన బంధువులు వెంటనే ఏడుకొండలను ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుమార్తె రమ్య మాత్రం విజయవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఏడుకొండలు దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటనతో కాకర్లలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement